ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ స్థాయి జెసిఎస్ఎస్ఐ ఇస్పత్ సురక్ష పురస్కార్ పొందిన ఆర్ఐఎన్ఎల్

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2023 3:21PM by PIB Hyderabad

22-03-2023 న ఎస్ఎస్ఓ రాంచీలో జెసిఎస్ఎస్ఐ నిర్వహించిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం జాతీయ స్థాయి భద్రత అవార్డు "ఇస్పత్ సురక్ష పురస్కార్" ను అందుకుంది. 2020-21, 2021-22 సంవత్సరాలకు గాను బీఎఫ్,ముడి సరుకుల విభాగంలో ఆర్ఐఎన్ఎల్ నాలుగు బహుమతులు గెల్చుకుంది.  2021-22 సంవత్సరానికి గాను నిర్వహణ, సర్వీస్ రంగంలో ఆర్ఐఎన్ఎల్  ఈ అవార్డు పొందింది. . 2022 సంవత్సరానికి గాను ' కాంట్రాక్టు కార్మికులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోకుండా ఉండడం ' విభాగంలో విశాఖపట్నం ఆర్ఐఎన్ఎల్   అవార్డును దక్కించుకుంది.

జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇస్పత్ సురక్ష పురస్కారం గెలుచుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని  ఆర్ఐఎన్ఎల్ సీఎండీ శ్రీ అతుల్ భట్, డైరెక్టర్ (ప్రాజెక్ట్), అడిషనల్ ఛార్జ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఏకే బాగ్చి అభినందించారు.

ఉక్కు పరిశ్రమలో భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణం పై ఏర్పాటైన సంయుక్త కమిటీ (జెసిఎస్ఎస్ఐ)ని గతంలో 'ఉక్కు పరిశ్రమకు భద్రతపై స్టాండింగ్ కమిటీ' (ఎస్సిఎస్ఎస్ఐ) అని వ్యవహరించేవారు.  1973 ఏప్రిల్ 27 నుంచి జెసిఎస్ఎస్ఐ  ఉనికిలోకి వచ్చింది.

 ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉక్కు కంపెనీలకు చెందిన మేనేజ్ మెంట్ మరియు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో  ఒక ప్రత్యేకమైన జాతీయ స్థాయి ద్వైపాక్షిక వేదికగా జెసిఎస్ఎస్ఐ పనిచేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 1910052) సందర్శకుల సూచీ సంఖ్య : : 155
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi