రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిషాలో 100 శాతం విద్యుద్దీకరణను పూర్తి చేసిన భారతీయ రైల్వే


ఒడిషా యొక్క ప్రస్తుత బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ (2,822 రూట్ కి.మీ) ఇప్పుడు 100 శాతం విద్యుదీకరించబడింది

విద్యుదీకరణతో 2.5 రెట్లు తగ్గనున్న లైన్ హాల్ ఖర్చు

प्रविष्टि तिथि: 22 MAR 2023 4:26PM by PIB Hyderabad

2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారిణిని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విధంగా భారతీయ రైల్వేలు ఒడిషా రాష్ట్రంల ప్రస్తుత ఉన్న బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌ను 100 శాతం విద్యుద్దీకరించింది. ఒడిషా ప్రస్తుత బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ 2,822 రూట్ కిలోమీటర్లు. ఇది 100 శాతం విద్యుదీకరించబడింది. దీని ఫలితంగా లైన్ హాల్ ఖర్చు (సుమారు 2.5 రెట్లు తక్కువ) తగ్గుతుంది. రవాణా సామర్థ్యం పెరగడం, సెక్షనల్ సామర్థ్యం పెరగడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ నిర్వహణ అందుబాటులోకి రావడంత నిర్వహణ ఖర్చు తగ్గి సంస్థకు వ్యయం ఆదా అవుతుంది. లోకోలకు దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇది ఇంధన సామర్థ్యం మరియు పర్యావరణ అనుకూలమైన రవాణా విధానం. ఇకపైన కొత్త బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ విద్యుదీకరణతో పాటుగా మంజూరు చేయబడుతుంది. 100 శాతం విద్యుదీకరించబడిన నెట్‌వర్క్ యొక్క రైల్వే విధానంతో సమకాలీకరించబడుతుంది. ఒడిషా రాష్ట్ర భూభాగం ఈస్ట్ కోస్ట్, సౌత్ ఈస్టర్న్ & సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేల పరిధిలోకి వస్తుంది.

 ఒడిషాలోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు: భువనేశ్వర్, కటక్, పూరి, సంబల్పూర్, భద్రక్, రూర్కెలా మరియు ఝర్సుగూడ. ఒడిషా నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర వస్తువుల రవాణాలో రైల్వే నెట్‌వర్క్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒడిషాలో మొదటి రైలు మార్గాన్ని కటక్ - ఖుర్దా రోడ్ - పూరి మధ్య 1897లో నిర్మించారు.

ఒడిషా రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రతిష్టాత్మక రైళ్లు: హౌరా-పూరీ ఎక్స్‌ప్రెస్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ మరియు భువనేశ్వర్-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్. ఈ రైళ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందిస్తాయి.

***


(रिलीज़ आईडी: 1909858) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Odia