బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎండిఒ నమూనా ఆధారంగా ఆదాయ పంపకంతో పనిని కేటాయించిన బిసిసిఎల్
Posted On:
22 MAR 2023 5:56PM by PIB Hyderabad
భారత దేశంలో కోకింగ్ బొగ్గు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో, తవ్వకాలు/ బొగ్గు గనుల నుంచి బొగ్గను తీసి బట్వాడా చేసేందుకు తిరిగి తెరవడం, పునరుద్ధరణ, అభివృద్ధి, నిర్మాణం, కార్యకలాపాలు సాగిస్తూ ఎండిఒ నమూనాలో ఆదాయ పంపిణీ ఆధారంగా అధికార సంస్థకు ఉత్పత్తిని బట్వాడా చేసే పనిని మూడు సంస్థలకు బిసిసిఎల్ కేటాయించింది.
ఎం/ ఎస్ ఆర్‌కె ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి కాట్రాస్ ప్రాంతాన్ని 25 సంవత్సరాలకు బిసిసిఎల్ తో 9% ఆదాయ పంచుకునే ప్రాతిపదికన ప్రదానం చేసింది. భారత దేశంలో కోకింగ్ కోల్‌కు ఇది తొలి యత్నం. ప్రతిపాదిత వార్షిక సార్ధ్యమైన 1.4 మెట్రిక్ టన్నుల ఆధారంగా 25 ఏళ్ళపాటు కోట్ చేసిన 25.70 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ఎల్ఒఎను 21.03.2023న జారీ చేసింది. పిబి ప్రాంతంలో 25 ఏళ్ళపాటు 6% ఆదాయ పంపిణీ ప్రాతిపాదిక ఎం/ఎస‌్ ఈగిల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌కు పనిని బిసిసిఎల్ ప్రదానం చేసింది. ప్రతిపాదిత వార్షిక సామర్ధ్యం 2.7 మిలియన్ టన్నుల ప్రాతిపదికన 25 ఏళ్ళపాటు 52.00 ఎంటిల కోట్ చేసిన బొగ్గ ఉత్పత్తి కోసం 21.03.2023న ఎల్ఒఎ జారీ అయింది.
అలాగే, ఎం/ఎస‌్ వెన్సార్ కనస్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్‌కు 25 ఏళ్ళ కాలానికి 7.29% ఆదాయ పంపకం ప్రాతిపదిక సిజువా ప్రాంతాన్ని కేటాయించారు. ప్రతిపాదిత వార్షిక సామర్ధ్యమైన 1.285 ఎంటిల ఆధారంగా 25 ఏళ్ళలో 28.485 ఎంటిల్ కోట్ చేసిన బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 21.03.2023న ఎల్ఒఎను జారీ చేసింది.
కోకింగ్ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి అయిన బిసిసిఎల్ దశాబ్దాలుగా దేశానికి సేవ చేయడం, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణ దార్శనికత దిశగా పని చేయడం గర్వకారణమని భావిస్తోంది.
***
(Release ID: 1909831)
Visitor Counter : 150