ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో మహారాష్ట్రలోని శంభాజీ నగర్ మరియు తమిళనాడులోని కోయంబత్తూరులో సీజీహెచ్‌ఎస్ వెల్నెస్ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా
" సీజీహెచ్‌ఎస్ కేంద్రాల సంఖ్య 2014లో 25 ఉండేవి. అయితే ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సంరక్షణను అందించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశానికి అనుగుణంగా నేడు వాటి సంఖ్య 79కి పెరిగింది"
"ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన వారికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సంక్షేమాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత": డాక్టర్ మన్సుఖ్ మాండవియా
"కొత్త ఆవిష్కరణలు మరియు అభ్యాసాలతో పెన్షనర్లకు సీజీహెచ్‌ఎస్ బలమైన కవరేజీని అందిస్తుంది": డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
Posted On:
22 MAR 2023 1:24PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని శంభాజీ నగర్ మరియు తమిళనాడులోని కోయంబత్తూరులో ఈరోజు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో సీజీహెచ్‌ఎస్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌లను (హెచ్‌డబ్ల్యూసిలు) కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సహకార మరియు ఓబీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అతుల్ మోరేశ్వర్ సేవ్, పార్లమెంట్ సభ్యులు శ్రీ పీఆర్ నటరాజన్, పార్లమెంట్ సభ్యులు శ్రీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్, కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే శ్రీమతి వనతీ శ్రీనివాసన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మాండవ్య హర్షం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర, తమిళనాడు ప్రజలకు మంచి వైద్య సదుపాయాలు అందించడంలో రెండు సీజీహెచ్‌ఎస్ హెచ్‌డబ్ల్యూసీలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. శంభాజీ నగర్ మరియు కోయంబత్తూరులో సీజీహెచ్‌ఎస్ హెచ్‌డబ్ల్యూసీలను ప్రారంభించినందుకు లబ్ధిదారులను అభినందిస్తూ, " సీజీహెచ్‌ఎస్ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన వారికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సంక్షేమాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత" అని పేర్కొన్నారు.
వైద్య సేవలను సులభంగా పొందేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. 2014లో 25గా ఉన్న సీజీహెచ్‌ఎస్ కేంద్రాల సంఖ్య నేడు 79కి పెరిగిందని ఆయన వివరించారు. ఇది కమ్యూనిటీలకు చేరువగా సులభంగా అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందని తెలిపారు.
సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలను హైలైట్ చేస్తూ డాక్టర్ మన్సుఖ్ మాండవియా..రోజువారీ పర్యవేక్షణ, రీయింబర్స్‌మెంట్ల పరిష్కారం, విస్తరించడం ద్వారా లబ్ధిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి సీజీహెచ్‌ఎస్ అందిస్తున్న సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక రంగాల్లో మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల నెట్‌వర్క్ సమస్యల పరిష్కారంతో పాటు రీయింబర్స్‌మెంట్ కేసుల పెండింగ్‌ను తగ్గించాయన్నారు. కాలక్రమేణా ఆరోగ్య రంగంలో జరుగుతున్న సేవల డిజిటలైజేషన్ వంటి పరిణామాలకు అనుగుణంగా సీజీహెచ్‌ఎస్‌లో అనేక మార్పులు వచ్చాయన్నారు. నేడు 9100 కంటే ఎక్కువ జన్ ఔషధి కేంద్రాలు పౌరులందరికీ చౌకైన మరియు నాణ్యమైన మందులను అందించడం ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నాయని తెలిపారు.
"కేంద్ర ప్రభుత్వం హెచ్‌డబ్ల్యుసిలను తెరవడమే కాకుండా మరిన్ని వైద్య కళాశాలల ద్వారా వైద్య నిపుణులు మరియు వారి శిక్షణను పెంచడం ద్వారా 'టోకెన్ టు టోటల్' విధానాన్ని అనుసరిస్తోంది" అని కేంద్రమంత్రి అన్నారు. ఆరోగ్య పరమ భాగ్యం, స్వాస్త్యం సర్వార్థ సాధనం అంటే మంచి ఆరోగ్యమే గొప్ప అదృష్టమని, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడి పెట్టడం భవిష్యత్తులో పెట్టుబడి పెట్టినట్లేనని, భారతదేశం దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడానికి మరియు బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. "దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, టెలికన్సల్టేషన్లు మరియు ఏబిడీఎం వంటి డిజిటల్ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. జనౌషధి కేంద్రాలు స్థాపించబడ్డాయి మరియు ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ప్రారంభించబడింది. "అందరికీ ఆరోగ్యం" ఉండేలా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేస్తోందని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ లబ్ధిదారులను అభినందించారు. ఈ రెండు ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థనను అంగీకరించి వారికి సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను బహుమతిగా ఇచ్చినందుకు గౌరవప్రదమైన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీజీహెచ్‌ఎస్ పెన్షనర్లకు బలమైన కవరేజీని అందిస్తుంది. ఈ కేంద్రాలలో ఆవిష్కరణలు మరియు అభ్యాసాలు ప్రవేశపెట్టబడుతున్నాయి. సిజిహెచ్‌ఎస్ కింద ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆమె హైలైట్ చేశారు. "కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరునికి సంక్షేమాన్ని అందించడానికి పిఎంజేఐవై, పీఎం-ఏబిహెచ్‌ఐఎం,హెచ్‌డబ్ల్యూసిల వంటి కొన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. కోయంబత్తూర్‌లో కొత్త వెల్‌నెస్ సెంటర్‌లు, దక్షిణ భారతదేశం యొక్క టెక్స్‌టైల్ రాజధాని లేదా దక్షిణ భారతదేశంలోని మాంచెస్టర్ మరియు శంభాజీ నగర్, వస్త్ర మరియు కళాత్మక పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి చెందడం వల్ల కోయంబత్తూర్ మరియు శంభాజీ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో నివసించే లబ్ధిదారులు/పెన్షనర్ల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నామన్నారు. ఉదాహరణకు, కోయంబత్తూరులో, 8000 మందికి పైగా లబ్ధిదారులు వైద్యం మరియు మందుల కోసం 400-500 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సమస్య తీరింది. కోయంబత్తూరు మరియు శంభాజీ నగర్ సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌లు లబ్ధిదారులకు ఓపీడీ సేవలతో పాటు అవి ఫంక్షనల్ అయిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్యానెల్‌లోకి వస్తాయి. మరియు ప్రైవేటు ఆసుపత్రుల నుండి కూడా నగదు రహిత వైద్య చికిత్సను పొందేందుకు పెన్షనర్లు సహాయపడతాయి.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరార్ లబ్ధిదారులను అభినందించారు. పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్యం & వెల్‌నెస్ రంగంలో దేశం భారీ ప్రగతిని సాధిస్తోందని అన్నారు.
****
(Release ID: 1909538)
Visitor Counter : 197