ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో లెప్రసీ కేసుల తాజా స్థితిగతులు
2027 నాటికి కుష్టు వ్యాధి సున్నా వ్యాప్తిని సాధించడానికి
కుష్టు వ్యాధి (2023-27) జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక, రోడ్‌మ్యాప్
Posted On:
21 MAR 2023 2:55PM by PIB Hyderabad
సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్ డి జి) 3.3 కంటే మూడు సంవత్సరాల ముందుగా 2027 నాటికి కుష్టు వ్యాధి సున్నా వ్యాప్తి అంటే అసలు వ్యాప్తి జరగకూడదనే లక్ష్యంతో 2023 జనవరి 30న భారత ప్రభుత్వం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (ఎన్ ఎస్ పి), రోడ్‌మ్యాప్ ఫర్ లెప్రసీ (2023-27)ని ప్రారంభించింది . ఎన్ ఎస్ పి, రోడ్‌మ్యాప్‌లో అమలు వ్యూహాలు, సంవత్సర వారీ లక్ష్యాలు, ప్రజారోగ్య విధానాలు, ప్రోగ్రామ్ కోసం మొత్తం సాంకేతిక మార్గదర్శకాలు ఉన్నాయి. స్ట్రాటజీ, రోడ్‌మ్యాప్ జీరో స్టిగ్మా, వివక్షపై అవగాహన, ముందస్తు కేసుల గుర్తింపును ప్రోత్సహించడం, ప్రొఫిలాక్సిస్ (లెప్రసీ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్) ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించడం, కుష్టు వ్యాధి కేసులను నివేదించడం కోసం వెబ్ ఆధారిత సమాచార పోర్టల్ (నికుస్త్ 2.0)ను రూపొందించడంపై దృష్టి పెడుతుంది.
జాతీయ స్థాయిలో నిర్మూలన స్థితిని సాధించిన తర్వాత, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్ ఎల్ ఈ పి) గ్రేడ్ 2 వైకల్యాలను నివారించడానికి, కుష్టు రోగులకు ఉచితంగా చికిత్స అందించడానికి కుష్టు రోగులను ముందస్తుగా గుర్తించడాన్ని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. కుష్టు వ్యాధి స్థానికంగా ఉన్న రాష్ట్రాలు/యుటిలలో కొన్ని జిల్లాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో ఎన్ ఎల్ ఈ పి క్రింద ప్రవేశపెట్టబడిన జోక్యంతో, 2014-15లో 1,25,785 నుండి 2021-22లో గుర్తించిన కొత్త లెప్రసీ కేసుల సంఖ్య 75,394కి తగ్గింది, ఇది ప్రపంచవ్యాప్త కొత్త కుష్టువ్యాధి కేసులలో 53.6%గా ఉంది. ప్రస్తుత ఎన్ ఎల్ ఈ పి రాష్ట్రాల వారీగా ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
డబ్ల్యూ హెచ్ ఓ ప్రమాణాల ప్రకారం 2005లో జాతీయ స్థాయిలో 10,000 జనాభాకు 1 కేసు కంటే తక్కువగా ఉన్న కుష్టు వ్యాధిని భారతదేశం ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించింది.
రాష్ట్రాల వారీగా ఎన్ ఎల్ ఈ పి 2022-23 ఆర్థిక సంవత్సరం వివరాలు (2023 జనవరి వరకు.. )
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
వ్యాప్తి రేటు (పిఆర్)/ 10000 జనాభాకి
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
0.5
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
0.1
|
3
|
అస్సాం
|
0.2
|
4
|
బీహార్
|
0.9
|
5
|
చత్తిస్గఢ్
|
2.3
|
6
|
గోవా
|
0.2
|
7
|
గుజరాత్
|
0.4
|
8
|
హర్యానా
|
0.1
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
0.2
|
10
|
ఝార్ఖండ్
|
1.4
|
11
|
జమ్మూ కాశ్మీర్
|
0.1
|
12
|
కర్ణాటక
|
0.3
|
13
|
కేరళ
|
0.1
|
2314
|
మధ్యప్రదేశ్
|
0.9
|
15
|
మహారాష్ట్ర
|
1.2
|
16
|
మణిపూర్
|
0.1
|
17
|
మేఘాలయ
|
0.0
|
18
|
మిజోరాం
|
0.1
|
19
|
నాగాలాండ్
|
0.1
|
20
|
ఒడిశా
|
1.2
|
21
|
పంజాబ్
|
0.2
|
22
|
రాజస్థాన్
|
0.1
|
23
|
సిక్కిం
|
0.2
|
24
|
తమిళనాడు
|
0.3
|
25
|
తెలంగాణా
|
0.7
|
26
|
త్రిపుర
|
0.0
|
27
|
ఉత్తరప్రదేశ్
|
0.4
|
28
|
ఉత్తరాఖండ్
|
0.3
|
29
|
పశ్చిమ బెంగాల్
|
0.5
|
30
|
అండమాన్ నికోబర్
|
0.1
|
31
|
చండీగఢ్
|
1.4
|
32
|
దాద్రా నాగర్ హవేలీ
|
1.0
|
33
|
డామన్ అండ్ డయ్యు
|
0.1
|
34
|
ఢిల్లీ
|
0.8
|
35
|
లక్షద్వీప్
|
0.0
|
36
|
లడఖ్
|
0.3
|
37
|
పుదుచ్చేరి
|
0.1
|
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.
****
(Release ID: 1909456)
Visitor Counter : 179