ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చర్యలు
- పీఎంజేఏవై కింద ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలోకి ద్వితీయ, తృతీయ మరియు ఉపశమన సంరక్షణతో సహా 1,949 చికిత్సా విధానాలు
Posted On:
21 MAR 2023 2:55PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం- 2010 (సీఈ చట్టం, 2010)ని అమలులోకి తెచ్చింది. దేశంలోని క్లినికల్ సంస్థల (ప్రభుత్వం మరియు ప్రైవేట్ రెండూ) రిజిస్ట్రేషన్ మరియు నియంత్రణ కోసం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (కేంద్ర ప్రభుత్వ) రూల్స్, 2012 నోటిఫై చేసింది. చట్టం ప్రకారం, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్ మరియు కొనసాగింపు కోసం ప్రతి క్లినికల్ స్థాపన ఇతర నిబంధనలతో పాటు క్రింది షరతులను కూడా నెరవేర్చాలి:
i. రోగులకు తెలిసే విధంగా సంబంధిత ఆసుపత్రిలో అందించిన అన్ని రకాల సేవలు వాటికి వసూలు చేసే చార్జీలు మరియు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఒక స్పష్టమైన ప్రదేశంలో స్థానిక మరియు ఆంగ్ల భాషలో ప్రదర్శించాలి.
ii. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స ఉండేలా చూసుకోవాలిజ. ఇప్పటివరకు అల్లోపతి విధానంలో 227 వైద్య కండీషన్లకు, ఆయుర్వేదంలో 18 కండీషన్లకు మరియు సిద్ధలో 100 కండీషన్లకు ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
iii. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మరియు జారీ చేసిన ధరల పరిధిలో సంబంధిత ఆసుపత్రి అందించే ప్రతి వైద్య ప్రక్రియ, సేవలకు రేట్లను వసూలు చేయాలి. దీని కోసం, వైద్య విధానాల యొక్క ప్రామాణిక జాబితా మరియు ఖర్చు కోసం ప్రామాణిక టెంప్లేట్ ఖరారు చేయబడ్డాయి. చట్టం వర్తించే రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలతో భాగస్వామ్యం చేయబడ్డాయి.
ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) అనే ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం కింద, ముఖ్యంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో పేద మరియు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేలా, సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అనేక చర్యలు తీసుకోబడ్డాయి. 23.09.2018న ప్రారంభించబడిన ఏబీ-పీఎంజేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద బీమా/ భరోసా పథకం. 2011 సామాజిక ఆర్థిక మరియు కుల గణన డేటాబేస్ ప్రకారం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఎంపిక చేసిన వృత్తిపరమైన ప్రమాణాల ఆధారంగా ఈ పథకం ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ఈ పథకం కింద 60 కోట్ల మంది లబ్ధిదారులకు ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరేందుకు సంవత్సరానికి ఒక్కొ లబ్ధిదారుని కుటుంబానికి రూ.5 లక్షల తొడ్పాటు అందిస్తారు. ఇంకా, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను (ఏబీ-పీఎంజేఏవై) నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్.హెచ్.ఎ) –అమలు చేస్తోంది. ఈ ఏజెన్సీ, 06 ఏప్రిల్ 2022న సవరించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలను (హెచ్.బి.పి.ఎస్) ప్రారంభించింది.
హెచ్.బి.పి.-2022లో మొత్తం 27 స్పెషాలిటీలలో ద్వితీయ, తృతీయ, ఉపశమన సంరక్షణలతో సహా 1,949 చికిత్సా విధానాలను కలిగి ఉంది. ఖర్చు, వాటాదారుల సంప్రదింపులు మరియు స్కీమ్ వినియోగం యొక్క సమీక్షపై సాక్ష్యాల ప్రకారం హెచ్.బి.పి. కింద చికిత్సా విధానాల రేట్లు నిర్ణయించబడ్డాయి. ఇంకా, భారతదేశంలో ఆరోగ్య సేవల ఖర్చుపై అధ్యయనం (సీహెచ్ఎస్ఐ) కూడా ఈ విషయంలో సమాచార నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడింది. అమలులో ఉన్న రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ డేటాసెట్‌పై మరియు రాష్ట్ర నిర్దిష్ట ప్యాకేజీలను జోడించడానికి సౌలభ్యాన్ని అందించాయి. అలాగే, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్యాకేజీ ధరను మార్చుకునే వెసులుబాటు వారికి అందించబడింది. హెచ్.బి.పి. 2022 కింద సర్వీస్ డెలివరీ ఖర్చులో ప్రాంతీయ వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి అవకలన ధరల భావన ప్రవేశపెట్టబడింది. అధిక స్థాయి మందులు, కన్జూమబుల్స్ మరియు డయాగ్నస్టిక్స్ ఒక్కో బెడ్‌కు ఒక రోజు మెడికల్ ప్యాకేజీల ఖర్చు నుండి విడదీయబడ్డాయి. మొత్తంమీద, హెచ్.బి.పి. 2022 కింద 832 విధానాలకు రేట్లు పెంచబడ్డాయి. పబ్లిక్ హెల్త్ మరియు హాస్పిటల్స్ అనేది రాష్ట్ర విషయం. సీఈ చట్టంలోని నిబంధనల అమలు మరియు పర్యవేక్షణ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం/ కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ పరిధిలోని అంశాలు. కాబట్టి, ప్రైవేట్ ఆసుపత్రులలో దోపిడీ మరియు అనైతిక ధరల విధానాలను నియంత్రించడం మరియు తగు నియంత్రణ సంబంధిత రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతం (యుటి) ప్రభుత్వ బాధ్యత. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
****
(Release ID: 1909451)
Visitor Counter : 116