రక్షణ మంత్రిత్వ శాఖ
మొజాంబిక్‌లోని మపుటో రేవును సందర్శించిన ఐఎన్ఎస్ సుజాత
प्रविष्टि तिथि:
21 MAR 2023 9:55AM by PIB Hyderabad
దక్షిణ నావికాదళ కమాండ్, కొచ్చి స్థితమైన ఐఎన్ఎస్ సుజాత అన్న ఓడ19 నుంచి 21 మార్చి 2023 వరకు విదేశీ విస్తరణ, మోహరింపులో భాగంగా మొజాంబిక్‌లోని పోర్ట్ మపుటో రేవును సందర్శించింది.
జెట్టీ (రేవు కట్ట)లో మొజాంబికన్ నావికాదళ బ్యాండ్, సంప్రదాయ ప్రదర్శనల మధ్య ఈ ఓడను కెప్టెన్ నితిన్ కపూర్, డిఎ ప్రిటోరియా కమాండెంట్ ఎన్ఆర్ఎన్ శివబాబు, కోస్ట్‌గార్డ్ అఫ్లోట్ ( అన్ని మిషన్లను అమలు చేసే బృంద) సహాయక బృందం, మొజాంబికన్ నావికాదళం నుంచి కెప్టెన్ ఫ్లోరెంటినో జోస్ నార్కిసో కోలాహలం నడుమ ఘనస్వాగతం పలికారు.
మొజాంబిక్ నావికాదళ కమాండింగ్ అధి రేర్ అడ్మిరల్ యుగెనియో దియాస్ దా సిల్వా మాటుకాను, మపుటో మేయర్ ఎనియాస్ దా కన్సీకావ్ కొమిచె, భారత హైకమిషనర్ గౌరవనీయ అంకన్ బెనర్జీ, ఇతర పౌర ప్రముఖులను ఐఎన్ఎస్ సుజాత కమాండింగ్ అధికారి కలుసుకున్నారు.
మొజాంబిక్ నావికాదళానికి చెందిన దాదాపు 40మంది సిబ్బంది శిక్షణా సౌకర్యాల పరిశీలన, డైవింగ్ ఆప్స్ గురించి సంక్షిప్త సమాచారం, విబిఎస్ఎస్ & తేలికపాటి ఆయుధాలలో శిక్షణ, దృశ్యమాధ్యమం ద్వారా సమాచారం, యంత్రాల నిర్వహణ, ఓడలో పారిశుద్ధ్యం సహా క్రాస్ డెక్ (ఓడ నుంచి ఓడ) శిక్షణ కోసం ఓడను సందర్శించారు. ఉదయం అందరికీ యోగా సెషన్, ఫుట్‌బాల్ మ్యాచ్ సహా వివిధ కార్యకలాపాలను ఇరు నావికాదళాల సిబ్బంది మధ్య నిర్వహించారు. సుజాత్ ఓడపై ఇచ్చిన ఆతిథ్యానికి/ విందుకి పలు భారతీయ/ మొజాంబిక్ ప్రముఖులు/ రాయబారులు హాజరయ్యారు.
ఐఎన్ఎస్ సుజాత మొజాంబిక్‌లోని మపుటోను సందర్శించడం అన్నది ఇరు నావికాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, పరస్పర సహకారాన్ని మరింత పెంచింది.
***
(रिलीज़ आईडी: 1909440)
आगंतुक पटल : 185