హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్ సెంట్రల్యూనివర్సిటి 4వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ యువతకు ఎన్నో రంగాలలో అద్భుత అవకాశాలను కల్పించారు.

నూతన విద్యా విధానం భారతదేశ యువతను అంతర్జాతీయ వేదికపై ప్రపంచ యువతముందు పోటీకి నిలబెట్టే శక్తి కలిగి ఉంది.

ప్రపంచ సంక్షేమం కోరుకునే, జాతికి గర్వకారణంగా నిలిచే విద్యార్ధులను తయారు చేయడం నూతన విద్యా విధానం లక్ష్యం.

జీవితాంతం విద్యార్థిగా భావించే వ్యక్తి సమాజాన్ని , వ్యవస్థను గాడిన పెట్టగలడు.

ఇండియాను గొప్పదేశంగా తీర్చిదిద్ది, దాని ఫలితాలను అందుకోవలసిన బాధ్యత విద్యార్థులు , యువతపై ఉంది.

గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ తక్కువ సమయంలో అత్యున్నత ప్రమాణాలు సాధించింది, మంచి లైబ్రరీని

ఏర్పాటు చేసుకోవడం ద్వారా, విద్యార్థులకు విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేలా కృషి చేసింది.

మన స్థానిక భాషల పద సంపదను మనం విస్తరించుకోవచ్చు. అన్ని భాషలూ సరళమైనవే. ఇది మన భాషలను, విస్తరింపుచేసుకోవడానికి, సుసంపన్నం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.

Posted On: 19 MAR 2023 9:12PM by PIB Hyderabad

గుజరాత్ కేంద్ర విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా విద్యార్థులనుద్దేశించి  మాట్లాడుతూ,  విద్యార్థులలోని జ్ఞాన తృష్ణను ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు తమ విద్యార్థి జీవితం ఆధారంగా, అలాగే స్వీయ వృద్ధి ద్వారా దేశ పురొగతికి పాటుపడాలన్నారు.  గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ స్వల్ప వ్యవధిలో అత్యుత్తమ ప్రమాణాలను సాధించిందని ఆయన చెప్పారు.   గొప్ప లైబ్రరీని ఏర్పాటు చేయడం ద్వారా ఇది విద్యార్థులకు విద్యను మరింతగా అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ప్రస్తుతం డిగ్రీలు అందుకుంటున్న బ్యాచ్ను అమృత్ మహోత్సవ్ బ్యాచ్గా గుర్తుండిపోతారని, ఎందుకంటే, ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరమని ఆయన అన్నారు. ఇది విద్యార్థులందరికీ ఎంతో గర్వకారణ మని అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ ను గొప్ ఉత్సవంలో జరుపుకునే సమయంలో ప్రధానమంత్రి ప్రజజలముందు మూడు ప్రధాన లక్ష్యాలను ఉంచారని ఆయన చెప్పారు. ముందు, దేశ యువత స్వాతంత్య్రానికి ముందు చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. రెండోది 75 సంవత్సరాలలో దేశం సాధించిన ప్రగతిని గర్వంగా భావించాలన్నారు.  మూడోది, 75 సంవత్సరాల నుంచి 100 వ సంవత్సరంలోకి మన ప్రయాణం సంకల్పాల సాధన ప్రయాణంగా భావించాలని, ప్రతి రంగంలో ఇండియాను ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచేలా చూడాలన్నారు. 75 సంవత్సరాలనుంచి 100 సంవత్సరాలకు సాగే ప్రయాణాన్ని అమృత్ కాల్ గా ప్రధానమంత్రి పేర్కొన్నారని అంటూ, ఇది సంకల్ప్ సే సిద్ధి కాలమని ఆయన అన్నారు . దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఒక అడుగు ముందుకు వేస్తే దేశం 130 కోట్ల అడుగులు ముందుకు పోతుందన్నారు. ఇండియాను గొప్ప దేశంగా, ప్రతి రంగంలో ప్రపంచంలో ముందుండేలా చేసే బాధ్యత దేశ యువతపై ఉందని ఆయన అన్నారు. ఇండియాను గొప్పగా మరింత ఉన్నత స్థాయికి చేరేలా  తీర్చిదిద్దే బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకువచ్చిన నూతన విద్యావిధానం 2020, వివాదాలు, వ్యతిరేకత లేని ఏకైక నూతన విద్యావిధానమని ఆయన అన్నారు. దీనిని అందరూ ఆమోదించారని ఆయన అన్నారు. ఈ నూతన విద్యావిధానానికి, మన దేశ యువతను ప్రపంచ వేదికపై అంతర్జాతీయ యువతతో పోటీకి నిలబెట్టే సమర్ధత కలిగి ఉందని అన్నారు. విస్తృతమైన సంప్రదింపుల ద్వారా నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు.

ఈ నూతన విద్యా విధానం , మన విద్యా వ్యవస్థను సంకుచిత ఆలోచనల నుంచి బయటపడవేసిందని ఆయన అన్నారు. విద్య లక్ష్యం డిగ్రీ సంపాదించడమో, మంచి ఉద్యోగం పొందడమో , సుఖవంతమైన జీవనం పొందడమో కాదని, సంపూర్ణ మనవుడిగా ఎదగడమని ఆయన అనారు. ఈ దిశగా మనం ఎల్లప్పుడూ కృషి చేయాలని , ఇందుకు ప్రస్తుత నూతన విద్యావిధానం సంపూర్ణ అవకాశాలు కల్పిస్తుందని ఆయన అన్నారు.
నూతన విద్యా విధానం భారతీయ విలువల ఆధారంగా రూపుదిద్దుకున్నదని, దానితో పాటే ఆధునిక విలువలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయని ఆయన అన్నారు.  ప్రపంచ సంక్షేమం,
జాతీయ ప్రతిష్టతో కూడిన భావాలను  నింపుకున్న  యువతను తయారు చేయడం నూతన విద్యావిధానం లక్ష్యమని , ఈ విధానం అంతర్జాతీయ పౌరులుగా తీర్చిదిద్దే అన్ని రకాల సామర్ధ్యాలు ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు.

నూతన విద్యావిధానంలో మాతృభాషలకు పెద్దపీట వేయడం జరిగిందని, ఏ వ్యక్తి అయినా తమ మాతృభాషలో అద్భుతంగా తమ భావాలను వెల్లడించగలరని, మెరుగైన సమర్ధతతో పరిశోధన చేయగలరని, ఇది వారి విశ్లేషణాత్మక సామర్ధ్యాన్ని పెంచుతుందని, నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. నూతన విద్యావిధానంలో భాషకు ప్రాధాన్యత ఇవ్వడానికి , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రాథమిక విద్యను తప్పనిసరిగా విద్యార్ధుల మాతృభాషలోనే  ఉండేలా నిబంధనలు
పెట్టారని అన్నారు. మన భాషలన్నీ సరళమైనవని,మన పద సంపదను పెంచుకుంటూ మన భాషలను విస్తృతం చేసుకోవచ్చని , వాటిని సుసంపన్నం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మరింత సరళత్వం తెచ్చేందుకు ఉన్నతవిద్యలో తగిన నిబంధనలు రూపొందించడం జరిగిందని, ఈ– అభ్యసనకు కూడా అవకాశం కల్పించారని అన్నారు.

దేశ యువతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్భుత అవకాశాలు కల్పించారని శ్రీ అమిత్ షా అన్నారు.  దేశంలో 2016లో 724 స్టార్టప్లు ఉండగా అవి 2022 నాటికి 70 వేలకు చేరాయని అన్నారు. 

ఇందులో 107 స్టార్టప్లు యూనికార్న్ క్లబ్లో చేరాయని, 2016లో ఇవి కేవలం నాలుగే ఉండేవన్నారు.  దేశంలోని మొత్తం స్టార్టప్ లలో 45 శాతం స్టార్టప్లు మహిళలు నిర్వహిస్తున్నారని, 45 శాతం స్టార్టప్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల లో    ఏర్పాటయ్యాయని అన్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పలు రంగాలను గుర్తించి ,మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఎన్నో కొత్త రంగాలు ఇందులో ప్రారంభమయ్యాయని, దీని ఫలితంగా,  భారతదేశపు వాణిజ్య ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను దాటాయని ఆయన అన్నారు. పిఎల్ఐ పథకం ద్వారా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆయన అన్నారు.  యువత సామర్ధ్యాల నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్నో అవకాశాలను కల్పించారని శ్రీ అమిత్ షా తెలిపారు.  స్వాతంత్ర శత వార్షికోత్సవాల నాటికి దేశం ప్రపంచంలో ప్రతి రంగంలో తప్పకుండా ముందు ఉండగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

***



(Release ID: 1908996) Visitor Counter : 126