వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023కు దోహదం చేసి, ప్రోత్సహించేందుకు తన నోడల్ సంస్థ నాఫెడ్‌ను ఆదేశించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
చిరుధాన్యాల చొరవలకు తమ మద్దతును విస్తరించేందుకు వ్యవసాయ & రైతాంగ సంక్షమ మంత్రిత్వ శాఖ అవగాహనా ఒప్పందంలోకి ప్రవేశించిన నాఫెడ్
మిల్లెట్ కేంద్రిత స్టార్టప్‌లకు మార్కెటింగ్ లంకెలను విస్తరించడం, నాఫెడ్ బజార్ రిటైల్ దుకాణాలలో చిరుధాన్యాలకు చోటు, ఢిల్లీ - ఎన్‌సిఆర్ వ్యాప్తంగా చిరుధాన్యాల వెండింగ్ మెషీన్ల ఏర్పాటును ప్రారంభించిన నాఫెడ్
Posted On:
20 MAR 2023 4:45PM by PIB Hyderabad
తమ నోడల్ సంస్థ అయిన ఎన్ఎఎఫ్ఇడి (నాఫెడ్)ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023ను ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించి, తోడ్పడవలసిందిగా కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఆదేశించారు.
చిరుధాన్యాలకు సంబంధించిన చొరవలకు మద్దతునందించేందుకు వ్యవసాయ & రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖతో శ్రీ తోమర్ మార్గదర్శకత్వంలో నాఫెడ్ అవగాహనా ఒప్పందంలోకి ప్రవేశించింది.
ఈ సహకారం కింద, చిరుధాన్యాలు కేంద్రీకృత స్టార్టప్‌ల మార్కెటింగ్ లంకెను విస్తరించడం, నాఫెడ్ బజారు చిల్లర దుకాణాలలో చిరుధాన్యాల కార్నర్ ఏర్పాటు, ఢిల్లీ- ఎన్‌సిఆర్ వ్యాప్తంగా చిరుధాన్యాల వెండింగ్ మెషీన్ల ఏర్పాటును నాఫెడ్ ప్రారంభించింది. పౌష్టికార చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు ఐఎన్ఎలోని ఢిల్లీ హాట్‌లో మిల్లెట్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమే కాక, చిరుధాన్యాల ఆధారిత వంటకాల ద్వారా భారతీయ సుసంపన్నమైన చరిత్ర గురించి అవగాహనను కల్పించే ప్రక్రియలో ఉన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రముఖ ఆహార బెవరేజ్ సంస్థలు, పరిశ్రమలు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐవైఒఎం-23ను ప్రజా ఉద్యమంగా చేయడమే కాక చిరుధాన్యాలకు ప్రపంచ హబ్‌గా భారత్‌ను నిలిపేందుకు కృషి చేయాలన్నారు.
భారత్ 1 డిసెంబర్ 2022లో జి20 అధ్యక్షతను చేపట్టి, దేశంలో తొలిసారి జి-20 దేశాల అధ్యక్షుల సదస్సును ఏర్పాటు చేస్తోంది. అధ్యక్షత చేపట్టిన కాలంలోనే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రావడంతో ఆహార భద్రత, పౌష్టికతలో కీలకపాత్ర పోషించే చిరుధాన్యాల విషయంలో భారత్ బలాన్ని ప్రదర్శించేందుకు తగిన సమయం లభించింది. చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు గతి నిర్మాణం చేసి, ఐఎం 2023ను భారీగా విజయవంతం చేయడం, అంతర్జాతీయ, జాతీయ కార్యక్రమాల వ్యాప్తంగా చిరుధాన్యాలను జోడించడం వంటివన్నీ ఐవైఎం వేడుకలలో భాగంగా ప్రతిపాదిత చొరవలను ముందుకు తీసుకువెళ్ళేందుకు కీలకం అని మంత్రి పేర్కొన్నారు
వ్యవసాయ& రైతాంగ సంక్షేమ శాఖ కార్యదర్శి, శ్రీ మనోజ్ అహూజా మాట్లాడుతూ, అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 2023లో నిర్వహించనున్న అన్ని జి-20 సమావేశాల్లో చిరుధాన్యాలకు సుస్పష్టమైన స్థానాన్ని కల్పించాలని కేంద్రం విజ్ఞప్తి చేసిందని తెలిపారు. అంతేకాకుండా, మంత్రివర్గ స్థాయి సమావేశాలు, మంత్రిత్వశాఖలు/ విభాగాలు, రాష్ట్రప్రభుత్వాలు దిగువన పేర్కొన్న విషయాలు ఖచ్చితంగా చిరుధాన్యాల అనుభవం కోసం ఎక్కడ సాధ్యమైతే అక్కడ చేపట్టవచ్చు - చిరుధాన్యాల ఆధారిత హ్యాంపర్లు, విమానాశ్రయం. నగరం, ప్రాంగణం నుంచే చిరుధాన్యాల బ్రాండింగ్, చిరుధాన్యాల వంటకాలను, స్నాక్స్ మధ్యాహ్న భోజనం/ రాత్రి భోజనంలో జోడించడం, చిరుధాన్యాల స్టాళ్ళు & కేఫ్‌లు, చిరుధాన్యాలతో ముగ్గులు, చిరుధాన్యాల సాహిత్యం.
వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు, దిగువన పేర్కొన్నవి - అందచేసిన హ్యాంపర్లలో ఒకటి లేదా రెండు చిరుధాన్యాల ఉత్పత్తులు, ప్రాంగణంలో, విమానాశ్రయంలో బ్రాండింగ్, చిరుధాన్యాల సాహిత్యం, చిరుధాన్యాల వంటకాలు & స్నాక్స్, చిరుధాన్యాల స్టాళ్ళు & కేఫ్‌లు ఖచ్చితంగా ఉండేలా చూడాలని శ్రీ అహూజా అన్నారు.
ఈ నేపథ్యంలో, ప్రత్యేకంగా చిరుధాన్యాల సాంస్కృతిక చరిత్రను ప్రదర్శించే చిరుధాన్యాల ఆధారిత హ్యాంపర్లను అందించే బాధ్యతను, చిరుధాన్యాల డిఐవై (మీకు మీరే చేసుకోండి) రెసిపీలు, చిరుధాన్యాల ఆరోగ్య*& పౌష్టికాహార లాభాలను వివరించే బాధ్యతను నాఫెడ్‌కు ఇవ్వడం జరిగింది.
కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జరిగిన జి20 తొలి ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఉత్తమ నాణ్యత కలిగిన చిరుధాన్యాల గిఫ్ట్‌హ్యాంపర్లను నాఫెడ్ అభివృద్ధి చేయగా, వాటిని ప్రదర్శించడం జరిగింది. ఈ హ్యాంపర్లను ఐవైఎం-2023ను ప్రోత్సహించాలన్న భావనతోను, చిరుధాన్యాలు, చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తల ప్రోత్సాహానికి తమ నిబద్ధతను, మద్దతును ప్రదర్శించేందుకు ఈ హ్యాంపర్లను అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన కేటలాగులను ఇక్కడ జతపరచడం జరిగింది.
***
(Release ID: 1908988)
Visitor Counter : 194