కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భవిష్యత్తులో పని కేంద్రంగా మహిళలతో సామాజిక భద్రత సార్వత్రికీకరణపై దృష్టి పెట్టనున్న - ఎల్-20 ప్రారంభ సమావేశం


అంతర్జాతీయ కార్మికుల వలసలతో పాటు, అనధికారిక కార్మికుల సామాజిక రక్షణ సమస్యలను పరిష్కరించే సామాజిక భద్రతా సార్వత్రికీకరణ, సులభంగా సామాజిక భద్రతా నిధుల అందుబాటు వంటి అంశాలను చర్చించిన - ఎల్-20 ప్రారంభ సమావేశం


నైపుణ్య శిక్షణ, నైపుణ్యాల పెంపుదల, యజమానులు, ఉద్యోగులు, ప్రభుత్వాల పాత్ర, బాధ్యతలు, జి-20 దేశాలలో పని ప్రపంచం, కొత్త ఉపాధి అవకాశాలను మార్చడం, స్థిరమైన మంచి పనిని ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది.

Posted On: 19 MAR 2023 7:07PM by PIB Hyderabad

భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న జి-20 సమావేశాల్లో భాగంగా లేబర్-20 (ఎల్-20) ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రారంభ సమావేశం, ఈ రోజు పంజాబ్‌ లోని అమృత్‌సర్‌ లో జరిగింది.  సమాజంలో చివరి వ్యక్తి కి సైతం చేరే విధంగా, అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనతో పాటు, ప్రపంచ శ్రామికశక్తికి సంబంధించిన కీలక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. 

భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో భాగంగా లేబర్-20 ప్రారంభ సమావేశంలో 20 దేశాల నుండి కార్మిక సంఘాల నాయకులు, కార్మిక అధ్యయన నిపుణులు, ప్రతినిధులు, సామాజిక భద్రత యొక్క సార్వత్రికీకరణతో పాటు, పని యొక్క భవిష్యత్తుకు మహిళలను కేంద్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

ఎల్-20 ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన, భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్) జాతీయ అధ్యక్షుడు శ్రీ హిరణ్మయ్ పాండ్య మాట్లాడుతూ,  2023 సంవత్సరంలో స్ఫూర్తికి అనుగుణంగా, ప్రపంచంలోని శ్రామిక శక్తి ఒకే కుటుంబమని, పేర్కొన్నారు.   జి-20 ఇతివృత్తం #ఒక భూమి #ఒక కుటుంబం #ఒక భవిష్యత్తు గురించి, ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు ఈ భావన ఎలా అన్వయించబడిందీ ఆయన వివరించారు. 

ఇతర జి-20 దేశాలకు చెందిన కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు, గతంలో అధ్యక్షత వహించిన ఇండోనేషియా, అదేవిధంగా, తదుపరి అధ్యక్ష పదవి చేపట్టనున్న బ్రెజిల్ ప్రతినిధులు కూడా, ఎల్-20 కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఎల్-20 సమావేశం రేపు సాంఘిక భద్రత యూనివర్సలైజేషన్, వుమన్ & ఫ్యూచర్ ఆఫ్ వర్క్‌ పై సంయుక్త ప్రకటనతో ముగుస్తుంది, ఈ రెండు విషయాలపై ఈ ఈవెంట్‌లో వివరంగా చర్చించడం జరుగుతుందని, బి.ఎం.ఎస్. మాజీ జాతీయ అధ్యక్షుడు శ్రీ సి.కె. సాజి నారాయణన్ తెలియజేశారు. 

ఆర్థిక సంక్షోభం మహిళలను అత్యంత ప్రతికూల ప్రభావానికి గురిచేస్తోందని, అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దిశానిర్దేశం చేయాల్సిన మహిళా శ్రామికశక్తిపై పని భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఆయన సూచించారు.  ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వలసల్లో తాజా పోకడలను దృష్టిలో ఉంచుకుని, సామాజిక భద్రత పోర్టబిలిటీ కోసం ఒక అంతర్జాతీయ యంత్రాంగాన్ని రూపొందించడం కూడా చాలా ముఖ్యమని, ఆయన పేర్కొన్నారు. 

భారత ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు శ్రీ అరుణ్ మైరా మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలో శాంతి, సామరస్యాలను కోరుకుంటోందని, ఆర్థిక వ్యవస్థలో “కుటుంబ స్ఫూర్తిని” తిరిగి తీసుకురావడానికి ఇది సమయమనీ, పేర్కొన్నారు.  ఆర్థిక వ్యవస్థతో పాటు, సంఘంలో తమ భవిష్యత్తు శ్రేయస్సు గురించి ఆందోళన చెందుతున్న అనేక సమాజాలు ఉన్నాయని ఆయన అన్నారు.  వీరిలో మహిళలు, యువత, రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు, స్వయం ఉపాధి కార్మికులతో పాటు, సూక్ష్మ పరిశ్రమలు సైతం ఉన్నాయి.  ఇవన్నీ ఇప్పుడు, ఈ సమయంలో, మనం తెలుసుకోవాలని, ఆయన సూచించారు. 

ఈ రోజు కార్యక్రమంలో భాగంగా, ఒకేసారి ఐదు సాంకేతిక సదస్సులు జరిగాయి. అవి, 1. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్ &  పోర్టబిలిటీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్‌; 2. అనధికారిక కార్మికులకు సామాజిక రక్షణ; 3. నైపుణ్య శిక్షణ, నైపుణ్యాల పెంపుదలతో పాటు, యజమానులు, ఉద్యోగులు, ప్రభుత్వాల పాత్ర, బాధ్యతలు; 4. జి-20 దేశాల కూటమి లో పని ప్రపంచం, కొత్త ఉపాధి అవకాశాలను మార్చడం; 5. స్థిరమైన మంచి పనిని ప్రోత్సహించడం.

 

రెండు రోజుల ఎల్-20 ప్రారంభ సదస్సు లో రెండవ రోజైన, రేపు, "మహిళలు, పని భవిష్యత్తు" గురించి ప్రధానంగా చర్చించనున్నారు.

 

 

*****




(Release ID: 1908654) Visitor Counter : 268