ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డిజిట‌ల్ ఆరోగ్యం- సార్వ‌త్రిక ఆరోగ్య క‌వ‌రేజీని ఆఖ‌రి పౌరుని వ‌ర‌కు చేర్చ‌డం అన్న అంశంపై రెండురోజుల అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న డాక్ట‌ర్ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ


వ్యూహం నుంచి ప్ర‌భావ‌శీల‌మైన ఫ‌లితాల‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల కార్యాచ‌ర‌ణ ప‌థ‌కం పై అంత‌ర్జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించ‌డంపై మ‌ళ్ళించ‌డం అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ల‌క్ష్యం

Posted On: 19 MAR 2023 10:09AM by PIB Hyderabad

గ‌త అధ్య‌క్షుల ఫ‌ల‌వంత‌మైన చ‌ర్య‌లు, వాగ్దానాల ఆస‌రాగా  భార‌త‌దేశ‌పు జి 20 అధ్య‌త‌లో కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌, డ‌బ్ల్యుహెచ్ఒ ఆగ్నేయ కార్యాల‌యం డిజిట‌ల్ ఆరోగ్యం- సార్వ‌త్రిక ఆరోగ్య క‌వ‌రేజీని ఆఖ‌రి పౌరుని వ‌ర‌కు చేర్చ‌డం అన్న అంశంపై రెండు రోజుల అంత‌ర్జాతీయ స‌ద‌స్సును 20-21 మార్చి, 2023 వ‌ర‌కు న్యూఢిల్లీలో నిర్వ‌హిస్తున్నాయి.
కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం, ర‌సాయ‌నాలు & ఎరువుల శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి శ్రీ రాజేష్ భూష‌ణ్‌, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి శ్రీ ల‌వ్ అగ‌ర్వాల్, ఆగ్నేయాసియా డ‌బ్ల్యుహెచ్ఒ ప్రాంతీయ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పూనం ఖేత్ర‌పాల్ సింగ్‌, డ‌బ్ల్యుహెచ్ ఒ కేంద్ర‌కార్యాల‌యం డిజిట‌ల్ హెల్త్  & ఇన్నొవేష‌న్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ అలైన్ లాబ్రిక్‌, ఆగ్నేయాసియా డ‌బ్ల్యుహెచ్ఒ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ విభాగం డైరెక్ట‌ర్ మ‌నోజ్ ఝ‌లానీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. 
ఈ స‌ద‌స్సు ప్ర‌పంచ నాయ‌కుల‌ను, ఆరోగ్యాభివృద్ధి భాగ‌స్వాముల‌ను, ఆరోగ్య విధాన రూప‌క‌ర్త‌ల‌ను, డిజిట‌ల్ ఆరోగ్య ఆవిష్క‌ర్త‌లు, ప్ర‌భావ‌శీలుర‌ను, విద్యావేత్త‌లు, ఇత‌ర వాటాదారుల‌ను ఒక వేదిక మీద‌కు తీసుకువ‌స్తుంది. 
యుహెచ్‌సి దిశ‌గా పురోగ‌తిని వేగ‌వంతం చేసే ల‌క్ష్యంతో  వ్యూహం నుంచి దృష్టిని స‌భ్య దేశాల‌లో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భావ‌శీల‌మైన ఫ‌లితాలను ఉత్ప‌త్తి చేసే కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై అంత‌ర్జాతీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించడం  డిజిట‌ల్ ఆరోగ్యంపై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ల‌క్ష్యం.  పిహెచ్‌సి - ఆధారిత, బ‌ల‌మైన ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల నిర్మాణానికి పునాదిగా అనుసంధానిత డిజిట‌ల్ ఆరోగ్య చొర‌వ‌ల‌ను, జోక్యాల‌ను అమ‌లు చేయ‌డాన్ని వేగ‌వంతం చేసేట‌ప్పుడు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ప‌రిష్క‌రిస్తుంది. 
ఇది నైతిక‌, సుర‌క్షిత‌, భ‌ద్ర‌మైన‌, విశ్వ‌స‌నీయ‌, స‌మాన‌మైన, సుస్థిర‌మైన ప‌ద్ధ‌తిలో డిజిట‌ల్ ఆరోగ్య ప‌రిష్కారాల‌ను బ‌ట్వాడా చేయ‌డం, పంచుకోవ‌డంలో ఉన్న సంభావ్య‌త‌ను బ‌హిరంగం చేయ‌డంపై దృస్టి కేంద్రీక‌రిస్తుంది.  పార‌ద‌ర్శ‌క‌త‌, అందుబాటు, కొల‌వ‌ద‌గిన‌, ప్ర‌తిసృజ‌నీయ‌, క‌లిసి ప‌ని చేయ‌డం, గోప్య‌త‌, భ‌ద్ర‌త‌, విశ్వ‌స‌నీయత అన్న సూత్రాల‌ను అనుస‌రించి డిజిట‌ల్ సాంకేతిక‌త‌ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం, అభివృద్ధి చేయ‌డం, పంచుకోవ‌డంపై ఈ స‌ద‌స్సు దృష్టి పెడుతుంది. 
ప్ర‌జా స్థాయిలో డిజిట‌ల్ ఆరోగ్యాన్ని అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాత్మ‌క, సాంకేతిక‌ ప్రారంభ‌కుల‌ను, స‌శ‌క్త‌ప‌రిచేవారిని ఏర్పాటు చేయ‌డానికి ఇది తోడ్ప‌డుతుంది.  
ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సులో భాగంగా, దిగువ‌న పేర్కొన్న అంశాల‌పై ఐదు సెష‌న్ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారుః 
డిజిట‌ల్ ఆరోగ్యం- యుహెచ్‌సి కోసం ఒక ఆవ‌శ్య‌క‌త‌/ అనివార్య‌త‌
డిజిట‌ల్ ఆరోగ్యం జ‌నాభా స్థాయి - వ్యూహాత్మ‌కంగా స‌శ‌క్త‌ప‌రిచేవారు (ఎనేబ్ల‌ర్స్‌)
డిజిట‌ల్ ఆరోగ్యం జ‌నాభా స్థాయి - సాంకేతిక ఎనేబ్ల‌ర్లు
యుహెచ్‌సి కోసం ఆవిష్క‌ర‌ణ‌లు
యుహెచ్‌సి కోసం అంత‌ర్జాతీయ డిజిట‌ల్ సామాగ్రి

ప్యానెల్ చ‌ర్చ‌ల‌తో పాటు డిజిట‌ల్ ప‌రివ‌ర్త‌న‌లో స‌వాళ్ళు, అవ‌కాశాలు, కీల‌క విజ‌యాంశాలు/  కార‌కాల‌పై అంత‌ర్దృష్టి, అనుభ‌వంపై మేధోమ‌థ‌నం చేసే మంత్రివ‌ర్గ సెష‌న్ కూడా ఈ స‌ద‌స్సులో ఉండ‌నుంది. 
 

***
 



(Release ID: 1908653) Visitor Counter : 138