సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav g20-india-2023

న్యూఢిల్లీలో 2023 మార్చి 19 నుంచి 21 వరకు జరగనున్న మూడవ అంతర్జాతీయ ఎస్ఎంఈ సదస్సు

Posted On: 18 MAR 2023 6:27PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో 2023 మార్చి 19 నుంచి 21 వరకు  మూడవ  అంతర్జాతీయ ఎస్ఎంఐ సదస్సు జరగనున్నది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన భాగస్వామిగా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామిగా వ్యవహరిస్తున్న సదస్సును  ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ సదస్సు  నిర్వహిస్తాయి.  ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ఫర్ ఎస్ఎంఈ (ఐఎన్ ఎస్ఎంఈ), వరల్డ్ యూనియన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (డబ్ల్యూయూఎస్ఎంఈ) అంతర్జాతీయ భాగస్వాములు వ్యవహరిస్తాయి.  టాటా ఏఐఏ 2023 మార్చి 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో జరిగే

 ఐ ఎస్ఐ  2023 కు  బీమా భాగస్వామిగా ఉంది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణే పాల్గొంటారు.   ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ , విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్కుమార్ రంజన్ సింగ్, మధ్యప్రదేశ్  ఎంఎస్ఎంఈ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్రీ ఓం ప్రకాశ్ సక్ లేచా,  ఉత్తర ప్రదేశ్  ఖాదీ, గ్రామ పరిశ్రమలు, సెరికల్చర్, జౌళి శాఖ మంత్రి శ్రీ రాకేష్ సచన్ గౌరవ అతిథులుగా పాల్గొనే సమావేశంలో  కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల  సీనియర్ అధికారులు హాజరవుతారు.    

  క్లీన్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఉత్పత్తి, సేవల రంగం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, వ్యవసాయ పరికరాల రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఐఎస్ ఐ 2023 జరుగుతుంది. సదస్సులో 1500 పైగా ఎస్ఎంఈ లు పాల్గొనే అవకాశం ఉంది.


వ్యూహాత్మక భాగస్వామ్యాలను నిర్మించడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను పెంచడం, ఆవిష్కరణలపై దృష్టి సారించడం, ప్రమాణాలు , నిబంధనలు పాటించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా ఎంఎస్ఎంఈ ల అభివృద్ధికి సహకరించడం, ఎస్ఎంఈ లకు అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి సదస్సులో చర్చలు జరిపి, సిఫార్సులు అందిస్తారు. 

రెండు రోజుల పాటు జరిగే సదస్సులో వివిధ అంశాలపై కార్యక్రమాలు జరుగుతాయి.  విజయవంతమైన వ్యవస్థాపకులు ,వ్యాపారవేత్తలతో చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 

***(Release ID: 1908615) Visitor Counter : 69


Read this release in: English , Urdu , Hindi , Tamil