రైల్వే మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ నూరు శాతం విద్యుద్దీకరణ విద్యుదీకరణతో 2.5 రెట్లు తగ్గనున్న లైన్ హాల్ వ్యయం
Posted On:
18 MAR 2023 4:46PM by PIB Hyderabad
2030 నాటికి నికరంగా జీరో కార్బన్ ఉద్గారాన్ని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించే విధంగా భారతీయ రైల్వే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రస్తుత బ్రాడ్ గేజ్ నెట్వర్క్ను నూరు శాతం విద్యుదీకరించింది. మొత్తంగా 1,170 రూట్ కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయింది. దీని ఫలితంగా లైన్ హాల్ ఖర్చు (సుమారు 2.5 రె్ట్ల మేర తక్కువ) తగ్గింది. ఈ చర్య కారణంగా భారీ రవాణా సామర్థ్యం పెరిగింది, సెక్షనల్ సామర్థ్యం కూడా పెరిగింది. ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణ వ్యయం తగ్గింది, దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుంది, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. పర్యావరణ అనుకూల రవాణా విధానం అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు విద్యుదీకరణతో పాటుగా కొత్త బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ విధానికి తోడు మంజూరు చేయబడుతుంది. 100 శాతం విద్యుదీకరించబడిన నెట్‌వర్క్ యొక్క రైల్వే విధానంతో సమకాలీకరించబడుతుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర భూభాగం సౌత్ ఈస్ట్ సెంట్రల్ & ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగం అధికార పరిధిలోకి వస్తుంది. బిలాస్‌పూర్, రాయ్‌పూర్, దుర్గ్ & కోర్బా మొదలైనవి ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లు. బిలాస్పూర్ ఛత్తీస్‌గఢ్‌లోని అతిపెద్ద రైల్వే స్టేషన్ మరియు ఇది ముంబై-హౌరా ప్రధాన మార్గంలో ఉంది. ఇది ముఖ్యమైన జంక్షన్ మరియు ముంబయి, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దేశంలోనే అత్యధిక సరుకు రవాణాను కలిగి ఉంది, రైల్వే ఇక్కడి నుండే గణనీయమైన ఆదాయాన్ని పొందుతోంది. ఛత్తీస్‌గఢ్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఇతర వస్తువుల రవాణా జరుగుతోంది. ఇందులో రైల్వే నెట్‌వర్క్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొన్ని ప్రతిష్టాత్మక రైళ్లు: దుర్గ్-జగ్దల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్, సమతా ఎక్స్‌ప్రెస్, కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్.
ఈ రైళ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సౌకర్యవంతమైన అనుసంధానతను అందిస్తున్నాయి.
***
(Release ID: 1908445)
Visitor Counter : 174