వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మిల్లెట్‌లను శ్రీ అన్నగా పేర్కొనడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ "మిరాకిల్ ఫుడ్"కి కొత్త అర్థం & కోణాన్ని ఇచ్చారు: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) సదస్సులో ప్రసంగించిన కేంద్ర వ్యవసాయ మంత్రి

Posted On: 18 MAR 2023 1:42PM by PIB Hyderabad

ఈరోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రసంగించారు.

శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తన ప్రసంగంలో..ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్ ఉత్పత్తిని పెంచడానికి, సమర్థవంతమైన ప్రాసెసింగ్ మరియు పంట మార్పిడిని బాగా ఉపయోగించుకోవడానికి మరియు ఆహారంలో వాటిని ప్రధాన అంశంగా ప్రోత్సహించడానికి  అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐవైఎం)-2023 అవకాశాన్ని అందిస్తుందన్నారు.

 

image.png


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరం (ఐవైఎం)గా ప్రకటించిందని శ్రీ తోమర్ చెప్పారు.ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర వాటాదారుల సహకారంతో మిల్లెట్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడానికి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మిషన్ మోడ్‌లో పని చేస్తోందని ఆయన తెలిపారు.

 

image.png


శాకాహార ఆహారాలకు డిమాండ్ పెరుగుతున్న కాలంలో మిల్లెట్స్ ప్రత్యామ్నాయ ఆహార వ్యవస్థను అందజేస్తాయని, ఇది సమతుల్య ఆహారంతో పాటు సురక్షితమైన వాతావరణానికి దోహదపడుతుందని మరియు వాటిని మానవాళికి ప్రకృతి అందించిన బహుమతులుగా శ్రీ తోమర్ అభివర్ణించారు. ఆసియా మరియు ఆఫ్రికా మిల్లెట్ పంటలకు  ప్రధాన ఉత్పత్తి మరియు వినియోగ కేంద్రాలు. ముఖ్యంగా భారతదేశం, నైజర్, సూడాన్ మరియు నైజీరియాలు మిల్లెట్‌లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తినే ఆహారంలో మిల్లెట్‌లు గర్వించదగ్గ స్థానంలో ఉండేలా చూడాలనేది తన ప్రగాఢ కోరిక అని ఆయన అన్నారు.

మిల్లెట్లు ఆసియా మరియు ఆఫ్రికాలో పండించిన మొట్టమొదటి పంటలు. తరువాత ప్రపంచవ్యాప్తంగా అధునాతన నాగరికతలకు ముఖ్యమైన ఆహార వనరుగా వ్యాపించింది.

అంతకు ముందు శ్రీ తోమర్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం 2023 ప్రారంభంలో గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీని కలవడం చాలా సంతోషకరమైన విషయమని మరియు గయానా ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు. 2023 జనవరి 8-10 తేదీలలో ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైనందుకు డాక్టర్ అలీకి శ్రీ తోమర్ కృతజ్ఞతలు తెలిపారు మరియు ప్రతిష్టాత్మకమైన ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అందుకున్నందుకు రాష్ట్రపతికి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


 

*****



(Release ID: 1908441) Visitor Counter : 167