పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 250 ఆదర్శ గ్రామ పంచాయతీ క్లస్టర్ల ఏర్పాటు ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్

Posted On: 17 MAR 2023 10:56AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 250 ఆదర్శ గ్రామ పంచాయతీ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టు పురోగతిని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ , 2023 మార్చి 16న న్యూఢిల్లీ లో జరిగిన  ఒక సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్షించారు. ఇందుకు సంబంధించి 250 ఆదర్శ గ్రామ పంచాయీతీ క్లస్టర్ల రాష్ట్ర ప్రాజజెక్టు కోఆర్డినేటర్లు (ఎస్ పిసిలు),  జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతిరాజ్ సంస్థ యంగ్ ఫెలోస్ లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర పంచాయతిరాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్, ఎన్.ఐ.ఆర్.డి, పి.ఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ జి. నరేంద్ర కుమార్, పంచాయతి రాజ్ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్, పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వికాస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి యంగ్ ఫెలోస్ తోపాటు 210 మందికి పైగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  శ్రీ గిరిరాజ్ సింగ్, దేశవ్యాప్తంగా 250 ఆదర్శ గ్రామ పంచాయితీ క్లస్టర్ల ఏర్పాటు ప్రాజెక్టులో భాగంగా , గ్రామపంచాయతీల సంపూర్ణ అభివృద్ధికి వీలు కల్పించే విధంగా ఆదర్శ గ్రామ పంచాయితీల అభివృద్ధి గురించి  ప్రముఖంగా ప్రస్తావించారు.  మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న యువత, ప్రజల భాగస్వామ్యంతో మరింత మంది విద్యార్థులు నాణ్యమైన విద్య అందుకునేలా కృషి చేయాలని, విద్యార్థులు మధ్యలోనే బడి మానేసే పరిస్థితి ఉండకుండా చూడాలని అన్నారు.
గ్రామపంచాయితీలలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను  స్థానికీకరించి అమలు చేయడంలో యంగ్ ఫెలోస్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలలో అమలు చేసే వివిధ పథకాలను గరిష్ఠస్థాయిలో లక్ష్యాల సాధనకు వ్యూహాన్ని చేపట్టాలని, ఇది మిషన్ మోడ్ లో జరగాలని కేంద్ర మంత్రి సూచించారు. ఇందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ఆదర్శ గ్రామ పంచాయతిలలో పేదరిక నిర్మూలన, ఆర్ధిక సాధికారత సాధించేందుకు భాగస్వాములందరి సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

విద్యతో కూడిన పంచాయితీలు, స్వచ్ఛతతో కూడిన పంచాయితీలు, స్త్రీ,పురుషులకు ఉపాధి అవకాశాలు కలిగిన పంచాయితీలు,హరిత పంచాయితీలు, ఆరోగ్య కరమైన పంచాయితీలు, స్వావలంబన కలిగిన పంచాయితీలు, సాధించేందుకు కృషి చేయాల్సిందిగా మంత్రి వారికి సూచించారు. స్థానిక ప్రజలను వీటన్నింటిలో భాగస్వాములను చేయాలని , ఆరు గ్రామ సభ లను ఏర్పాటుచేయాలని సూచించారు. యంగ్ ఫెలోస్ అందరూ పాల్గొనేలా , రోజంతా ఒక జాతీయ వర్క్షాప్ను నిర్వహించాల్సిందిగా ఎన్ఐఆర్డి, పిఆర్కు మంత్రి సూచించారు. అలాగే ఈ పథకం కింద గల ఆదర్శ గ్రామపంచాయితీలు సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా ఒక డాష్ బోర్డును రూపొందించాల్సిందిగా మంత్రి కోరారు.

గ్రామ పంచాయితీల అభివృద్ధి ప్రణాళికల ప్రాధాన్యతను కేంద్ర మంత్ర ప్రముఖంగా ప్రస్తావించారు. పంచాయితీల సమగ్ర అభివృద్ధికి యంగ్ ఫెలోస్ (వై. ఎఫ్. లు) సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు.
స్థానికంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో, హరిత, పరిశుభ్ర గ్రామాల విషయంలో, ఆరోగ్య గ్రామాలు, మంచినీరు చాలినంత కలిగిన గ్రామాలు, మహిళలకు అనుకూల గ్రామాలు, పిల్లలకు అనువైన గ్రామాలు ఇలా వివిధ రంగాలలో గరిష్ఠ ఫలితాలు సాధించేలా గ్రామపంచాయితీలు కృషి చేయాలని సూచించారు.  దేశ వ్యాప్తంగా ఆదర్శ గ్రామపంచాయితీలు తీర్చిదిద్దడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అనుసరించవలసిన భవిష్యత్ వ్యూహాలు, వనరుల సద్వినియోగం వంటి విషయాలను ఈ సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా 250 ఆదర్శ గ్రామపంచాయితీ క్లస్టర్ల ఏర్పాటు ప్రాజెక్టు అమలులో పురోగతి, వివిధ అంశాలపై  సిపిఆఆర్డిపి, ఎస్.ఎస్.డి, ఎన్ .ఐ.ఆర్.డి, పి.ఆర్ ఫాకల్టీ అధిపతి డాక్టర్  అంజన్  కుమార్ భంజా, కొందరు యంగ్ ఫెలో లు ఉత్తరప్రదేశ్కు చెందిన పూనమ్ ఖత్రి, గుజరాత్ కుచెందిన సుమన్ ఖాతిక్, అస్సాంకు చెందిన జ్యోతిస్మిత దేకా,
మహారాష్ట్రకు చెందిన శ్రీ ఆదిత్య ఇంగ్లే, ఉత్తరాఖండ్ కుచెందిన చిత్రాంసి ధామి, బీహార్కు చెందిన అంగితా కుమారి, పశ్చిమబెంగాల్ కు చెందిన రిచా మిత్రా, హిమాచల్ ప్రదేశ్ కుచెందిన సప్న శర్మ, మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీ కృష్ణ మధాసియా, ఉత్తరాఖండ్ కు చెందిన శ్రీ గణేశ్ సింగ్ తదితరులు క్షేత్రస్థాయిలో తమ అనుభవాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.

***



(Release ID: 1908290) Visitor Counter : 95