మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో 24 కోట్ల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Posted On: 17 MAR 2023 5:25PM by PIB Hyderabad

దేశంలో 24 కోట్ల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పశుసంవర్ధక శాఖలు పశువుల యజమానులు అందించిన సహకారంతో కార్యక్రమం దేశ వ్యాప్తంగా విజయవంతం అయ్యింది. 

 గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకం కింద సమకూరుస్తోంది.  గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను కేంద్ర ప్రభుత్వం సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.  గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రయోజనాలను పశువుల యజమానులకు వివరించి, పశువులకు టీకా వేయించే అంశంపై అవగాహన కల్పించడానికి మంత్రిత్వ శాఖ  అనేక కార్యక్రమాలు నిర్వహించింది. పశువులకు అవసరమైన టీకాలు పశు ఆరోగ్య కార్యకర్తలు/ పశు వైద్య డాక్టర్ల వద్ద అందుబాటులో ఉంచింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో టీకాలు వేయడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించింది. 

కార్యక్రమం రెండో దశలో 25.8 కోట్ల పశువులకు ( రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు)  గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇంతవరకు 24 కోట్ల పశువులకు టీకాలు  జరిగింది. సమిష్టి కృషితో లక్ష్యంలో 95% లక్షాన్ని చేరుకొని పశువులకు రోగ నిరోధక శక్తిని ఎక్కువ చేయడానికి  చేపట్టిన కార్యక్రమం విజయవంతం అయ్యింది.  కేంద్ర పశుసంవర్ధక శాఖ, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పశుసంవర్ధక శాఖలు పశువుల యజమానులు అందించిన సహకారంతో కార్యక్రమం లక్ష్యాల మేరకు విజయవంతం అయ్యింది. 

కేంద్ర ప్రాయోజిత పథకంగా కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవసరమైన 100% నిధులు విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం  టీకా ఛార్జీలు, ఉపకరణాలు, అవగాహన కల్పించడం, కోల్డ్ చైన్ సౌకర్యాలు సమకూర్చుకోవడానికి  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సహకారం అందిస్తోంది. గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రయోజనాలను పశువుల యజమానులకు వివరించి, పశువులకు టీకా వేయించే అంశంపై అవగాహన కల్పించడానికి మంత్రిత్వ శాఖ  అనేక కార్యక్రమాలు నిర్వహించింది.

నిరంతర ప్రయత్నాలతో దేశంలో  గాలికుంటు వ్యాధి నియంత్రణ, నిర్మూలన కోసం జరుగుతున్న కార్యక్రమాలు లక్ష్యాల మేరకు అమలు జరుగుతాయని భావిస్తున్నారు.దీనివల్ల పశువుల పెంపకందారుల / సంరక్షకుల ఆదాయం పెరుగుతుంది.  పశువుల ఉత్పత్తుల రంగంలో  వాణిజ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. 

గాలికుంటు వ్యాధి అనేది పశువులకు ముఖ్యంగా భారత దేశంలో పశువులు మరియు గేదెలకు సంక్రమిస్తున్న వ్యాధుల్లో ఒక ప్రధాన వ్యాధి. దీనివల్ల పాల దిగుబడి తగ్గి  పశువుల యజమానులకు భారీ ఆర్థిక కలుగుతుంది. . సమస్యను పరిష్కరించడానికి పశు సంవర్ధక , పాడి పరిశ్రమ విభాగం 2019లో నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NADCP)ని ప్రారంభించింది, ఇది ఇప్పుడు లైవ్‌స్టాక్ హెల్త్ గా అమలు జరుగుతున్నది. టీకాలు వేయడం ద్వారా  2030 నాటికి  గాలికుంటు వ్యాధి ని   నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఫలితంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది.  పశువుల ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమం కింద అన్ని పశువులు,  గేదెలకు టీకాలు వేస్తారు.

***


(Release ID: 1908106) Visitor Counter : 433


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil