పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ వేదికమీద భారత్ ను గర్వపడేట్టు చేసిన ఆడిట్ ఆన్ లైన్ యాప్


పంచాయితీరాజ్ సంస్థల ఆడిట్ ను ఆన్ లైన్ చేసి యాప్ కు జెనీవాలో జరిగిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సంఘటన’ వారి సమాచార సమాజ ప్రపంచ శిఖరాగ్రసదస్సు-2023’ పురస్కారం

Posted On: 17 MAR 2023 11:27AM by PIB Hyderabad

అన్ని  పంచాయితీరాజ్ సంస్థలకూ  ఆన్  లైన్ లో  ఆడిట్ చేయగలిగేలా రూపొందించిన ఆడిట్ ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించినంది. పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ, ప్రభుత్వానికి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న నేషనల్  ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ ఐ సి) జెనీవా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సంఘటన వారి సమాచార సమాజ ప్రపంచ సదస్సులో ఈ పురస్కారం అందించారు.     

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్  శాఖామంత్రి  శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించిన సందర్భంగా పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ  బృందానికి,  ఎన్ ఐ సి బృందానికి అభినందనలు తెలియజేశారు.

ఆడిట్ ఆన్ లైన్ యాప్:  సి కేటగిరీ లో ప్రభుత్వ ఆడిట్ నిర్వహించటానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీన్ని 12 వ సమాచార సమాజపు ప్రపంచ సదస్సు ( డబ్ల్యూ ఎస్ ఐ ఎస్) బహుమతులు-2023  కోసం  సమర్పించగా జెనీవాలోని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల యూనియన్ పరిశీలించింది.  ఇది ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకోసం ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానానాలు ప్రోత్సహించటానికి అందిస్తారు.ఈ పోటీ ఐదు దశలలో జరుగుతుంది. 1) దరఖాస్తు సమర్పించే దశ 2) సమర్పించిన ప్రాజెక్టులను పరిశీలించే నామినేషన్ దశ (18 యాక్షన్ లైన్ విభాగాలలో ఒక్కో విభాగానికి 20 ప్రాజెక్టుల చొప్పున)  3) డబ్ల్యూ ఎస్ ఐ ఎస్ భాగస్వామూలందరీ వోటు వేసేలా ఆన్  లైన్ ఓటింగ్  4) ఎక్కువ వోట్లు తెచ్చుకున్న ఐదు  అత్యుత్తమ  ప్రాజెక్టులనుంచి  ఐటీయూ నిపుణుల బృందం చేత ప్రాజెక్టు విజేత ఎంపిక  5) 2023 డబ్ల్యూ ఎస్ ఐ ఎస్  ఫోరం వేడుకలలో బహిరంగంగా  విజేత ప్రకటన.    

ఒక్కో దశలోనూ పద్ధతి ప్రకారం ప్రక్రియ పూర్తయ్యాక ఆడిట్ ఆన్ లైన్ కు 2023 సంవత్సరపు పురస్కారం లభించింది. స్విట్జర్లాండ్ లో జెనీవాలో 2023 మార్చి 14 న  సెంటర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, జెనీవా ( స ఐ సి జి) లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఎన్ ఐ సి లో పంచాయత్  ఇన్ఫర్మాటిక్స్ డివిజన్ డీడీజీ శ్రీ సునీల్ జైన్ ఈ పురస్కారం అందుకున్నారు.

ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి సమన్వయంతో ఈ  డబ్ల్యూ ఎస్ ఐ ఎస్  పురస్కార ప్రదానోత్సవం ఏటా జరిగే కార్యక్రమం. దీనికి  యునెస్కో, యూ ఎన్ డీపీ, యూఎన్ సి టి ఏడీ కూడా  సహకరిస్తాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించటానికి ఐసీటీని వాడుకోవటం వీటి లక్ష్యం.

నేపథ్యం:

సువిశాలమైన దేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు  అనేక ప్రాథమిక సౌకర్యాలు కల్పించటంలో పంచాయితీ రాజ్ సంస్థలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.  అందుకే పంచాయితీరాజ్ సంస్థలకు తగిన మౌలిక సదుపాయాలు, తగిన శిక్షణ పొందిన సిబ్బంది ఎంతో అవసరం. పంచాయితీరాజ్ సంస్థలు అందించే వివిధ సేవలను అందించటానికి కేంద్ర ఆర్థిక సంఘాలు నిర్దేశించిన గ్రాంట్లను  కేంద్రం నిరాటంకంగా పంచాయితీరాజ్ సంస్థలకు ఇస్తూనే ఉంటుంది. వాటిలో దేశ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయ స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. అందువలన ఈ సంస్థల పనితీరును అనుక్షణం పర్యవేక్షించవలసిన అవసరముంది. అప్పుడే ప్రజాధనం అభివృద్ధి పనులకోసం సద్వినియోగం కావటానికి, పారదర్శకతకు వీలుంటుంది. వాటి పనితీరు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండేట్టు చూడటానికి కూడా ఇది అవసరం.

పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ ఈ ఆలోచనతోనే ఎప్పటికప్పుడు డిజిటల్ టెక్నాలజీని తనకు అవసరమైన అన్నీ చోట్లా వాడుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన అందిస్తూ పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రదర్శిస్తోంది. అదే విధంగా ఆద్యంతం ప్రజాసేవలు అందించగలుగుతోంది.   

కేంద్ర ఆర్థిక సంఘం పదే  పదే పంచాయితీల ఖాతాలు ఆడిట్ చేసి అందుబాటులో ఉంచాలని కోరుతోంది. 15 వ ఆర్థిక సంఘం  మరీ ముఖ్యంగా సంస్కరణలు సూచిస్తూ, ఆడిట్ కు ముందూ, తరువాతా ఖాతాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఈ సంస్థాగత సంస్కరణకు  సమాధానంగా పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ 15 న ఆడిట్ ఆన్ లైన్ యాప్ ను ప్రారంభించింది. దీనివల్ల ఖాతాలను ఆన్ లైన్ లో ఆడిట్ చేయటంతో బాటు పంచాయితీల ఆర్థిక లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించటానికి వీలవుతుంది. ఆయా రాష్ట్రాల ఆడిట్ చట్టాలకూ, నిబంధనలకూ అనుగుణంగా  సర్దుబాటు చేసుకోగలగటం ఈ యాప్  ప్రత్యేకత.   

***


(Release ID: 1908080) Visitor Counter : 189