రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు భద్రత
Posted On:
16 MAR 2023 2:17PM by PIB Hyderabad
ఇతర సాంకేతిక వ్యవస్థల మాదిరిగానే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లు కూడా సైబర్-దాడులు, సైబర్ భద్రత పరమైన ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.దేశంలోని సైబర్ సెక్యూరిటీ సంఘటనలను గుర్తించి పర్యవేక్షించడానికి ఏర్పాటైన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లకు సంబంధించిన ఉత్పత్తులు మరియు అప్లికేషన్లు సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందని నివేదికలు అందాయి. సైబర్ దాడులు అరికట్టడానికి తగిన చర్యలు అమలు చేయాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచనలు జారీ అయ్యాయి. దీనికి అనుగుణంగా సైబర్ దాడులు/ సైబర్ బెదిరింపులు/దుర్బలత్వం అంశాలకు సంబంధించి హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కంప్యూటర్‌లు మరియు నెట్‌వర్క్‌లను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన హెచ్చరికలు, సలహాలను జారీ చేస్తుంది.
సైబర్ నేరాలు, భద్రత సంబంధించిన అంశాలపై ప్రభుత్వం పూర్తి అవగాహన కలిగి ఉంది. హ్యాకింగ్ సమస్యను ఎదుర్కోవడానికి పటిష్ట చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలకు సంబంధించి ఇటీవల ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం మార్గదర్శకాలు జారీ చేసింది. దేని ప్రకారం దేశంలో జరిగే అన్ని సంఘటనలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దృష్టికి తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. సైబర్-దాడులు, సైబర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సైబర్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వాటి సంస్థలు, క్లిష్టమైన రంగాలకు చెందిన అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు అమలు చేస్తాయి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగంలో ఉత్తమ విధానాలు అమలు చేయడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దేశంలో 150 సెక్యూరిటీ సంస్థలను గుర్తించింది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కు అందిన ఫిర్యాదులు, గుర్తించిన సంఘటనల సమాచారం ప్రకారం, 2018, 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో సైబర్ సెక్యూరిటీ సంఘటనల సంఖ్య వరుసగా 2,08,456, 3,94,499, 11,58,208, 14,02,809,13,91,457 గా ఉంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1907817)
Visitor Counter : 128