సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

జాతీయ కనీస వేతన పథకం

Posted On: 16 MAR 2023 2:16PM by PIB Hyderabad

ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వశాఖ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్  ద్వారా  ఖాదీ హస్త కళాకారుల అభ్యున్నతి కోసం ఖాదీ  వికాస్ యోజన కింద అనేక పథకాలు అమలు చేస్తోంది.

నూలు, ఉలెన్, పాలీ వస్త్ర ఉత్పత్తులకు  మాడిఫైడ్ మార్కెటింగ్ అభివృద్ధి సహాయం  కింద దాని విలువలో 35% మొత్తాన్ని ప్రోత్సాహకంగా అందిస్తుంది. అదే సిల్క్ ఉత్పత్తులయితే ఆ ప్రోత్సాహకం 30% ఉంటుంది.

చిరాకు లేకుండా సాఫీగా ఉత్పత్తి సాగిపోవటానికి వీలుగా షెడ్లు నిర్మించుకునే పక్షంలో వ్యక్తులకు, బృందాలకు వర్క్ షెడ్ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు.

పైన పేర్కొన్నవే కాకుండా, హస్త కళాకారుల నూలు తయారీ వేతనాలు కండెకు రూ. 7.50 నుంచి రూ.10.00 కి పెరుగుతాయి. కాటన్ ఖాదీ, ఉలెన్  ఖాదీ, పాలీ వస్త్ర నేత కూలి ని 2023 ఏప్రిల్ 1 నుంచి 10 శాతం పెంచుతారు.

కేవీఐసీ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్తి కొనుగోలు చేస్తుంది. పంటల సీజన్ లో .. అంటే ప్రతి దిగుబడి మొదలయ్యే సెప్టెంబర్-అక్టోబర్ లో అదనపు కొనుగోలు చేపట్టటం ద్వారా కూడా కేవీఐసీ తగినంత ముడిసరకు నిల్వ ఉండేట్టు చూస్తుంది.

ఖాదీ కార్మికులు పాక్షిక సమయం ఈ వృత్తిలో వెచ్చిస్తున్నందున ప్రభుత్వం వారికి జాతీయ కనీస వేతనాల పథకాన్ని వర్తింపజేయటం లేదు. వాళ్ళు చేసే పనిలో ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి  వేతనాలుంటాయి.  నైపుణ్యమున్న, పాక్షిక నైపుణ్యమున్న, నైపుణ్యం లేని కార్మికులకు సమయం ఆధారంగా 8 గంటల చొప్పున ఇచ్చే కనీస వేతనాలు  ఖాదీ కార్మికులకు వర్తించవు.

కేవీఐసీ చట్టం ప్రకారం ఖాదీ అంటే ప్రత్తి లేదా ఉలెన్ నూలు లేదా చేనేత ద్వారా తయారు చేసిన బట్ట మాత్రమే. మరేదైనా రకాలు కలవకూడదు.   అయితే, రెడీమేడ్ గార్మెంట్స్ మీద ఎలాంటి ఆంక్షలూ లేవు.

ఎం ఎస్ ఎం ఈ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలియజేశారు. 

***


(Release ID: 1907814)
Read this release in: English , Urdu , Marathi , Tamil