సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
మహిళా యాజమాన్య సంస్థలు
Posted On:
16 MAR 2023 2:19PM by PIB Hyderabad
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రకారం మొత్తం ఎంఎస్ఎంఈ లు 1,47,50,018 కాగా , మహిళాల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈ లు 27,75,390 ఉన్నట్టు 2020 జులై 1 మొదలు 2023 మార్చి 12 వరకు ( మార్చి 13 నాటి సమాచారం) తెలియజేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల వారీగా జాబితా అనుబంధం-1 లో ఉంది.
మహిళల యాజమాన్యంలోని వ్యాపార సంస్థలకు 2022-23 సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకూ ఋణ హామీ పథకం కింద 3,40.013 మందికి రూ. 14, 247. 24 కోట్ల మేరకు ఋణ హామీలు లభించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల వారీగా జాబితా అనుబంధం-2 లో ఉంది.
మహిళా యాజమాన్య సంస్థలు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ( పిఎం ఈజీపీ) కింద 2022-23 సంవత్సరంలో 2023 ఫిబ్రవరి 28 నాటికి మార్జిన్ మనీ సబ్సిడీ కింద 26,241 మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల వారీగా జాబితా అనుబంధం-3 లో ఉంది.
ఎంఎస్ ఎం ఈ మంత్రిత్వశాఖ వారి ప్రొక్యూర్ మెంట్, మార్కెటింగ్ మద్దతు కింద మహిళల యాజమాన్యంలోని ఎం ఎస్ ఎం ఈ లకు 100 శాతం ఆర్థిక సహాయం /సబ్సిడీ ఇస్తున్నారు. ఇది వాణిజ్య ప్రదర్శనలలో పాల్గొనటానికి స్టాల్ అద్దెకు, ఎం ఎస్ ఎం ఈ లు ఏర్పాటు చేసే ప్రదర్శనలలో పాల్గొనటానికి వినియోగించుకోవచ్చు. మహిళాల ఎం ఎస్ ఎం ఈలతో సహాయ అన్నీ ఎం ఎస్ ఎం ఈలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవటానికి వీలుగా వివిధ పథకాల కింద ప్రభుత్వం ప్రోత్సాహకాలనందిస్తోంది. అందులో :
(i) దేశవ్యాప్తంగా నడిపే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ఎంఎస్ ఎం ఈ ప్రదర్శనలలో పాల్గొనటానికి
(ii) మార్కెటింగ్ పాకేజింగ్, ప్రాధాన్యం మీద, ఆధునిక పాకేజింగ్ పద్ధతుల మీద, ఎగుమతులు-దిగుమతుల విధానం మీద జెమ్ పోర్టల్ గురించి, అంతర్జాతీయ వర్తకం మీద అవగాహన పెంచే కార్యక్రమాలలో పాల్గొనటానికి
ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వశాఖ అంతర్జాతీయ సహకార పథకాన్ని అమలు చేస్తుంది. దీనివల్ల ఎం ఎస్ ఎంఈ ల సామర్థ్య నిర్మాణానికి వీలు కలిగి అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనగలుగుతాయి. అంతర్జాతీయ ప్రదర్శనలలో, సెమీనార్లలో సదస్సులలో కూడా పాల్గొని మార్కెటింగ్ ను విస్తరించుకుంటాయి. ఎగుమతి అవకాశాల మీద అవగాహన బాగా పెరుగుతుంది. సరికొత్త టెక్నాలజీల మీద కూడా అవగాహన పెంచుకోగలుగుతారు. డిమాండ్ లో వస్తున్న మార్పులు, కొత్త మార్కెట్ల గురించి తెలుస్తుంది. అంతర్జాతీయ సహకార పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2023 మార్చి 13 నాటికి 57 మంది మహిళా వ్యాపారులకు అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొనటానికి ఆర్థిక సహాయం అందింది.
***
(Release ID: 1907810)
Visitor Counter : 156