వ్యవసాయ మంత్రిత్వ శాఖ

బెంగళూరులో "అగ్రియూనిఫెస్ట్"ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ నరేందర్ సింగ్ తోమర్


భారతదేశ అభివృద్ధికి యువ శక్తి కీలకం: నరేందర్ సింగ్ తోమర్

Posted On: 15 MAR 2023 5:47PM by PIB Hyderabad

భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమని, దాని ప్రధాన స్వభావాలలో ఒకటి జనాభా కాగా, రెండవది ఆ జనాభాలో 60 శాతం మంది యువత అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

 

‘’ఈ రెండు శక్తుల కలయిక ఎంత గొప్పది అంటే, భారతదేశం ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడమే కాకుండా, మనం ఒకరికొకరు సహకరించుకుంటే ఈ సవాళ్లను జయించగల సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ -వచ్చే 25 సంవత్సరాల కాలాన్ని అమృత్ మహోత్సవ్ నుంచి అమృత్ కాల్ గా పేరు పెట్టారని,  దీనిని సక్రమంగా వినియోగించు కోవడంతో పాటు, మన దేశంలోని యువ జనాభా శక్తిని కూడా వినియోగిస్తే, 2047 వ

సంవత్సరానికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన భారత దేశంగా చూడవచ్చు’’ అన్నారు.

 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) సహకారంతో బెంగళూరు అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్వహించిన 5 రోజుల సాంస్కృతిక కార్యక్రమం 'అగ్రియూనిఫెస్ట్'లో కేంద్ర మంత్రి శ్రీ తోమర్ ఈ విషయం చెప్పారు.

ఈ ఉత్సవం లో 60 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు / డీమ్డ్ విశ్వవిద్యాలయాలు / కేంద్రీయ విశ్వవిద్యాలయాల నుండి 2500 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొని, 5 విభాగాల (సంగీతం, నృత్యం, సాహిత్యం, రంగస్థలం, ఫైన్ ఆర్ట్స్) కింద 18 ఈవెంట్లలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వివిధ భారతీయ సంస్కృతులను అనుసంధానం చేయడం ద్వారా భారతీయ వ్యవసాయాన్ని ఏకీకృతం చేసే లక్ష్యంతో 1999-2000 మధ్యకాలంలో అఖిల భారత అంతర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యూత్ ఫెస్టివల్ ను ఐసిఎఆర్ రూపొందించి,  ప్రారంభించింది, తద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయాల యువత లో ప్రతిభను పెంపొందించవచ్చు .వారు భారతీయ సాంస్కృతిక వైవిధ్యం తో మమేకం కావచ్చు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ తోమర్ మాట్లాడుతూ, మన జీవితంలోని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు చదువు ఒక వైపు అయితే,  ఒక వ్యక్తి మొత్తంగా అభివృద్ధి చెందినప్పుడు అతను తన కుటుంబం, సమాజం, సంస్థ, రాష్ట్రం , దేశం అభివృద్ధికి మరింత దోహదం చేయగలడు. దేశంలోని ప్రతి పౌరుడి ఆలోచన, దార్శనికత సమగ్రంగా ఉండాలని, అందరం కలిసి తమ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రధాన మంత్రి శ్రీ మోదీ చెపుతుంటారని శ్రీ తోమర్ అన్నారు. నేటి యుగంలో టెక్నాలజీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని , వ్యవసాయంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రస్తుత అవసరం అని తోమర్ పేర్కొన్నారు.

 

అన్ని రంగాల్లో పారదర్శకత తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, ఏళ్ల తరబడి జరగని పనులు కొద్ది రోజుల్లోనే పూర్తవుతాయన్నారు. మన ప్రతి కార్యక్రమంలో సాంకేతిక సహకారం ఉండాలని, దళారులను

నిర్మూలించాలన్న ప్రధాన మంత్రి శ్రీ మోదీ

మాటలను గుర్తు చేస్తూ, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని, ఇప్పటివరకు రూ .2.40 లక్షల కోట్లను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ద్వారా,  మధ్యవర్తులు లేకుండా, కోట్లాది మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా అందించామని, ఇది ఖచ్చితంగా ఆశ్చర్యకరమని శ్రీతోమర్అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ చొరవతో, నగదు రహిత లావాదేవీల పరంగా భార త్ ఈరోజు పెద్ద అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా ముందుందని, , గత ఏడెనిమిదేళ్లలో ఈ అద్భుతం జరిగిందని అన్నారు.

 

భారతదేశంలో విభిన్న భాషలు, విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయని, అయినప్పటికీ ఆస్టాక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతీయ సంస్కృతి ఆత్మ ఒకటేనని శ్రీ తోమర్ అన్నారు. వివిధ ప్రాంతాల్లో అగ్రియూనిఫెస్ట్ వంటి కార్యక్రమాల ద్వారా వివిధ రంగాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి దేశ సాంస్కృతిక ఐక్యతను చాటిచెప్పాలన్నారు. ఐక్యత సమైక్యతగా మారి, బలంగా ఉన్నప్పుడు భారతదేశ బలం పెరుగుతుందని,  ఈ బలం పెరుగుతూ ఉన్నప్పుడే మనం ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో విజయం సాధిస్తామని శ్రీ తోమర్ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ మోదీ యువ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు "ఖేలో ఇండియా" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని,  ఇది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని

శ్రీ తోమార్ తెలిపారు. క్రీడల ప్రోత్సాహంతో ఏ క్రీడనైనా ఏడాది పొడవునా నేర్చుకోవడం ద్వారా మన యువ క్రీడాకారులు ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో బంగారు పతకాలు సాధిస్తున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ కృషి ఫలితంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన సహా ప్రతి రంగంలోనూ దేశం తన ప్రావీణ్యాన్ని స్థాపించడంలో విజయం సాధించింది, దీని వల్ల యావత్ ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠ పెరిగింది.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శుశ్రీశోభ కరంద్లాజే, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ బి.సి.పాటిల్, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్.సి.అగర్వాల్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సురే్ష, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1907387) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Punjabi , Tamil