సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
2021లో, అక్టోబర్ 2 నుంచి 31 వరకు, నెలరోజుల పాటు సాగిన స్వచ్ఛత ప్రచారంలో దాదాపు 6154 కార్యాలయాల వ్యాప్తంగా విస్తరించి ఉన్న 12.01 లక్షల చదరపు అడుగుల చోటు శుభ్రం, తుక్కును విక్రయం ద్వారా రూ. 62.54 కోట్ల ఆదాయ ఆర్జన
प्रविष्टि तिथि:
15 MAR 2023 2:27PM by PIB Hyderabad
అనుబంధ/ జోడించిన కార్యాలయాలు సహా కేంద్ర మంత్రిత్వశాఖలు/ వఇభాగాలలో పెండెన్సీ (అపరిష్కృత)ని తగ్గించి, స్వచ్ఛతను వ్యవస్థాగతం చేయడం కోసం తొలి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని 2 నుంచి 31 అక్టోబర్, 2021వరకు ప్రభుత్వం నిర్వహించింది.
లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ ప్రచారంలో దాదాపు 6154 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పాలు పంచుకున్నట్టు కేంద్ర శాస్త్ర& సాంకేతిక (స్వతంత్ర ఛార్జి) సహాయమంత్రి, ఎర్త్ సైన్సెస్ (స్వతంత్ర ఛార్జి) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
నెలరోజుల పాటు సాగిన ఈ ప్రచారంలో ఈ 6154 కార్యాలయాల వ్యాప్తంగా విస్తరించిన 12.01 లక్షల చదరపు అడుగుల చోటును శుభ్రం చేయడంతో పాటుగా, తుక్కును విక్రయించడం ద్వారా రూ. 62.54 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. శుభ్రం చేసిన ఈ స్థలాన్ని ఆయా కార్యాలయాలు తమ ప్రాంగణంగా, కెఫెటేరియాగా, గ్రంథాలయంగా, కాన్ఫరెన్స్ హాల్‌గా, వెల్‌నెస్ సెంటర్లుగా, పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకుంటున్నాయి.
***
(रिलीज़ आईडी: 1907378)
आगंतुक पटल : 132