మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా అల్ప సంఖ్యాక వర్గాల పిల్లల సామాజిక- ఆర్ధిక, విద్యా సాధికారత కోసం వారిలో విద్యను ప్రోత్సహించడం కోసం చర్యలు
Posted On:
15 MAR 2023 4:16PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన పిల్లల సామాజిక- ఆర్థిక, విద్యాపరమైన సాధికారత కోసం వారిని విద్యలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఫలితంగా, ఆయా వర్గాలలో డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు ఈ చర్యలను తీసుకుంది. 1-X తరగతి చదువుతున్న పిల్లలకు ప్రీ- మెట్రిక్ స్కాలర్‌షిప్ పధకాన్ని2008 జనవరిలో ఆమోదించింది. ఈ పధకం 2021-22 వరకు వర్తిస్తుంది. మెట్రిక్ అనంతర స్కాలర్ షిప్‌ను XI, XII తరగతులు, ఉన్నత వర్గాల వారి కోసం 2007 నవంబర్‌లో ప్రారంభించింది. సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల వారి కోసం 2007లో మెరిట్-కమ్- మీన్స్ స్కాలర్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్దులు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందారు. ఈ పధకాలన్నింటిలో 30% సీట్లను విద్యార్దునల కోసం కేటాయించారు.
పైన పేర్కొన్న వాటికి అదనంగా, నైపుణ్యాల అభివృద్ధి - వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం - సాధికారత మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పధకాల ద్వారా ముఖ్యంగా ఆర్థికంగా బలహీనపడిన, బడుగు వర్గాలు. అల్ప సంఖ్యాక వర్గాలు సహా సమాజంలోని ప్రతి శ్రేణి సంక్షేమం, ఉద్ధరణ కోసం వివిధ పధకాలను ప్రభుత్వం అమలు చేసింది.
ఈ సమాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ వెల్లడించారు.
***
(Release ID: 1907258)