గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఎన్ వై సీ 2023- “నగరాలు భారతదేశపు అతి తీవ్రమైన పరీక్ష, లోహాలను కరగించు మూస, యువత దానిలో జనించే బంగారం”

Posted On: 14 MAR 2023 3:10PM by PIB Hyderabad

స్మార్ట్ సిటీస్ మిషన్ భారతదేశంలోని పట్టణ వాసుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది 

2030 నాటికి 600 మిలియన్లకు పైగా ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించేలా భారతదేశం సిద్ధమైంది.

 

టీ యూ లీ ఐ పి, ఐ ఎస్ సీ ఎఫ్ కార్యక్రమాలు యువతకు ఉపాధిని పెంచుతున్నాయి

ప్రపంచ పాలనలో పాల్గొనేందుకు యువతకు నేషనల్ యూత్ కాన్క్లేవ్ వేదిక 

అధిక యువజన జనాభా యొక్క ప్రయోజనం  దాని సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం మోడీ ప్రభుత్వానికి తెలుసు

 

ప్రభుత్వ భవిష్యత్తు సంసిద్ధత దృష్టి భారతదేశం పట్టణ ప్రాంతాల పునరుజ్జీవనాన్ని చూస్తోంది

 

పని ఉపాధి యొక్క భవిష్యత్తు, వాతావరణ మార్పు, ప్రజాస్వామ్యంలో యువత వంటి సమస్యలపై యువతకు తమ ఆందోళనలను ఆలోచనలను పంచుకోవడానికే ఒక వేదికను అందించినందుకు నేషనల్ యూత్ కాన్క్లేవ్ 2023ని గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి అభినందిచారు. యువత అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నదని మంత్రి ప్రస్తావిస్తూ, యువత అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఏటా తొంభై వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఆవిష్కరణ సంస్కృతిని ప్రస్తావిస్తూ, దేశంలోని స్టార్టప్‌ల విస్ఫోటనం  దేశంలోని యువత  వ్యవస్థాపక సంస్కృతికి ప్రోత్సహానికి నిదర్శనమని మంత్రి చెప్పారు.  పట్టణాభివృద్ధి రంగంలో యువకుల నూతన ఆవిష్కరణలను  అనేక విజ్ఞాన ఉత్పత్తులను పూరి ఆవిష్కరించారు. ఎన్ వై సీ 2023 నిర్వహణ కోసం స్మార్ట్ సిటీస్ మిషన్, ఎన్ ఐ యూ ఏ  మరియు యువశక్తి సంయుక్త ప్రయత్నాలను ప్రశంసించిన మంత్రి, అధిక యువజన జనాభా యొక్క ప్రయోజనం కారణంగా 2047 నాటికి భారతదేశం అన్ని విధాలుగా ప్రపంచంలో అగ్రగామిగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నాను.

 

స్మార్ట్ సిటీస్ మిషన్‌లో మరియు ప్రభుత్వ శాఖలలోని ప్రముఖ ఆవిష్కరణలలో యువత కీలక పాత్రను ప్రస్తావిస్తూ, భారతదేశం యొక్క జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడటానికి వినూత్న పరిష్కారాలను అందించడానికి వివిధ కార్యక్రమాల ద్వారా యువత  ప్రోత్సహించబడ్డారు. అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (తులిప్) మరియు ఇండియా స్మార్ట్ సిటీస్ ఫెలోషిప్ ప్రోగ్రాం (ISCF) కార్యక్రమాలను పట్టణ యువతకు అందించడం, లక్ష్యిత అధ్యయనం, సహకార అవకాశాలను అందించడం, వారి వృత్తిపరమైన అభివృద్ధి మరియు ఉపాధిని పెంపొందించడాన్ని ఆయన అభినందించారు. తులిప్ ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో ఇలాంటి జోక్యాలను ప్రారంభించింది. ప్రభుత్వ యంత్రాంగం అంతటా వినూత్న ఆలోచనల మార్పిడిని సులభతరం చేస్తోంది. ఈ పరివర్తన విస్తరణ ఆవిష్కరణలో అపూర్వమైన విస్ఫోటనానికి అవకాశం కల్పిస్తుందని, అందువల్ల ఉత్పాదక ఉపాధి పని కోసం ఇప్పటికే ఉన్న మార్గాలను  పట్టుకోవాలని మరియు  ఉద్యోగాల కోసం అభివృద్ధి చెందుతున్న  నూతన నైపుణ్యం డిమాండ్‌ను రెండింటినీ కూడా పట్టుకోవాలని యువతను కోరారు.

 

భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క స్మార్ట్ సిటీస్ మిషన్‌తో కలిసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) నిర్వహించిన ఎన్ వై సీ 2023లో ఆయన ప్రసంగించారు. ఈ రోజు ఇక్కడ యూ20 మరియు వై 20 ప్రాధాన్యతా రంగాలపై మరియు రేపటి ప్రకాశవంతమైన నాయకులను ప్రోత్సహించడానికి కాన్క్లేవ్ యువ శక్తిని మనస్సులను ఒకచోట చేర్చింది.

 

అంతకుముందు రోజు, గౌరవ గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్, మన ‘యువశక్తి’ దేశ వృద్ధి పదానికి అత్యంత ముఖ్యమైన సహకారిలో ఒకటిగా ఉన్న బలాన్ని నొక్కి చెబుతూనే ‘నశముక్త్ భారత్’ కోసం పని చేయవలసిన అవసరాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు శ్రీ. కునాల్ కుమార్, సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ (SCM), శ్రీ. హితేష్ వైద్య, డైరెక్టర్, ఎన్ ఐ యూ ఏ,  శ్రీమతి మీటా రాజీవ్‌లోచన్, యువజన వ్యవహారాలు, శ్రీ. ప్రవీణ్ చౌదరి, యూ 20-షెర్పా మరియు శ్రీ అన్మోల్ సోవిట్, చైర్, వై 20 సెక్రటేరియట్ పాల్గొన్నారు.

 

2021 మరియు 2022 ఎన్ ఐ యూ ఏ-ఎన్ ఎం సీ జీ స్టూడెంట్ థీసిస్ కాంపిటీషన్ మరియు సీ పీ ఐ ఎన్ చర్చల విజేతల ప్రెజెంటేషన్‌లతో పాటు "అసమాన ప్రపంచంలో సమాన భవిష్యత్తులను సృష్టించడం" మరియు "యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మీడియా పాత్ర" అనే అంశంపై ప్యానెల్ చర్చలు వివిధ సంస్థలు మరియు మీడియా ప్రతినిధుల నుండి వివిధ ప్రముఖులు, యువకుల సమక్షంలో జరిగాయి.

 

తరువాతి సెషన్‌లో, శ్రీమతి నిధి శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్, ఈ టీ, చురుకైన యువత పాత్ర యొక్క ప్రాముఖ్యత మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పారదర్శకత మరియు సమాచార లభ్యత యొక్క ఆవశ్యకత గురించి చర్చించారు. మిస్టర్ కౌశిక్ దేకా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఇండియా టుడే నిర్మాణ ప్రాజెక్టులను పరిశీలించడంలో మరియు దాని సామాజిక మరియు పర్యావరణ ప్రభావాలను ప్రదర్శించడంలో మీడియా యొక్క కీలక పాత్రను ఎత్తి చూపారు; శ్రీమతి చిత్రా త్రిపాఠి, యాంకర్, ఆజ్‌తక్, పట్టణ రంగాలలో యువత వాణిని ప్రోత్సహించడంలో మీడియా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ముగింపు వ్యాఖ్యగా, అడిషనల్ డైరెక్టర్ జనరల్- ఎం ఓ హెచ్ యూ ఏ  మరియు సెషన్‌కు మోడరేటర్ అయిన రాజీవ్ జైన్, పట్టణ ప్రాంతాల కోసం నిర్ణయం తీసుకునే ప్రక్రియలో యువత భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తద్వారా దేశం యొక్క పట్టణ అభివృద్ధి పథాన్ని వ్యక్తపరిచారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీలో భాగంగా దేశం యొక్క మొత్తం అభివృద్ధిలో చురుకైన యువత నిమగ్నతను ప్రోత్సహించడానికి ప్యానెల్ చర్చ నిర్వహించబడింది. పాల్గొనేవారి నుండి అధిక స్పందన వచ్చింది.

 

సదస్సు, క్విజ్ మరియు వ్రక్తుత్వ పోటీలు, చర్చలు, క్లైమేట్ కేఫ్ మరియు ఆకర్షణీయమైన చర్చల ద్వారా యువత ప్రజాస్వామ్య వ్యవహారాలు కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి సహాయపడింది. ఈ రెండు రోజుల ఈవెంట్లో 50 పైగా స్పీకర్లు, 100 పైగా పట్టణ నాయకులు, 300 పైగా   ప్రదర్శనలు మరియు కేస్ స్టడీస్, 500 పైగా క్లైమేట్ లీడర్‌లతో 10  పైగా  థీమ్ మరియు బ్రేక్అవుట్ సెషన్‌లను కవర్ చేసింది. 3000 పైగా ప్రజలు విజ్ఞాన్ భవన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో సెషన్‌లకు హాజరయ్యారు. ఈ జాతీయ ఈవెంట్‌లో దేశం నలుమూలల నుండి విద్యార్థులు మరియు యువ నిపుణులు, నిపుణులు మరియు ఆవిష్కర్తలు పాల్గొనడం ద్వారా భారతదేశం యొక్క పట్టణ ప్రాంతాల యొక్క ముఖ్యమైన సమస్యలు మరియు ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి సహ-సృష్టించడానికి, సహకరించడానికి మరియు అనుసంధానానికి వేదిక అయ్యింది.

 

షెర్పా-ఇండియా ప్రెసిడెన్సీ @జీ20 శ్రీ అమితాబ్ కాంత్ వేడుకలో ప్రసంగిస్తూ, అందరికీ వర్ధిల్లుతున్న మరియు సమానమైన భవిష్యత్తును నిర్ధారించడానికి యువత అనుకూల దృష్టిని రూపొందించాల్సిన  ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. పర్యావరణ స్పృహతో కూడిన ప్రవర్తనల  చోదకులుగా, ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా మరియు అత్యాధునిక పరిష్కారాలను అందించే ఆవిష్కర్తలుగా మరియు ప్రదాతలుగా యువత పాత్రను తక్కువగా అంచనా వేయలేమని ఆయన అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ సమాజం తమ అంకితభావాన్ని  ప్రదర్శించటానికి వీలు కల్పించే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి యువ నాయకులు చేతులు కలపాలని మరియు కలిసి పనిచేయాలని ఆయన స్వాగతించారు. ఎన్ ఐ యూ ఏ డైరెక్టర్ శ్రీ హితేష్ వైద్య ధన్యవాదాలు తెలుపుతూ సెషన్‌ను ముగించారు.

 

 

https://twitter.com/HardeepSPuri/status/1635304564860809217 HSP

 

https://twitter.com/IndiaY20/status/1635161693226676224

 

https://twitter.com/niua_india/status/1635226334678110211?s=48&t=h9wZpCAe-gqGgw8MoGKLeA

 

https://twitter.com/niua_india/status/1635227846909239297?s=48&t=h9wZpCAe-gqGgw8MoGKLeA

 

https://twitter.com/niua_india/status/1635229319185469441?s=48&t=h9wZpCAe-gqGgw8MoGKLeA

 

https://twitter.com/niua_india/status/1635246021289840641?s=48&t=h9wZpCAe-gqGgw8MoGKLeA

 

https://twitter.com/niua_india/status/1635237508194910208?s=48&t=h9wZpCAe-gqGgw8MoGKLeA

 

నేషనల్ యూత్ కాన్క్లేవ్ 2023 గురించి మరింత తెలుసుకోవడానికి దిగువ లింక్ ను క్లిక్ చేయండి :

https://niua.in/youthengagement

****



(Release ID: 1907018) Visitor Counter : 118