నౌకారవాణా మంత్రిత్వ శాఖ
దేశంలో ఓడరేవులు మరియు షిప్పింగ్ కేంద్రాలతో పాటు వివిధ ఆర్థిక మండలాలకు బహుళ మోడల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్
Posted On:
14 MAR 2023 1:08PM by PIB Hyderabad
పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపి) అనేది మల్టీమోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు అంతరాయాలను తగ్గించడంపై దృష్టి సారించడంతో పాటు ప్రజలు మరియు వస్తువులకు సంబంధించి అవాంతరాలు లేని తరలింపు కోసం క్లిష్టమైన మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో సమగ్ర మరియు సమగ్ర ప్రణాళిక కోసం పరివర్తనాత్మక విధానం. అంతే కాకుండా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా భరోసా కల్పిస్తుంది.
ఓడరేవులు మరియు షిప్పింగ్ రంగంతో సహా వివిధ ఆర్థిక మండలాలకు బహుళ మోడల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేయడం ఎన్ఎంపి లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం గతి శక్తి చొరవ కింద ఇప్పటివరకు పోర్ట్స్ మరియు షిప్పింగ్‌కు సంబంధించి రూ.60,872 కోట్ల విలువైన 101 ప్రాజెక్ట్‌లను గుర్తించడం జరిగింది. వీటిలో రూ.4,423 కోట్లతో 13 ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఓడరేవులు మరియు షిప్పింగ్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల రాష్ట్రవారీ జాబితా జతచేయబడింది.
మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రాల మూలధన వ్యయం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ "2022-23 మూలధన పెట్టుబడులకు రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం" రెండో దశను (పిఎం-గతి శక్తి సంబంధిత వ్యయం కోసం) వ్యయ శాఖ రూపొందించింది.సున్నా వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలుగా రాష్ట్రాల మధ్య పంపిణీకి రూ.5000 కోట్లు అదనపు కేటాయింపు మంజూరు చేయబడింది.
నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ వ్యాపార సౌలభ్యం కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. మోడల్ రాయితీ ఒప్పందం, రాయితీదారులకు సౌలభ్యం, కొత్త టారిఫ్ మార్గదర్శకాలు మొదలైన ప్రోత్సాహకాలు జారీ చేయబడ్డాయి. ఇవి ప్రధాన పోర్టులలో పోర్ట్ పనితీరును మెరుగుపరచడానికి వీలు కల్పిస్తాయి. ఏదేమైనప్పటికీ పిఎం గతి శక్తి కింద అధిక పనితీరు కనబరిచే ఏ పోర్ట్‌కు అదనపు ప్రోత్సాహకాలను అందించడానికి ఉద్దేశించిన అంశం లేదు.
***
(Release ID: 1907011)
Visitor Counter : 167