ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పిఎంకెఎస్‌వై కింద కేటాయించిన నిధులు
Posted On:
14 MAR 2023 3:34PM by PIB Hyderabad
కేంద్ర రంగ గొడుగు పథకమైన ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (పిఎంకెఎస్‌వై) కింద 2017-19 నుంచి 2022-23 కాలానికి మొత్తం రూ. 4439.20 కోట్ల నిధులను కేటాయించినట్టు బుధవారంనాడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆహార ప్రాసెసింగ్ (శుద్ధి / తయారీ) పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. మొత్తం రూ. 4439.20 కోట్లలో 28.02.2023 నాటికి పిఎంకెఎస్‌వై కింద ఆర్ధిక సహాయం రూపంలో రూ. 3566.80 కోట్లను విడుదల చేశారు.
ఇప్పటివరకూ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఒఎఫ్‌పిఐ) ఆహార పరీక్ష ప్రయోగశాలలు, ఆహార ప్రాసెసింగ్ రంగంపై పరిశోధన & అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి సహా 1375 ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టులను దాదాపు రూ. 8536.14 కోట్ల ఆర్ధిక సహాయంతో మంజూరు చేసింది. సంపద (ఎస్ఎఎంపిఎడిఎ) పధకం 56.01 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 8.28 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు తోడ్పడింది.
ఉపపథకాలు - (1) ఏకీకృత చలవ లంకె & విలువ కూర్పు మౌలిక సదుపాయాలు (2) వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లకు మౌలిక సదుపాయాల సృష్టి (3) ఆహార ప్రాసెసింగ్ & నిల్వ సామర్ధ్యాల సృష్టి / విస్తరణ (4) ముడి వ్యవసాయ ఉత్ప్తుల శుద్ధి స్థాయిని పెంచి పాడైపోవడం వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు పిఎంకెఎస్‌వైకు చెందిన ఆపరేషన్ గ్రీన్స్ సహాయపడుతుంది. శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రధాన చర్యలు తీసుకుంటూ, వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని, ఒక జిల్లా, ఒక ఉత్పత్తి (ఒడిఒపి) ప్రాతిపదికన ఎగుమతి హబ్‌లుగా జిల్లాలు (డిఇహెచ్) పథకం, ఉత్పత్తి ఆధారిత చొరవల పథకం, మిషన్లు/ ఎంబసీలతో సమన్వయం, వాణిజ్య ప్రదర్శనల, కొనుగోలుదారు- అమ్మకందార్ల సమావేశాలను నిర్వహిస్తోంది.
***
(Release ID: 1907010)
Visitor Counter : 171