రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ః విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో సింధుకీర్తి జలాంతర్గామి సాధారణ మరమత్తుల కోసం మొత్తం రూ. 900 కోట్లకు పైగా ఒప్పందాన్ని కుదుర్చుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
13 MAR 2023 4:59PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి మరో ప్రోత్సాహకంగా, రక్షణ మంత్రిత్వ శాఖ మార్చి 13, 2023న విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) లో మొత్తం రూ. 934 కోట్ల వ్యయంతో సింధుకీర్తి జలాంతర్గామి సాధారణ మరమత్తుల కోసం ఒప్పందంపై సంతకం చేసింది. సింధుకీర్తి 3వ కిలో క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. తిరిగి అమరిక లేదా మరమత్తుల తర్వాత సింధుకీర్తి పోరాట యోగ్యం అయ్యి, భారత నావికాదళంలో క్రియాశీలక జలాంతర్గాముల నౌకాదళంలో చేరుతుంది.
జలాంతర్గాములకు ప్రత్యామ్నాయ మరమ్మత్తు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మరమత్తు ఆఫలోడ్ చేయడం జరిగింది. అంతేకాక హెచ్ఎస్ఎల్ వద్ద లైఫ్ సర్టిఫికేషన్ తో మీడియం రీఫిట్‌ను చేపట్టే దిశగా ఇది మరింత ముందడుగు. ఈ ప్రాజెక్టులో 20 సూక్ష్మం, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇలు) ఉండటమే కాక ప్రాజెక్ట్ వ్యవధికి రోజుకు 1000పని దినాలతో ఉపాధి కల్పనకు దారితీస్తుంది.
***
(Release ID: 1906762)
Visitor Counter : 150