ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంతంలో 2014-22ల మధ్య రూ.15867.01 కోట్ల విలువైన 1,350 అభివృద్ధి ప్రాజెక్టులు పథకాలు/ప్యాకేజీలు మంజూరు చేయబడ్డాయి.

Posted On: 13 MAR 2023 4:38PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతంలో (NER)లో కేంద్ర ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్‌మెంట్‌ల ద్వారా దిగువ పేర్కొన్న అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్‌లు చేపట్టబడ్డాయి,

 

రోడ్డు అనుసంధానం: ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్న ప్రధాన రాజధాని రోడ్ అనుసంధానం ప్రాజెక్టులలో నాగాలాండ్‌లోని దిమాపూర్-కోహిమా రోడ్ (62.9 కి.మీ) 4 లేనింగ్ ఉన్నాయి; అరుణాచల్ ప్రదేశ్‌లోని హోలోంగికి (167 కి.మీ) నాగోన్ బైపాస్ 4 లేనింగ్; సిక్కింలో బాగ్రాకోట్ నుండి పాక్యోంగ్ (NH-717A) (152 కిమీ) వరకు ప్రత్యామ్నాయ రెండు-లేన్ హైవే; మిజోరంలో ఐజ్వాల్ - తుపాంగ్ NH-54 (351 కిమీ) యొక్క 2 లేనింగ్; NH-39 (20 కి.మీ) యొక్క ఇంఫాల్ - మోరే సెక్షన్ యొక్క 4 లేనింగ్ మరియు మణిపూర్‌లో 75.4 కి.మీల 2-లేనింగ్ వున్నాయి. గత 7 సంవత్సరాలలో (2021-22తో సహా, డిసెంబర్ 2022 వరకు) ఈశాన్య ప్రాంతంలో రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ మొత్తం 4121 కి.మీ రోడ్డు ప్రాజెక్టులను పూర్తి చేసింది. రూ.1,05,518 కోట్లతో 7545 కిలోమీటర్ల పొడవున ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

 

వాయు మార్గ అనుసంధానం: ఈశాన్య ప్రాంతంలో 17 ఎయిర్‌పోర్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి.

ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్‌లో దోనీ పోలో విమానాశ్రయం (పూర్వపు హోలోంగి విమానాశ్రయం) ప్రారంభించబడింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజులో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి; అస్సాంలోని దిబ్రూఘర్, గౌహతి మరియు సిల్చార్ విమానాశ్రయాలు; మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయం; మేఘాలయలోని బరపాని విమానాశ్రయం మరియు త్రిపురలోని అగర్తల విమానాశ్రయం మొదలైనవి కొనసాగుతున్నాయి.

 

రైలు అనుసంధానం: 2014-15 నుంచి ఇప్పటి వరకు రూ.19855 కోట్లతో 864.7 కి.మీ పొడవుతో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి. ప్రస్తుతం, ఈశాన్య ప్రాంతంలో పూర్తిగా/పాక్షికంగా  2,011 కి.మీ పొడవు తో రూ.74,485 కోట్ల వ్యయంతో కొత్త లైన్లతోపాటు డబ్లింగ్ కోసం 20 ప్రాజెక్టులు ప్రణాళిక/ ఆమోదం/ అమలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 321 కి.మీ పొడవును ప్రారంభించి రూ.26,874 కోట్లు ఖర్చు చేశారు.

 

జలమార్గ అనుసంధానం: 1988లో ధుబ్రి (బంగ్లాదేశ్ సరిహద్దు) నుండి సాదియా (891కిమీ) వరకు బ్రహ్మపుత్ర నదిని జాతీయ జలమార్గం-2(NW-2)గా ప్రకటించారు. అవసరమైన లోతు మరియు వెడల్పు, పగలు మరియు రాత్రి ప్రయాణ సహాయాలు మరియు ఫెయిర్‌వేతో జలమార్గం అభివృద్ధి చేయబడుతోంది. 5 సంవత్సరాలలో (2020-2025) రూ.461 కోట్ల ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యాలు  ప్రణాళిక రూపొందించారు అభివృద్ధి చేసారు. బరాక్ నదిని 2016 సంవత్సరంలో జాతీయ జలమార్గం-16 (NW -16)గా ప్రకటించారు. ఇది ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ (IBP) మార్గం ద్వారా అస్సాంలోని కాచర్ లోయలోని సిల్చార్, కరీంగంజ్ మరియు బదర్‌పూర్‌లను హల్దియా మరియు కోల్‌కతా పోర్టులతో కలుపుతుంది. 5 సంవత్సరాలలో (2020-2025) రూ.145 కోట్ల వ్యయంతో రూపొందించబడిన మరియు ప్రణాళికాబద్ధమైన సౌకర్యాల పనులు చేపట్టారు.

 

టెలికాం అనుసంధానం: టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ ప్రాంతంలో టెలికాం కనెక్టివిటీని బలోపేతం చేయడం కోసం ఈశాన్య రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులను చేపట్టింది, వీటిలో (i) అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలలోని దూరప్రాంత గ్రామాలలో మొబైల్ సేవలు ఉన్నాయి. మరియు అరుణాచల్ ప్రదేశ్ (జాతీయ రహదారులు మాత్రమే) మరియు జాతీయ రహదారి వెంట కవరేజీ; (ii) మేఘాలయలో మొబైల్ కనెక్టివిటీ మరియు 4జీ టెక్నాలజీపై జాతీయ రహదారుల వెంట కనెక్టివిటీ; (iii) అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలోని 2 జిల్లాలలో మొబైల్ కనెక్టివిటీ; (iv) ఈశాన్య ప్రాంతంలోని గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ మరియు వై-ఫై కనెక్టివిటీ; మరియు (v) కాక్స్ బజార్ ద్వారా బంగ్లాదేశ్‌లోని బీ ఎస్ సీ సీ ఎల్  నుండి అగర్తలాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం 10 జీ బీ పీ ఎస్ అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్ సౌకర్యం. ఈశాన్య రాష్ట్రాలలో, 1,246 గ్రామాలను కవర్ చేసే 1,358 టవర్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.

 

అదనంగా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MDoNER) వివిధ పథకాలు/ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (NESIDS), కేంద్ర ప్రభుత్వ మురిగిపోని వనరుల  (NLCPR) పథకం, అస్సాం ప్రత్యేక ప్యాకేజీలు [బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC), డిమా హసావో అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ (DHATC) మరియు కర్బీ ఆంగ్లాంగ్ అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ (KAA )], హిల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (HADP), సోషల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (SIDF), ఈశాన్య ప్రాంత కౌన్సిల్(నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్) మరియు నార్త్ ఈస్ట్ రోడ్ సెక్టార్ డెవలప్‌మెంట్ స్కీమ్ (NERSDS), ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం పలు అభివృద్ధి పథకాలు/ప్యాకేజీల కింద, కనెక్టివిటీ ప్రాజెక్టులతో సహా రూ.15,867.01 కోట్ల విలువైన 1,350 ప్రాజెక్టులు 2014-15 నుండి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరు చేయబడ్డాయి.

 

ఈ సమాచారాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి లోక్‌సభలో ఈరోజు లిఖితపూర్వకంగా తెలిపారు.

***



(Release ID: 1906759) Visitor Counter : 103