సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) దేశాలతో భారతదేశం కలిగి ఉన్న నాగరికత సంబంధాలపై దృష్టి సారించి మార్చి 14-15 తేదీల్లో " బౌద్ధ వారసత్వ అనుబంధం "పై అంతర్జాతీయ సమావేశం .
Posted On:
13 MAR 2023 5:09PM by PIB Hyderabad
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాలతో భారతదేశం కలిగి ఉన్న నాగరికత సంబంధాలపై దృష్టి సారించి మార్చి 14-15 తేదీల్లో " బౌద్ధ వారసత్వ అనుబంధం "పై అంతర్జాతీయ సమావేశం 2023 మార్చి 14,15 తేదీల్లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్నది.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష హోదాలో (17 సెప్టెంబర్, 2022 నుంచి 2023 సెప్టెంబరు వరకు ఒక సంవత్సరం పాటు) భారతదేశం తొలిసారిగా నిర్వహిస్తున్న సమావేశంలో మధ్య ఆసియా, తూర్పు ఆసియా, దక్షిణాసియా అరబ్ దేశాలు ఒక ఉమ్మడి వేదికపైకి రానున్నాయి. " బౌద్ధ వారసత్వ అనుబంధం " పై జరిగే సమావేశంలో పాల్గొనే దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో చైనా, రష్యా మరియు మంగోలియా తో సహా సభ్య దేశాలు, పరిశీలక దేశాలు, చర్చల్లో పాల్గొనే దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి." బౌద్ధ వారసత్వ అనుబంధం " అనే అంశంపై 15 మందికి పైగా మేధావులు - ప్రతినిధులు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారు. చైనాలోని డన్‌హువాంగ్ రీసెర్చ్ అకాడమీ, కిర్గిజ్స్తాన్ కి చెందినఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ ఎథ్నాలజీ, రష్యా స్టేట్ మ్యూజియం ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ రిలిజియన్, నేషనల్ మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్ ఆఫ్ తజికిస్తాన్; బెలారసియన్ స్టేట్ యూనివర్శిటీ ,మయన్మార్ ఇంటర్నేషనల్ థెరవాడ బౌద్ధ మిషనరీ యూనివర్శిటీ లాంటి సంస్థలకు చెందిన ప్రతినిధులు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (సాంస్కృతిక మంత్రిత్వ శాఖనుంచి నిధులు పొందుతున్నఐబిసి ) కలిసి రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ బౌద్ధమత పండితులు కూడా పాల్గొంటారు. పాల్గొనేవారు ఢిల్లీలో కొన్ని చారిత్రక ప్రదేశాలు సందర్శిస్తారు.
మధ్య ఆసియా లోని బౌద్ధ కళలు, కళా శైలులు, పురావస్తు ప్రదేశాలు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలకు చెందిన వివిధ మ్యూజియంలు సేకరించిన ప్రాచీన కళాఖండాల మధ్య ఉన్నసారూప్యతలు గుర్తించి దేశాల మధ్య పురాతన సాంస్కృతిక సంబంధాలు పునరుద్ధరించాలన్న లక్ష్యంతో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరగనున్నది.
అనాది కాలం నుంచి ఆలోచనలు భౌగోళిక సరిహద్దులు, ఎత్తైన పర్వతాలు, విశాలమైన మహా సముద్రాలు దేశాల సరిహద్దులు దాటి సుదూర దేశాల్లో వ్యాప్తి చెంది, ఆ దేశ ప్రజల గుర్తింపు గౌరవం పొందాయి. బుద్ధ భగవాన్ ప్రబోధనలు ఎల్లలు దాటి విభిన్న దేశాల సంస్కృతులతో సుసంపన్నం అయింది.
బుద్ధుని బోధనలు విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి. మానవీయ దృక్పథం కళలు, వాస్తు శిల్పం, శిల్పం , మానవ వ్యక్తిత్వం సూక్ష్మ లక్షణాలను బుద్ధుని బోధనలు వివరిస్తాయి. కరుణ, సహజీవనం, స్థిరమైన జీవన వ్యక్తిగత వృద్ధి సాధించడానికి బుద్ధుని బోధనలు సహకరిస్తాయి.
సదస్సులో వివిధ భౌగోళిక ప్రాంతాలకు చెందిన దేశాలు పాల్గొని ఉమ్మడి నాగరికత వారసత్వం ఆధారంగా దేశాల మధ్య సంబంధాలు మెరుగు పరుచుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో పాల్గొంటున్నాయి. భారత ఉపఖండం, ఆసియా దేశాలకు చెందిన వివిధ సంస్కృతులు, సంఘాలు మరియు ప్రాంతాలను ఏకీకృతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన బౌద్ధ మిషనరీలు రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపి పురాతన బంధాలను భవిష్యత్తులో కొనసాగించడానికి మార్గాలను గుర్తిస్తాయి.
****
(Release ID: 1906758)
Visitor Counter : 254