హోం మంత్రిత్వ శాఖ

అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, అహ్మదాబాద్‌ అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ కి సంబంధించి 154కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి పనులను వీడియో కాన్ఫరెన్సింగ్‌ద్వారా ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా .


ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం, గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ నాయకత్వంలోని గుజరాత్‌ ప్రభుత్వం, గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిచేసేందుకు కలసికట్టుగా కృషిచేస్తున్నాయి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్‌లోని డబుల్‌ ఇంజిన్‌ సర్కారు, గుజరాత్‌లో ఏ ఒక్కరూ నిరాశ్రయులుగా ఉండరాదని సంకల్పం చెప్పుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్మార్ట్‌స్కూల్‌ విధానాన్ని నూతన

విద్యావిధానంలో పేర్కొన్నారని, ఇది విద్యార్థులలో ప్రాథమిక స్థాయిలోనే వారి ప్రతిభను వెలికితీసేందుకు పనికి వస్తుందని తెలిపారు. ఆ రకంగా అన్నివిధాలుగా వారి సమగ్ర అభివృద్ధికి వీలు కలుగుతుందన్నారు.

ఇవాళ మునిసిపల్‌ బోర్డు కింద, అన్ని పాఠశాలలు స్మార్ట్‌ స్కూళ్లుగా పనిచేస్తున్నాయని, త్వరలోనే పిల్లలందరూ స్మార్ట్‌ పాఠశాలల ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

Posted On: 10 MAR 2023 5:55PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, అహ్మదాబాద్‌ అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ కింద 154 కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి పథకాలను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులలో చంద్రఖేడా, సమర్మతి, షీలా, తల్టెజ్‌, సర్కెజ్‌ లలో స్మార్ట్‌ పాఠశాలల ఏర్పాటుతో సహా పలు కార్యక్రమాలు ఉన్నాయి. దీనితోపాటు  చాంద్‌ఖేడా, నవడాజ్‌ వద్ద 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీనియర్‌ సిటిజన్‌ పార్క్‌, అహ్మదాబాద్‌`విరామ్‌గమ్‌  బ్రాడ్‌గేజ్‌ లైన్‌ సమీపంలో 4.39 కోట్ల రూపాయల పాదచారుల సబ్‌వే,  40 లక్షల రూపాయల వ్యయంతో 5 అంగన్‌వాడీలు,  97 కోట్ల రూపాయల వ్యయంతో  సర్దార్‌ పటేల్‌ రింగ్‌ రోడ్‌వద్ద సంతాల్‌ జంక్షన్‌ వద్ద ఓవర్‌బ్రిడ్జిని కూడా మంత్రి ప్రారంభించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ తోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఇందుకు కారణం, ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి అని ఆయన అంటూ, స్వధర్మ, స్వరాజ్‌స్వభాష ఆధారంగా దేశ ఆత్మగౌరవానికి ఆయన సరికొత్త నిర్వచనం ఇచ్చారని అన్నారు.  పట్టుమని 15 సంవత్సరాల వయసులో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ , మోఘలులకు ఎదురొడ్డి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచారని ఆయన చెప్పారు. అలాగే ఈరోజు సావిత్రీ బాయ్‌ పూలే వర్దంతి అని, మహిళా సాధికారత,మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషిచేశారని అన్నారు.  
మహాత్మాజ్యోతిబా , సావిత్రీబాయ్‌ ఫూలే ఇరువురూ మహిళలకు సంబంధించి పలు సంస్కరణల దిశగా కృషిచేశారని చెప్పారు.

ఇవాళ 154 కోట్ల రూపాయల విలువగల పలుఅభివృద్ధిపనులను ప్రారంభించినట్టు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఇందులో భారీ ప్రాజెక్టు, 100 కోట్ల రూపాయలతో సర్దార్‌పటేల్‌రింగ్‌రోడ్‌ పై సంతాల్‌ జంక్షన్‌ వద్ద నిర్మించిన కొత్త ఓవర్‌ బ్రిడ్జి అని ఆయన చెప్పారు. సనంద్‌ జిఐడిసి ప్రాంతంలో , పరిసరాలలో, భారీ పారిశ్రామికీకరణ వల్ల ,  కొత్త ఓవర్‌బ్రిడ్జి అవసరం పెరిగిందని అందుకు అనుగుణంగా దీనిని చేపట్టినట్టు తెలిపారు. ఇది అహ్మదాబాద్‌ గ్రామీణ ప్రాంతం మొత్తానికి పనికివస్తుందని చెప్పారు.
 షేలా గ్రామంలో డ్రైనేజ్‌ పనులకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అయిందని అమిత్‌ షా తెలిపారు. ఈపనులు షస్త్రలా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అమిత్‌షా తెలిపారు. ఇది ఇక్కడి  పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగుపడడానికి ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. దీనికితోడు, ముఖ్యమంత్రి ఆవాస్‌యోజన కింద , 468 కుటుంబాలు ఈరోజు బావ్లానగర్‌లో  ఇళ్లు సొంతం చేసుకున్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో , గుజరాత్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌, గుజరాత్‌లో ఏ ఒక్కరూ గూడు లేకుండా ఉండే పరిస్థితి ఉండకూడదని సంకల్పం చెప్పుకుందని శ్రీ అమిత్‌ షా తెలిపారు.  అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కింది, స్మార్ట్‌ పాఠశాలలనుకూడా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. చాంద్‌ఖేడా, సబర్మతి, షస్త్రలా, థాల్‌టెజ్‌, షార్‌ఖెజ్‌లలో ఈ పాఠశాలలు ప్రారంభించుకున్నట్టు ఆయన తెలిపారు. స్మార్ట్‌ పాఠశాలల అంశాన్ని ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ , నూతన జాతీయవిద్యా విధానంలోనే పొందుపరిచారని ఆయన తెలిపారు. దీని ఉద్దేశం, విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రాధమిక విద్య స్థాయిలోనే అవకాశం కల్పించడమని ఆయన అన్నారు. దీనివల్ల వారి సంపూర్ణ ప్రగతికి వీలు కలుగుతుందన్నారు. స్మార్ట్‌ పాఠశాలలంటే, అది కేవలం ఒక  కాన్సెప్ట్‌ కాదని, ఇది పిల్లల జీవితాలలో మార్పును తీసుకువచ్చేందుకు ఉద్దేశించినదని ఆయన అన్నారు.ఈ పాఠశాలల ద్వారా పిల్లల విద్యలో తప్పకుండా గుణాత్మక మార్పు వస్తుందని ఆయన అన్నారు.

 ఎయుడిఎ పరిధిలో చంద్రఖేడా వద్ద సీనియర్‌ సిటిజన్‌ పార్కును కూడా ప్రారంభించుకున్నామని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. దీనితోపాటు విరామ్‌గామ్‌ బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ కింద అండర్‌ పాస్‌ పనులు కూపడా పూర్తయ్యాయని ఆయన చెప్పారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందని చెప్పారు.

అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ విద్యాకమిటీ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలలో విశేష కృషి జరిగిందని అమిత్‌ షా తెలిపారు. 459 మునిసిపల్‌ పాఠశాలల్లో 1.70 లక్షల మంది  విద్యార్థులు చదువుకుంటున్నారని, వారి విద్యా నాణ్యతను పెంచేందుకు గట్టి కృషి జరిగిందని ఆయన అన్నారు. ఇవాళ మునిసిపల్‌ బోర్డు కిందగల అన్ని పాఠశాలలు స్మార్ట్‌ పాఠశాలలుగా మారడం మొదలైందని,త్వరలోనే ఈ ప్రాంతంలోని పిల్లలందరూ స్మార్ట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించే అవకాశం పొందుతారని అన్నారు.

కేంద్రంలో శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో సర్కారు, గుజరాత్‌లో ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ నాయకత్వంలోని ప్రభుత్వం,కలసికట్టుగా పనిచేస్తూ గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. 

***

 



(Release ID: 1906754) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Kannada