వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
18వ భారతదేశం, ఆస్ట్రేలియా దేశాల మంత్రుల స్థాయి సంయుక్త కమిషన్ సంయుక్త ప్రకటన
Posted On:
12 MAR 2023 1:40PM by PIB Hyderabad
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి సెనేటర్ డాన్ ఫారెల్ నిన్న సమావేశమయ్యారు.
ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీ ఏ) అమలు, భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) కోసం చర్చలు, ద్వైపాక్షిక పెట్టుబడులను మరింత ఎక్కువ చేయడానికి గల అవకాశాలపై రెండు దేశాల మంత్రులు చర్చించారు. జీ-20, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ (ఐపీఈఎఫ్), వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)లో భాగస్వామ్యం అంశం చర్చకు వచ్చింది.
రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలని భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సహకారానికి సంబంధించిన నూతన రంగాల్లో మరింత సహకారం అందించే విధంగా ఈసీటీఏ రూపొందించిన ప్రతిష్టాత్మక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) చర్చల్లో సత్వర పురోగతి సాధించాలని రెండు దేశాల ప్రధానమంత్రులు కోరుతున్నారని మంత్రులు గుర్తించారు. సిఇసిఎ వల్ల ఉపాధి అవకాశాలు లభించి రెండు దేశాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడడంతో పాటు రెండు దేశాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. సిఇసిఎ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని రెండు దేశాల మంత్రులు నిర్ణయించారు. వివిధ ద్వైపాక్షిక సాంకేతిక మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించే దిశగా సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
శూన్య ఉద్గార విడుదల లక్ష్యంగా పనిచేస్తున్న రెండు దేశాలు ఇంధన వినియోగ విధానంలో మార్పు తెచ్చి క్లీన్ ఎనర్జీ వినియోగం అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. భారతదేశం, ఆస్ట్రేలియా దేశ ఆర్థిక వ్యవస్థలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని గుర్తు చేసిన మంత్రులు నికర శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య, పెట్టుబడి రంగంలో మరింత సహకారంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రులు పేర్కొన్నారు.
భారత్ జీ-20 అధ్యక్ష పదవికి ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి ఫారెల్ పునరుద్ఘాటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పురోగతిని వేగవంతం చేయడం తో సహా బలమైన, స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రపంచ దేశాలకు జీ-20 మార్గదర్శకత్వం వహించాల్సిన అవసరం ఉందని మంత్రులు అన్నారు.
ఐపిఇఎఫ్ కు రెండు దేశాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్న మంత్రులు న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక రౌండ్ ఐపిఇఎఫ్ చర్చలు దీనికి నిదర్శనం అని అన్నారు. స్వచ్ఛ ఇంధన రంగానికి ప్రాధాన్యత ఇచ్చే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి,పటిష్ట సరఫరా వ్యవస్థ లాంటి అంశాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ఐపిఇఎఫ్ ద్వారా కలిసి పనిచేయడానికి అవకాశం కలుగుతుందని మంత్రులు పేర్కొన్నారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కేంద్రంగా బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ అభివృద్ధి సాధనకు కృషి జరగాలి అని రెండు దేశాల మంత్రులు పునరుద్ఘాటించారు. జెనీవాలో జరిగిన 12వ డబ్ల్యుటిఒ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. 2024 నాటికి డబ్ల్యుటిఒ విధులు మెరుగుపరచడానికి,2024 నాటికి పూర్తిగా పనిచేసే వివాద పరిష్కార వ్యవస్థలను కలిగి ఉండటానికి తమ సహకారం అందిస్తామని రెండు దేశాల మంత్రులు ప్రకటించారు. . 2024లో అబుదాబిలో జరగనున్న 13వ డబ్ల్యూటీవో మంత్రుల స్థాయి సమావేశంలో చురుగ్గా పాల్గోవాలని వారు అంగీకరించారు.
ఆస్ట్రేలియా, భారత్ ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు అని మంత్రులు పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యం 31 బిలియన్ డాలర్లు దాటింది. ఇరు దేశాల మధ్య అమలులో ఉన్న వాణిజ్య ఒప్పందాలు వల్ల వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని రెండు దేశాల మంత్రులు వ్యక్తం చేశారు.
***
(Release ID: 1906467)
Visitor Counter : 171