సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి సంగ్రహాలయను 2023 మార్చి 10 న సందర్శించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ న్యాయ ప్రతినిధులు
Posted On:
12 MAR 2023 2:22PM by PIB Hyderabad
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఒ) సభ్యదేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు / చైర్మన్లు 2023 మార్చి 10 న ప్రధానమంత్రి సంగ్రహాలయ ను సందర్శించారు. ప్రతినిధులకు ఎన్ఎంఎంఎల్ డైరెక్టర్ సంజీవ్ నందన్ సహాయ్ స్వాగతం పలికారు. ఈ బృందంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సుప్రీం పీపుల్స్ కోర్టు వైస్ ప్రెసిడెంట్ శ్రీ జిగాంగ్ గావో, రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ సుప్రీంకోర్టు చైర్మన్ శ్రీ అస్లాంబెక్ మెర్గాలియేవ్, కిర్గిజ్ రిపబ్లిక్ సుప్రీం కోర్టు చైర్మన్ శ్రీ జమీర్బెక్ బజార్బెకోవ్, రష్యన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వ్యాచెస్లావ్ ఎం.లెబెడెవ్, తజికిస్తాన్ రిపబ్లిక్ సుప్రీంకోర్టు చైర్మన్ శ్రీ షెర్ముహమ్మద్ షోహియోన్, బెలారస్ రిపబ్లిక్ సుప్రీంకోర్టు మొదటి డిప్యూటీ చైర్మన్ శ్రీ వాలెరీ కలింకోవిచ్ ఉన్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గత 75 సంవత్సరాల కాలంలో దేశ ప్రధానమంత్రులుగా పనిచేసిన వారు, దేశాభివృద్ధికి వారు అందించిన సహకారం, చేసిన కృషి గుర్తు చేసే విధంగా ప్రధానమంత్రి సంగ్రహాలయ ఏర్పాటయింది. దేశాభివృద్ధి కోసం సాగిన సమిష్టి కృషి, ప్రజాస్వామ్య భారతదేశం సాధించిన ప్రగతి, చరిత్రకు ప్రధానమంత్రి సంగ్రహాలయ సాక్ష్యంగా నిలుస్తుంది. దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారు సమాజంలోని అన్ని వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కృషి, పట్టుదల, అంకితభావంతో పనిచేసే వారందరికీ సమాన అవకాశాలు ఉంటాయని చరిత్ర చెబుతుంది. తెరిచే ఉన్నాయి. దేశ ప్రధానులు వివిధ సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొని దేశ సర్వతోముఖ ప్రగతికి ఎలా దోహదపడ్డారు అన్న అంశాన్ని సంగ్రహాలయం చెబుతుంది. దేశ విదేశాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ప్రధానమంత్రి సంగ్రహాలయ ను సందర్శిస్తున్నారు. ఇది ప్రారంభమైనప్పటి నుండి పెద్ద సంఖ్యలో భారతీయ మరియు విదేశీ ప్రముఖులు ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించారు
ప్రతినిధులకు ప్రధానమంత్రి సంగ్రహాలయ వివరాలను అధికారులు సవివరంగా వివరించారు. ప్రయోగాత్మక మండలం అనుభూతితో సహా సంగ్రహాలయంలో విలక్షణమైన ప్రదర్శనలను ప్రతినిధులు వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశం సాగిస్తున్న ప్రయాణాన్ని, దీనికి సహకరించిన ప్రధానమంత్రులను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఒ) సభ్యదేశాల ప్రతినిధులు అభినందించారు
***
(Release ID: 1906122)
Visitor Counter : 182