సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో ఈ నెల 12 నుండి 21 వరకు 'దివ్య కళా మేళా'
- భోపాల్ హాట్‌లో 10 రోజుల పాటు జరుగనున్న 'దివ్య కళా మేళా'
- ఈ మేళాలో దాదాపు 21 రాష్ట్రాలు/ కేంద్ర పాలితన ప్రాంతాల నుండి దాదాపు 150 మంది దివ్యాంగులైన కళాకారులు/ చేతివృత్తుల వారు, వ్యవస్థాపకులు తమ ప్రత్యేక ఉత్పత్తులు, నైపుణ్యాల ప్రదర్శన
प्रविष्टि तिथि:
11 MAR 2023 12:49PM by PIB Hyderabad
వికలాంగుల (దివ్యాంగుల) సాధికారత శాక దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులైన వ్యాపారవేత్తలు/ కళాకారుల ఉత్పత్తులు, నైపుణ్యాలను ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని.. 'దివ్య కళా మేళా' పేరుతో భూపాల్ నగరంలో నిర్వహించనుంది. 2023 మార్చి 12 నుండి 21 వరకు మధ్యప్రదేశ్లో భోపాల్ నగరంలోగత భోపాల్ హాత్లో ఈ మేళా పది రోజుల పాటు నిర్వహించబడుతుంది. జమ్మూ మరియు కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, హస్తకళలు, చేనేతలు, ఎంబ్రాయిడరీ వర్క్‌లు ప్యాకేజ్డ్ ఫుడ్ మొదలైన వాటితో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి శక్తివంతమైన ఉత్పత్తులు సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందించనున్నాయి. ఈ మేళాలో దాదాపు 21 రాష్ట్రాలు/ కేంద్ర పాలితన ప్రాంతాల నుండి దాదాపు 150 మంది దివ్యాంగులైన కళాకారులు/ చేతివృత్తుల వారు, వ్యవస్థాపకులు తమ ప్రత్యేక ఉత్పత్తులు, నైపుణ్యాల ప్రదర్శించనున్నారు.
కింది విస్తృత వర్గంలో ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయి: గృహాలంకరణ & జీవనశైలి, దుస్తులు, స్టేషనరీ మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, ప్యాక్ చేయబడిన ఆహారం, సేంద్రీయ ఉత్పత్తులు, బొమ్మలు & బహుమతులు, వ్యక్తిగత ఉపకరణాలు - ఆభరణాలు, క్లచ్ బ్యాగ్‌లు.
ఇది అందరికీ 'ఓకల్ ఫర్ లోకల్' చేసే అవకాశంగా నిలుస్తుంది. దివ్యాంగ్ హస్తకళాకారులు వారి మేటి సంకల్పంతో తయారు చేసిన ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో చూడవచ్చు/కొనుగోలు చేయవచ్చు. పది రోజుల ‘దివ్య కళా మేళా’ ఉదయం 11.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు తెరిచి ఉంటుంది. దివ్యాంగ్ కళాకారులు, సుప్రసిద్ధ నిపుణుల ప్రదర్శనలతో సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆహారాన్ని సందర్శకులు తమ ఇష్టం మేరకు ఆస్వాదించవచ్చు. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ గౌరవనీయ గవర్నర్ శ్రీ మంగు భాయ్ పటేల్ మార్చి 12వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి కుమారి ప్రతిమా భూమిక్ తదితరల సమక్షంలో గవర్నర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిపార్ట్మెంట్ ఈ కొత్త తరహా పద్దతిని ప్రోత్సహించడానికి మేటి ప్రణాళికలను కలిగి ఉంది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 'దివ్య కళా మేళా' నిర్వహించబడుతుంది. ఈ ప్రదర్శన అనేది ఢిల్లీ మరియు ముంబయికి మాత్రమే పరిమితం కాకుంటా దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది.
****
(रिलीज़ आईडी: 1906045)
आगंतुक पटल : 229