వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ఆహార సంస్థ 5వ వేలం ద్వారా 11.88 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటి) గోధుమలు విక్రయం

Posted On: 10 MAR 2023 4:30PM by PIB Hyderabad

గోధుమలు, ఆటా ధరలను నియంత్రించడానికి మార్కెట్ జోక్యం కోసం కేంద్ర ప్రభుత్వ చొరవలో భాగంగా, వరుస ఇ-వేలం కింద, మర్చి 9వ తేదీన భారత ఆహార సంస్థ 5వ ఇ-వేలం నిర్వహించింది.ఎఫ్సిఐ 23 ప్రాంతాలలో 657 డిపోల నుండి మొత్తం 11.88 ఎల్ఎంటిల గోధుమలు అమ్మకానికి పెట్టారు. 5.39 ఎల్ఎంటిల గోధుమలు 1248 బిడ్డర్లకు విక్రయించారు. 
5వ ఇ-వేలంలో, అఖిల భారత స్థాయి వెయిటెడ్ సగటు రిజర్వ్ ధర క్వింటాల్ రూ. 2140.28 కాగా, వెయిటెడ్ సగటు అమ్మకపు ధర క్వింటాల్ కి రూ. 2197.91 పలికింది. 

5వ ఇ వేలంలో 100 నుండి 499 మెట్రిక్ టన్నుల వరకు ఉన్న పరిమాణాలకు గరిష్ట డిమాండ్ ఉంది, తర్వాత 500-999 MT పరిమాణాలు తర్వాత 50-100 ఎంటి పరిమాణం బ్రాకెట్‌ను కలిగి ఉన్నాయి. 

మొదటి వేలం 2023 ఫిబ్రవరి 1,2వ తేదీల్లో నిర్వహించారు. దీనిలో 9.13 లక్షల మెట్రిక్‌టన్నుల 1016 మంది బిడ్డర్‌లకు వెయిటెడ్ సగటు ధర క్వింటాల్ రూ. 2474 పలికింది. 3.85 ఎల్ఎంటి పరిమాణాన్ని ఫిబ్రవరి 15న  జరిగిన రెండవ వేలంలో 1060 మంది బిడ్డర్‌లకు వెయిటెడ్ సగటు ధర క్వింటాల్ రూ. 2338కి విక్రయించారు. 5.07 ఎల్ఎంటి 875 బిడ్డర్లకు విక్రయించారు. 3వ ఇ-వేలంలో క్వింటాల్ ధర రూ. 2173, 5.40 ఎల్ఎంటి 4వ ఇ-వేలంలో 1049 విజయవంతమైన బిడ్డర్లకు క్వింటాల్ కు రూ. 2193.82కి విక్రయించారు. 

4వ ఇ-వేలం వరకు 23.47 ఎల్ఎంటి  గోధుమ నిల్వలను విక్రయించారు. మర్చి 8వ తేదీ నాటికి 19.51 ఎల్ఎంటి  లిఫ్ట్ చేశారు. 

5వ ఇ-వేలం తర్వాత, ఓఎంఎస్ఎస్(డి) కింద గోధుమల సంచిత అమ్మకాలు 45 ఎల్ఎంటి మొత్తం కేటాయింపుతో పోలిస్తే 28.86 ఎల్ఎంటి కి చేరుకున్నాయి.  ఓఎంఎస్ఎస్(డి)   కింద గోధుమల బహిరంగ విక్రయం కోసం భవిష్యత్తులో జరిగే టెండర్‌లతో స్థిరంగా ఉండే అవకాశం ఉన్న దేశం అంతటా గోధుమలు, ఆటా ధరలను తగ్గించడంలో ఈ విక్రయం గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

తదుపరి ఇ-వేలం మర్చి 15న నిర్వహిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి గోధుమ సేకరణ కాలం ప్రారంభం కానున్న దృష్ట్యా, ప్రభుత్వం మర్చి 31 నాటికి లిఫ్టింగ్ పూర్తి చేయడానికి అనుమతించింది.

 

 

***


(Release ID: 1905931) Visitor Counter : 159