సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్ఎంఈ కాంపిటిటీవ్ (లీన్) పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీ నారాయణ్ రాణే


- ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ స్కీమ్ కింద లీన్ పథకం ప్రారంభం

- లీన్ ఒక జాతీయ ఉద్యమంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉందిః మంత్రి

- దేశంలోని ఎంఎస్ఎంఈల ప్రపంచ పోటీతత్వానికి రోడ్‌మ్యాప్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది: శ్రీ రాణే

Posted On: 10 MAR 2023 2:55PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఎంఎస్ఎంఈ కాంపిటేటివ్ (లీన్) పథకాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ రాణే మాట్లాడుతూ, లీన్ ఒక జాతీయ ఉద్యమంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని ఎంఎస్ఎంఈల ప్రపంచ పోటీతత్వానికి రోడ్‌మ్యాప్ అందించడం దీని లక్ష్యం అన్నారు. లీన్ నాణ్యత, ఉత్పాదకత & పనితీరును మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా తయారీదారుల ఆలోచనలను మార్చడానికి మరియు వారిని ప్రపంచ స్థాయి తయారీదారులుగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం ఎంఎస్ఎంఈ లలో లీన్ తయారీ పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి, ఎంఎస్ఎంఈలను ఛాంపియన్‌లుగా మారడానికి వారికి తగిన ప్రోద్భలం అందించడానికి, లీన్ స్థాయిలను సాధించే దిశగా వారిని ప్రోత్సహించడానికి గాను ఇది విస్తృతమైన డ్రైవ్. ఈ పథకం కింద ఎంఎస్ఎంఈలు ప్రాథమిక, ఇంటర్మీడియట్ మరియు అడ్వాన్స్‌డ్ వంటి లీన్ స్థాయిలను సాధించడానికి శిక్షణ పొందిన మరియు సమర్థులైన లీన్ కన్సల్టెంట్‌ల సమర్థ మార్గదర్శకత్వంలో 5ఎస్, కైజెన్, కాన్బాన్, విజువల్ వర్క్‌ప్లేస్, పోకా యోకా వంటి లీన్ తయారీ సాధనాలను అమలు చేస్తాయి. లీన్ ప్రయాణం ద్వారా, ఎంఎస్ఎంఈలు వ్యర్థాలను గణనీయంగా తగ్గించగలవు. ఉత్పాదకతను పెంచుతాయి. నాణ్యతను మెరుగుపరుస్తాయి, సురక్షితంగా పని చేయవచ్చు. తమ మార్కెట్‌లను విస్తరించవచ్చు మరియు చివరకు పోటీగా మరియు లాభదాయకంగా మారతాయి. ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి, హ్యాండ్‌హోల్డింగ్ మరియు కన్సల్టెన్సీ ఫీజుల కోసం ప్రభుత్వం 90% అమలు ఖర్చును అందిస్తుంది. ఎస్.ఎఫ్.యు.ఆర్.టి.ఐ క్లస్టర్‌లలో భాగమైన, మహిళలు/ఎస్సీ/ఎస్టీ యాజమాన్యంలోని మరియు ఎన్ఈఆర్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు 5% అదనపు సహకారం ఉంటుంది. పైన పేర్కొన్న వాటికి అదనంగా, అన్ని స్థాయిలను పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీ అసోసియేషన్‌లు/ ఓవరాల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఓఈఎం) సంస్థల ద్వారా నమోదు చేసుకునే ఎంఎస్ఎంఈలకు 5% అదనపు సహకారం ఉంటుంది. ఈ పథకంలో పాల్గొనడానికి వారి సరఫరా గొలుసు విక్రేతలను ప్రేరేపించడానికి పరిశ్రమ సంఘాలు మరియు ఓఈఎంలను ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక లక్షణం ఇది కలిగి ఉంది.

***



(Release ID: 1905828) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Marathi , Hindi