విద్యుత్తు మంత్రిత్వ శాఖ

హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ మరియు మిగులు విద్యుత్ పోర్టల్ (PUShP)ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం


వేసవి కాలంలో తగినంత విద్యుత్ లభించేలా చూసేందుకు, పూర్తి స్థాయిలో సామర్థ్యం వినియోగం అయ్యేలా చూసేందుకు రూపొందించిన వ్యూహంలో భాగంగా PUShP కు రూపకల్పన ... కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్

అధిక ధరలు వసూలు చేయడానికి విద్యుత్ ఉత్పత్తి దారులకు అనుమతి లేదు .. శ్రీ ఆర్.కె. సింగ్

Posted On: 10 MAR 2023 10:01AM by PIB Hyderabad

పరిస్థితిని పర్యవేక్షించాలని సిఇఎ, గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లకు ఆదేశాలు జారీచేసిన శ్రీ సింగ్ హైదరాబాద్, మార్చి 10:  కేంద్ర ప్రభుత్వం హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ , సర్ ప్లస్ పవర్ పోర్టల్ (PUShP  )ని ప్రారంభించింది, విద్యుత్ వినియోగం  ఎక్కువగా ఉన్న కాలంలో ఎక్కువ విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం PUShP ని ప్రారంభించింది. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ నిన్న ఆవిష్కరించారు. రాష్ట్రాలు, విద్యుత్ రంగాలకు చెందిన  200 మందిపోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి  శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్, విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ అలోక్ కుమార్, సిఈఎ చైర్మన్  శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్, ఐఈఎక్స్ సీఎండీ శ్రీ ఎస్.ఎన్. గోయెల్,  ఈ కార్యక్రమంలో గ్రిడ్ ఇండియా సిఎండి శ్రీ ఎస్.ఆర్. నర్సింహన్‌తో పాటు పలువురు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

గత ఏడాది  కొన్ని రోజుల్లో విద్యుత్ ఎక్స్ఛేంజ్‌లో ధరలు రూ.20 వరకు పెరిగిన విషయాన్నివిద్యుత్ మంత్రిత్వ శాఖ గుర్తించింది. అనుచిత విధానాలకు పాల్పడి అక్రమ లాభాలు ఆర్జించకుండా చూడడానికి  ఎక్స్ఛేంజ్‌లో రూ.12 ధర పరిమితిని కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.  డే ఎహెడ్ మార్కెట్, రియల్ టిమ్‌లో 01.04.2022, మిగిలిన రంగాల్లో 06.05.2022  నుంచి రూ.12 ధర పరిమితి అమల్లోకి వచ్చింది.

 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొనుగోలుదారులు చెల్లించే  ధరను హేతుబద్ధం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు అధికంగా వల్ల  గ్యాస్ ఉపయోగించి తయారు చేసిన విద్యుత్ ధర యూనిట్ కు రూ.12 కు మించి ఉంటుంది. ఈ సామర్థ్యాన్ని మార్కెట్లో విక్రయించడానికి వీలుండదు.ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నందున దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల్లో నిల్వ చేసిన పునరుత్పాదక ఇంధనాన్నివినియోగం లోకి తీసుకు రావడానికి అవకాశం కలగలేదు. 

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యుత్తుకు డిమాండ్  ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు, దీనిని దృష్టిలో ఉంచుకుని  గ్యాస్ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలు, దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్లను షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 12 రూపాయలకు మించి విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఉండే గ్యాస్ / దిగుమతి చేసుకున్న బొగ్గు / ఆర్ఇ ప్లస్ నిల్వ ఉత్పత్తి వ్యవస్థ కోసం  ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విభాగాన్ని హెచ్ పీ డ్యాం అంటారు.

 

 వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడానికి అందుబాటులో ఉన్న విద్యుత్ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి రూపొందించిన  వ్యూహంలో భాగంగా హెచ్ పి-డ్యామ్ అభివృద్ధి చేశామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ తెలిపారు.

హెచ్ పి-డ్యామ్ పనితీరును వివరించిన శ్రీ సింగ్  అధిక రేట్లు వసూలు చేయడానికి ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.  యూనిట్ కు రూ.12 మించి  ఉత్పత్తి వ్యయం ఉండే    విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు  మాత్రమే హెచ్ పీ-డ్యామ్ లో పనిచేసేందుకు అనుమతిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఉత్పత్తి వ్యయం రూ.12 కంటే తక్కువగా ఉంటే సదరు ఉత్పత్తిదారులు పవర్ ఎక్స్ఛేంజ్ ఇంటిగ్రేటెడ్ డే ఎహెడ్ మార్కెట్ (ఐ-డామ్) లో గరిష్ట ధర రూ .12 తో మాత్రమే విద్యుత్ అందించాలి. హెచ్ పి-డ్యామ్ లో ధరలు సహేతుకంగా ఉండేలా చూడాలని, ఉత్పత్తి వ్యయం కంటే అధిక ధరలను విద్యుత్ ఉత్పత్తి దారులు వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిఇఎ, గ్రిడ్ కంట్రోలర్ ను ఆయన కోరారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ స్థిరమైన విద్యుత్ మార్కెట్ కలిగి ఉందని పేర్కొన్న మంత్రి గత ఏడాది ఉత్పత్తి వ్యయం కంటే విద్యుత్ టారిఫ్ పరిస్థితి చాలా ఎక్కువగా ఉందని  అన్నారు.

 విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ మాట్లాడుతూవిద్యుత్ లేకుండా జీవించే పరిస్థితిని ఎవరూ ఊహించడం కష్టమని  అన్నారు. కొత్త విధానం వల్ల తగినంత విద్యుత్ లభ్యత ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.కొత్త మార్కెట్ యంత్రాంగం వల్ల కలిగే ప్రయోజనాలను కార్యదర్శి  శ్రీ అలోక్ కుమార్ వివరించారు. కొన్ని నివేదికలు ప్రస్తావించిన  50 రూపాయల యూనిట్ ధర కేవలం సాంకేతిక పరిమితి మాత్రమేనని, మార్కెట్ శక్తులు తక్కువ రేటుకు విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తాయని స్పష్టం చేశారు.

మిగులు విద్యుత్ పోర్టల్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, నియంత్రణ సంస్థలు అమలు చేయనున్న వినూత్న వ్యవస్థగా ఉంటుంది.  విద్యుత్ సరఫరా కోసం సరఫరా సంస్థలు  దీర్ఘకాలిక పీపీఏలను కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం విద్యుత్ సరఫరా చేయని సంస్థలకు  ఫిక్స్ డ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నూతన విధానం వల్ల ఇప్పుడు డిస్కంలు తమ మిగులు విద్యుత్ ను బ్లాక్ టైమ్స్/ రోజులు/ నెలల్లో పోర్టల్ లో సూచించ కలుగుతాయి. విద్యుత్ అవసరమైన డిస్కంలు మిగులు విద్యుత్ ను పొందడానికి వీలవుతుంది. నియంత్రణ సంస్థలు  నిర్ణయించిన విధంగా కొత్త కొనుగోలుదారుడు వేరియబుల్ ఛార్జ్ (విసి),నిర్ణీత వ్యయం (ఎఫ్ సి) రెండింటినీ చెల్లిస్తాడు. ఒకసారి కేటాయింపు జరిగిన తర్వాత గతంలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు ఎటువంటి అధికారం ఉండదు.మొత్తం ఎఫ్ సీ  బాధ్యత కూడా కొత్త లబ్ధిదారునికి బదిలీ అవుతుంది. దీంతో అసలు లబ్ధిదారునికి రీకాల్ చేసే హక్కు ఉండదు. కొత్త కొనుగోలుదారు  ఆర్థిక బాధ్యత తాత్కాలికంగా కేటాయించిన/ బదిలీ చేయబడిన అధికార పరిమాణానికి పరిమితం అవుతుంది.  దీనివల్ల డిస్కంలపై నిర్ణీత వ్యయభారం తగ్గడంతో పాటు అందుబాటులో ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వీలవుతుంది.

 



(Release ID: 1905685) Visitor Counter : 157