రక్షణ మంత్రిత్వ శాఖ
గుజరాత్ తీరంలో ముంపుకు గురవుతున్న మత్స్యకారుల పడవ నుంచి ఆరుగురు మత్స్యకారులను కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్
Posted On:
07 MAR 2023 6:39PM by PIB Hyderabad
అరేబియా సముద్రం గుజరాత్ తీరంలో మునిగిపోతున్న మత్స్యకారుల పడవ నుంచి ఆరుగురు మత్స్యకారులను భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసిజి) ఓడ ఆరుష్ 7 మార్చి 2023న కాపాడింది.
ఆరేబియా సముద్రంలో మోహరించి ఉన్న ఓడకు తెల్లవారుజామున గుజరాత్ తీరానికి దాదాపు 80 కిమీల దూరంలో భారతీయ మత్స్యకారుల పడవ హిమలే నుంచి అనియంత్రిత వరదలకు సంబంధించి విపత్తు కాల్ వచ్చింది. వెంటనే ఓడ విపత్తులో ఉన్న పడవ దిశగా వెళ్ళి, పడవ మునకను నియంత్రించే ముందు సిబ్బందిని కాపాడింది. తర్వాత పడవకు మరమత్తులు చేసి దానిని తిరిగి సిబ్బందికి అప్పగించింది.
***
(Release ID: 1905053)
Visitor Counter : 139