నీతి ఆయోగ్
నీతి ఆయోగ్ మరియు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ స్వతంత్ర మూల్యాంకన అంచనా విభాగం (IED) నీటి భద్రతను పటిష్టం చేయడం మరియు నష్టాలను తగ్గించే మార్గాలపై బ్రిడ్జ్ ఓవర్ ట్రబుల్డ్ వాటర్స్ పేరుతో ప్యానెల్ చర్చను నిర్వహించాయి
प्रविष्टि तिथि:
06 MAR 2023 6:03PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ స్వతంత్ర మూల్యాంకన అంచనా విభాగం( IED) సహకారంతో నీటి భద్రతను పటిష్టం చేయడం మరియు నష్టాలను తగ్గించే మార్గాలపై బ్రిడ్జ్ ఓవర్ ట్రబుల్డ్ వాటర్స్ పేరుతో ఒక ప్యానెల్ చర్చను నిర్వహించింది.
ఈ సమావేశానికి నీతి ఆయోగ్ వైస్ చైర్ శ్రీ సుమన్ బేరీ అధ్యక్షత వహించారు. ప్యానెల్ చర్చను ఐ ఈ డీ (IED) డైరెక్టర్ జనరల్ శ్రీ ఇమ్మాన్యుయేల్ జిమెనెజ్ మోడరేట్ చేసారు మరియు ముగింపు వ్యాఖ్యలను డెవలప్‌మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (DMEO) డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ కుమార్ అందించారు. నీటి రంగంలో ఏ డీ బీ (ADB) ఆధ్వర్యంలో ఐ ఈ డీ ఇటీవల ప్రచురించిన మూల్యాంకన నివేదిక నుండి నేర్చుకున్న పాఠాలపై చర్చ జరిగింది.
***
(रिलीज़ आईडी: 1904766)
आगंतुक पटल : 200