ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ఎన్ డిఎ పాలన లో ఉన్న 14 రాష్ట్రాల లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల లో నిరంతరం గాఏర్పాటు అవుతున్న ఉద్యోగ మేళాలు’’

‘‘సాంకేతిక విజ్ఞానం సహాయం తో భర్తీ ప్రక్రియ అంతటినీ పారదర్శకం గారూపొందిందచడమైంది;  దీని కోసం అనేకమైన డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లను, మొబైల్ ఏప్స్ ను మరియు వెబ్ పోర్టల్స్ను అభివృద్ధి పరచడమైంది’

‘‘గుజరాత్ లో గడచిన అయిదేళ్ళ లో ఒకటిన్నర లక్షల మంది కి పైగా యువతీ యువకులురాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ను దక్కించుకొన్నారు.’’

‘‘అభివృద్ధి తాలూకు చక్రాలు కదులుతూ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క రంగం లో ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి’’

‘‘భారతదేశం రాబోయే కాలం లో అతి పెద్ద తయారీ కేంద్రం గా అవుతుందనిప్రపంచవ్యాప్తం గా గల నిపుణులు నమ్ముతున్నారు’’

‘‘ప్రభుత్వం అవలంబిస్తున్న సంపూర్ణ అభివృద్ధి వైఖరి పెద్ద ఎత్తున ఉద్యోగాల నుకల్పిస్తున్నది’’

‘‘యువత లో నైపుణ్యాల ను అభివృద్ధి పరచడాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది’’

‘‘కర్మయోగి భారత్ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లో లభిస్తున్న వివిధ ఆన్ లైన్కోర్సు ల నుండి సాధ్యమైనంత అధిక ప్రయోజనాల ను పొందండి’’

Posted On: 06 MAR 2023 4:33PM by PIB Hyderabad

గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యం లో జరిగిన రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం మాధ్యం ద్వారా ఈ రోజు న ప్రసంగించారు.

 

జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం హోలీ పండుగ దగ్గర పడింది మరి గుజరాత్ రోజ్ గార్ మేళా యొక్క నిర్వహణ నియామక లేఖల ను అందుకొనే వారి సంబురాల ను రెండింతలు చేసివేస్తుంది అన్నారు. రోజ్ గార్ మేళా గుజరాత్ లో జరుగుతూ ఉండటం ఇది రెండోసారి అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, యువతీ యువకుల కు నిరంతర అవకాశాల కల్పన కు, మరి దేశం అభివృద్ధి లో వారి యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం లో ప్రభుత్వం యొక్క నిబద్ధత ను గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం లో మరియు ఎన్ డిఎ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల లో అన్ని విభాగాలు గరిష్ఠ సంఖ్య లో ఉద్యోగాల ను ఇవ్వడం కోసం నిరంతరాయం గా శ్రమిస్తున్నాయంటూ ప్రధాన మంత్రి ప్రసన్నత ను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాని కి తోడు, ఎన్ డిఎ అధికారం లో ఉన్న 14 రాష్ట్రాల లో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో ఉద్యోగ మేళాలు క్రమం తప్పక జరుగుతూ ఉన్నాయి అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. కొత్త బాధ్యత ను భుజాని కి ఎత్తుకొంటున్న యువత అమృత కాలంలోని సంకల్పాల ను నెరవేర్చే దిశ లో పూర్తి సమర్పణ భావం తోను, నిష్ట తోను దోహదపడతారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

గడచిన 5 సంవత్సరాల లో ఉపాధి కల్పన కేంద్రం ద్వారా వివిధ రంగాల లో కొలువుల ను పొందిన 18 లక్షల మంది యువతీ యువకుల కు తోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ను సంపాదించిన యువతీ యువకుల సంఖ్య 1.5 లక్షల కు పైబడింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం ఒక రిక్రూట్ మెంట్ కేలండర్ ను తయారు చేసి, నిర్ణీత కాలం లోపల నియామక ప్రక్రియ ను ముగించింది అని కూడా ఆయన చెప్పారు. ఈ సంవత్సరం లో రాష్ట్ర ప్రభుత్వం లో 25 వేల మంది కి పైగా యువతీ యువకుల కు నౌకరీలను ఇచ్చేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి అని ప్రధాన మంత్రి చెప్తూ, యావత్తు నియామక ప్రక్రియ ను సాంకేతిక విజ్ఞానం సహాయం తీసుకొని పారదర్శకం గా మలచడమైందన్నారు. దీని లో భాగం గా వేరు వేరు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ స్, మొబైల్ ఏప్స్, ఇంకా వెబ్ పోర్టల్స్ ను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు.

 

యువత కోసం కొత్త అవకాశాల ను ఇవ్వడం లో ప్రస్తుత ప్రభుత్వం యొక్క ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టులు, అభివృద్ధి సంబంధి ప్రాజెక్టుల ద్వారా ను, తయారీ ని ప్రోత్సహించడం ద్వారా ను దేశం లో స్వతంత్రోపాధి కల్పన కు సరి అయినటువంటి వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా ను ప్రత్యక్ష ఉపాధి కల్పన మరియు పరోక్ష ఉపాధి కల్పన లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాన్ని అవలంభించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఉద్యోగాల స్వభావం లో చోటు చేసుకొంటున్న మార్పుల కు అనుగుణం గా యువతీ యువకుల కు పూచీకత్తు తో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించడం తో పాటు, నైపుణ్యాభివృద్ధి మీద కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని ఆయన వెల్లడించారు.

 

‘‘ఎప్పుడైతే అభివృద్ధి తాలూకు చక్రాలు కదులుతూ ఉన్నాయో, అప్పుడు ప్రతి రంగం లో ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాలు, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం లతో పాటు దేశం లోని ఇతర రంగాల లో ప్రాజెక్టుల అభివృద్ధి కై లక్షల కొద్దీ రూపాయల ను వెచ్చించడం జరుగుతోంది అని ఆయన నొక్కి చెప్పారు. ఒక గుజరాత్ లోనే ప్రస్తుతం 1.25 లక్షల కోట్ల రూపాయలు విలువైన పథకాలు అమలవుతున్నాయి, అంతేకాదు ఈ సంవత్సరం బడ్జెటు లో మౌలిక సదుపాయాల కు గాను 10 లక్షల కోట్ల రూపాయల ను ఇవ్వాలని ప్రతిపాదించడమైందని ఆయన తెలిపారు.

 

‘‘రాబోయే కాలం లో భారతదేశం అతి పెద్ద తయారీ కేంద్రం గా అవుతుంది అని ప్రపంచం అంతటా ఉన్నటువంటి నిపుణులు నమ్ముతున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ఈ విధమైన క్రాంతి కి నాయకత్వం వహించేది యువతే అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ లోని దాహోద్ లో ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో రైల్ వే ఎన్ జిన్ ఫ్యాక్టరీ ని నిర్మించడం జరుగుతోంది, సమీప భవిష్యత్తు లో ఈ ప్రాంతం సెమికండక్టర్ లకు ఒక పెద్ద కేంద్రం కూడా కాబోతోంది అని ఆయన వివరించారు.

 

‘‘ ఎత్తున ఉపాధి ని కల్పించాలి అనేది ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంబంధి సమగ్ర వైఖరి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. స్టార్ట్-అప్స్ కు ప్రోత్సాహాన్ని అందించేటటువంటి ఒక ఇకోసిస్టమ్ ను రూపొందించేందుకు విధాన కల్పన స్థాయి లో ముఖ్యమైన మార్పులు జరిగాయి అని ఆయన అన్నారు. దేశం లో ప్రస్తుతం తొంభై వేల కు పైగా స్టార్ట్-అప్స్ ఉన్నాయి అని ఆయన తెలిపారు. వీటి ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన సంభవిస్తోంది. అంతేకాకుండా, లక్షల కొద్దీ యువతీ యువకుల కు స్వతంత్రోపాధి దిశ లో ప్రేరణ లభిస్తున్నది అని ఆయన వివరించారు. ‘‘బ్యాంకు పూచీకత్తు లేకుండానే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ఆయన ముద్ర యోజన గురించి మరియు స్టాండ్ అప్ ఇండియా పథకాన్ని గురించి తెలియ జేశారు. స్వయం సహాయ సమూహం లో చేరడం ద్వారా మహిళ లు వారి కాళ్ళ మీద వారు దృఢం గా నిలబడగలుగుతున్నారు అని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం వైపు నుండి వందల కోట్ల కొద్దీ రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతోందన్నారు.

 

దేశం లోని కొత్త అవకాశాల కోసం నైపుణ్యం కలిగినటువంటి శ్రమశక్తి ని పెద్ద ఎత్తున తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి అంటూ, భారతదేశాని కి ప్రపంచం లో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యే సంభావ్యత ఉందన్నారు. నైపుణ్య అభివృద్ధి ద్వారా సమాజం లోని ప్రతి ఒక్క వర్గం లాభపడాలి అనేదే ప్రభుత్వం యొక్క ప్రయాస గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రతి ప్రాంతం లో దళితుల కు, ఆదరణ కు నోచుకోకుండా మిగిలిపోయినటువంటి వర్గాల కు, ఆదివాసీల కు మరియు మహిళల కు సమానమైన అవకాశాన్ని కల్పిస్తోంది అని ఆయన అన్నారు. ‘‘యువత లో నైపుణ్యాభివృద్ధి కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ కౌశల్ వికాస్ యోజన లో భాగం గా 30 స్కిల్ ఇండియా ఇంటర్ నేశనల్ సెంటర్స్ ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సెంటర్స్ లో యువత కు నవతరం సాంకేతిక విజ్ఞానం ద్వారా శిక్షణ ను ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి వివరించారు. చిన్న చేతివృత్తి కళాకారుల కు శిక్షణ ను ఇచ్చే పిఎమ్ విశ్వకర్మ యోజన ను గురించి ఆయన మాట్లాడుతూ, దీని ద్వారా చిన్న వ్యాపారాల తో అనుబంధం కలిగిన వ్యక్తులు ప్రపంచ బజారు లోకి అడుగిడే విధం గా ఒక ప్రధానమైన ద్వారాన్ని వారి కి అందించడం జరుగుతుంది అని వివరించారు. కొలువుల స్వభావం మారుతూ ఉన్నందువల్ల తదనుగుణం గా యువత ను నిరంతరం సన్నద్ధం చేయడం లో పారిశ్రామిక శిక్షణ సంస్థల పాత్ర గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఐటిఐ ల సంఖ్య నిలకడ గా పెరుగుతున్నది, గుజరాత్ లో ఐటిఐ లలో సీట్ లు అధికం అవుతున్నాయి అని పేర్కొన్నారు. ‘‘గుజరాత్ లో సుమారు 600 ఐటిఐ లలో దాదాపుగా 2 లక్షల సీటు లు ఉన్నాయి. వాటిలో వేరు వేరు నైపుణ్యాల కు గాను శిక్షణ ను అందించడం జరుగుతోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ లో ఐటిఐ ల ఏర్పాటు ఎంతో బాగుంది అని అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ఉద్యోగ కల్పన కు సంబంధించిన ప్రతి అవకాశాన్ని అభివృద్ధి పరచడం పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని, అదే స్వాతంత్య్రం అనంతరం అయితే దశాబ్దాల పాటు ఈ విషయాన్ని చిన్నచూపు చూడడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. కేవడియా-ఆటా నగర్ లో యూనిటీ మాల్ మాదిరి గా ప్రతి రాష్ట్రం లో ఒక యూనిటీ మాల్ ను మరియు 50 కొత్త పర్యాటక కేంద్రా లను అభివృద్ధి చేయడం జరుతుంది అని బడ్జెటు లో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. దేశం అంతటా తయారు అవుతున్న విశిష్ట ఉత్పాదనల ను ఈ మాల్ ల ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఏకలవ్య పాఠశాల ల్లో దాదాపు గా 40 వేల మంది ఉపాధ్యాయుల ను నియమించడం కోసం ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అని ఆయన వివరించారు.

 

 

ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అనేది యువత కు ఏకైక లక్ష్యం అయినప్పుడు వారి వ్యక్తిత్వ అభివృద్ధి ఆగిపోతుంది అని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు సందర్భం లో హెచ్చరించారు. కఠోర శ్రమ మరియు సమర్పణ భావం.. ఇవి వారి ని ఇక్కడ కు తీసుకు వచ్చాయి. ఏదైనా కొత్త దానిని నేర్చుకొందాము అనేటటువంటి కోరిక వారి ని వారి జీవన పర్యంతం ముందుకు సాగిపోయేటట్లు గా తోడ్పడుతుంది అని ఆయన నొక్కి చెప్పారు. కర్మయోగి భారత్ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లో ఉన్న వేరు వేరు ఆన్ లైన్ కోర్సుల ను చాలా వరకు సద్వినియోగ పరచుకోవలసింది గా యువత కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘మీకు ఉద్యోగం ఎక్కడ లభించినప్పటి కీ, మీ యొక్క నైపుణ్యాని కి మెరుగులు పెట్టుకోవడం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ను వహించండి. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మరింత మెరుగైన శిక్షణ ను అందుకొంటూ ఉండాలి అనేదే మా యొక్క ప్రభుత్వం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

***

DS/TS

 

 



(Release ID: 1904724) Visitor Counter : 127