వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కేంద్ర వ్యవసాయ & రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తున్న సంస్థ స్మాల్ ఫార్మర్స్ అగ్రి- బిజినెస్ కన్సోర్షియం చేపడుతున్న ప్రత్యేక మార్కెటింగ్ ప్రచారం మిలెట్స్ గివ్ అవే
# ఐవైఎం2023తో ఈ ఏడాది చిరుధాన్యాలపై దృష్టి పెట్టి, మరింతమంది ప్రజలు #శ్రీ అన్నాన్ని స్వీకరించేందుకు ప్రజలకు ఈ ప్రచారం ప్రేరణను ఇస్తుందిః డాక్టర్ మనీందర్ కౌర్ ద్వివేది
Posted On:
05 MAR 2023 3:11PM by PIB Hyderabad
భారత వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తున్న స్మాల్ ఫార్మర్స్ అగ్రి- బిజినెస్ కన్సోర్షియం (చిన్నరైతుల వ్యవసాయ వాణిజ్య సహవ్యవస్థ) చేపట్టిన ప్రత్యేక ప్రచారమే మిల్లెట్స్ గివ్ అవే ( చిరుదాన్యాల పంపిణీ). ఈ ప్రచారం దేశంలోని చిన్న & సన్నకారు రైతులకు మద్దతునిచ్చే లక్ష్యంతో ఎఫ్‌పిఒ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) రైతుల నుంచి నేరుగా కొనడాన్ని ప్రోత్సహించడం లక్ష్యం.
భారతీయ అమ్మకందారుల కోసం భారతదేశంలో నిర్మించిన అనుసంధానమైన మార్కెట్ ప్లేస్ ఒఎన్‌డిసికి చెందిన మైస్టోర్ ద్వారా ఎఫ్‌పిఒల నుండి చిరుధాన్యాలను నేరుగా కొనుగోలు పౌరులను ప్రోత్సహిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ& రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్మాల్ ఫార్మర్స్ అగ్రి- బిజినెస్ కన్సోర్షియం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనీందర్ కౌర్ ద్వివేది వెల్లడించారు. గివ్అవే ప్రచారం మూడు ప్రధాన అంశాలకు మద్దతునిస్తుంది.
ఎఫ్‌పిఒ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయవలసిందిగా సాధారణ ప్రజలకు ప్రేరణను ఇస్తుంది. కొనుగోలుదారులకు స్వచ్ఛమైన, నమ్మకమైన ఉత్పత్తి చేతికి అందుతుంది. వారి కొనుగోలు ద్వారా వారు చిన్న& సన్నకారు రైతుల జీవనోపాధులకు తోడ్పాటునిస్తారు.
ఒఎన్‌డిసికి చెందిన మైస్టోర్ ప్లాట్‌ఫాంను ఉపయోగించడం సులువనే అనుభవం కొనుగోలుదారులకు వస్తుంది.
#ఐవైఎం 2023 (అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం)కి చిరుధాన్యాలు కేంద్రంగా ఉండటంతో, ఈ ప్రచారం మరింతమంది వ్యక్తులు #శ్రీ అన్నాన్ని స్వీకరించేందుకు ప్రేరణను ఇస్తుంది.
మార్చి 2, 2021న స్థాపించిన హుల్సూర్ మహిళా కిసాన్ మిల్లెట్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గురించి మాట్లాడుతూ, రైతులకు సేవలను, మద్దతు అందిస్తూ పంట సాగు, ఉద్యానవనాల పెంపకంలో అది నిమగ్నమై ఉందని డాక్టర్ కౌర్ తెలిపారు. ఎఫ్‌పిఒ ఫలితంగా కర్నాటకలోని హుల్సూర్ బ్లాక్‌లోని రైతుల జీవనశైలిలో దీర్ఘకాలిక మార్పు వచ్చింది.
ఎఫ్‌పిఒలో చేరక ముందు రైతులు వివిధ పంటలకు చెందిన సంప్రదాయ రకాలను సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తూ సాగు చేసేవారు. రైతుల పంట పోర్ట్‌ఫోలియోకు కొత్త పంటగా చిరుధాన్యాలను జతపరచింది. ఇటీవలే ఎఫ్‌పిఒ స్వంత ఇన్‌పుట్ షాప్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ సభ్యులు అధిక నాణ్యత కలిగిన విత్తనాలు, ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
వ్యవసాయ యంత్రాలను, పరికరాలను అద్దెకు తీసుకునేందుకు ఎఫ్‌పిఒకు కస్టమ్ హైరింగ్ సెంటర్ ఉంది.
ఎఫ్‌పిఒ రైతులకు పంట సాగు పద్ధతులు, మంచి వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించి చూపడంతో, సగటు పంట ఉత్పత్తి 30-50% పెరిగింది.
***
(Release ID: 1904465)
Visitor Counter : 209