ప్రధాన మంత్రి కార్యాలయం

పంజిమ్ నుండి వాస్కో కు మధ్య ఏర్పడిన సంధానం ప్రజల కు ఊరట ను ఇస్తుంది;దానితో పాటే పర్యటన కు ప్రోత్సాహం కూడా లభిస్తుంది: ప్రధానమంత్రి


Posted On: 05 MAR 2023 9:42AM by PIB Hyderabad

జాతీయ జలమార్గం-68 నిర్మాణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మార్గం నిర్మాణం ద్వారా గోవా లో పంజిమ్ నుండి వాస్కో కు మధ్య దూరం 9 కిలోమీటర్ లు తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ యాత్ర ఇప్పుడు 20 నిమిషాల లోనే పూర్తి చేసుకొనే వీలు ఏర్పడింది. ఇంతకు ముందు పంజిమ్ నుండి వాస్కో కు దూరం సుమారు గా 32 కిలోమీటర్ లు ఉండేది, మరి ఈ యాత్ర ను పూర్తి చేయాలి అంటే దాదాపు గా 45 నిమిషాల సమయం పట్టేది.

 

దీనివల్ల పంజిమ్ నుంచి వాస్కో మధ్య 9 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని, కేవలం 20 నిమిషాల సమయం లో ప్రయాణించవచ్చని తెలిపారు. గతంలో పంజిమ్ వాస్కో మధ్య దూరం సుమారు 32 కిలోమీటర్లు ఉండేదని ప్రయాణ సమయం సుమారు 45 నిమిసాలు పట్టేదని తెలిపారు.

 

నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాలు, పర్యటన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ వై. నాయక్ చేసిన ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ గోవా లో పంజిమ్ నుండి వాస్కో కు మధ్య ఈ సంధానం ప్రజల కు ఉపశమనాన్ని ఇస్తుందని, దానితో పాటు పర్యటన రంగాని కి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.

ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -

‘‘పంజిమ్ నుండి వాస్కో కు మధ్య ఏర్పడ్డ ఈ సంధానం ద్వారా ప్రజల కు ఊరట లభించడం తో పాటు గా పర్యటన కు కూడాను ప్రోత్సాహం లభిస్తుంది’’ అని పేర్కొన్నారు.

 

 

पंजिम से वास्को के बीच इस कनेक्टिविटी से लोगों को राहत मिलने के साथ-साथ पर्यटन को भी बढ़ावा मिलेगा। https://t.co/poBGPk2cN8

— Narendra Modi (@narendramodi) March 5, 2023

*****

DS/ST

 



(Release ID: 1904372) Visitor Counter : 166