ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి చేయడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘బడ్జెటు లో నిర్దేశించుకున్న లక్ష్యాల ను సాధించడం లో ఈ వెబినార్ లు ఒక ఉత్ప్రేరకం గా పని చేస్తాయి’’

‘‘పర్యటన రంగం లో ఉన్నత శిఖరాల ను చేరుకోవాలి అంటే గనక మనం వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందస్తు ప్రణాళిక ను సిద్ధం చేసుకోవాలి’’

‘‘టూరిజమ్ అనేది సంపన్నుల కు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక స్వైరభావం కాదు’’

‘‘ఈ సంవత్సరం బడ్జెటు పర్యటక స్థలాల సంపూర్ణ అభివృద్ధి పట్ల శ్రద్ధ వహిస్తున్నది ’’

‘‘సౌకర్యాల ను పెంచడం తో కాశీ విశ్వనాథ్, కేదార్ ధామ్, పావాగఢ్ లలో భక్త జనుల రాక ఎన్నో రెట్లు అధికం అయింది’’

‘‘ప్రతి ఒక్క పర్యటక స్థలం తనకంటూ ఒక రాబడి నమూనా ను తయారు చేసుకోవచ్చును’’

‘‘మన పల్లెల లో మౌలిక సదుపాయాలు మెరుగు పడుతూ ఉన్న కారణం గా అవి పర్యటక కేంద్రాలు గా మారుతున్నాయి’’

‘‘కిందటి ఏడాది జనవరి లో భారతదేశాని కి తరలి వచ్చిన విదేశీ యాత్రికుల సంఖ్య 2 లక్షలు మాత్రమే ఉండగా ఈ సంవత్సరం జనవరి లో ఆ సంఖ్య కాస్తా 8 లక్షల కు చేరింది’’

‘‘అధికం గా ఖర్చు పెట్టే యాత్రికుల కు సైతం అందజేయడానికి గాను భారతదేశం వద్ద అనేకమైన అంశాలు ఉన్నాయి’’

‘‘‘దేశం లో వ్యవసాయం, స్థిరాస్తి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు మరియు వస్త్ర రంగాల వలెనే పర్యటన రంగం లో కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి’’

Posted On: 03 MAR 2023 11:52AM by PIB Hyderabad

‘‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి పరచడం’’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఏడో వెబినార్ గా ఉంది.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం ‘న్యూ ఇండియా’ ఒక నవీన శ్రమ సంస్కృతి లో ముందంజ వేస్తోందన్నారు. ఈ సంవత్సరం బడ్జెటు పై భారతదేశం యొక్క ప్రజానీకం వ్యక్తం చేసిన ప్రశంసల పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇది వరకటి శ్రమ సంస్కృతి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అదే కొనసాగివుండి ఉంటే గనక ఈ తరహా లో బడ్జెటు కు ముందు, బడ్జెటు సమర్పణ తరువాత బడ్జెటు తో అనుబంధం ఉన్న వర్గాల తో చర్చించాలని ప్రస్తుత ప్రభుత్వం చేసినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన ప్రసక్తే ఉండేది కాదు అన్నారు. ఈ వెబినార్ ల ప్రధాన ఉద్దేశ్యం బడ్జెటు యొక్క ఫలితాలు వీలైనంత ఎక్కువ గా ఉండేటట్లు గా చూడటం తో పాటు గా బడ్జెటు ప్రతిపాదనల ను అనుకున్న కాలం లోపల అమలు పరచాలి అనేది కూడా ను అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ వెబినార్ లు బడ్జెటు లో నిర్దేశించుకొన్నటువంటి లక్ష్యాల ను సాధించడం లో ఒక ఉత్ప్రేరకం గా పని చేస్తాయి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 20 సంవత్సరాల కు పైబడి ప్రభుత్వ అధినేత గా పాటుపడుతున్న అనుభవం తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొనే ఏ వ్యూహాత్మక నిర్ణయాలతో అయినా వాటితో అనుబంధం కలిగిన వర్గాలు అన్నీ కూడా ఒకే తాటి మీద కు వచ్చి పనిచేసినట్లయితే గనక ఆశించిన ఫలితాల ను అనుకున్న కాలం లోపల సాధించవచ్చును అని ఉద్ఘాటించారు. ఇంతవరకు జరిగిన బడ్జెటు అనంతర వెబినార్ ల ద్వారా అందిన సూచన లు సలహా ల పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భారతదేశం లో పర్యటన రంగాన్ని వినూత్న శిఖరాల కు తీసుకొని పోవడాని కి మూస ధోరణి కి భిన్నం గా ఆలోచనలు చేస్తూ, ముందస్తు గా ప్రణాళిక సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పర్యటక స్థలాల ను అభివృద్ధి పరచే కంటే ముందు తీసుకోవలసిన జాగ్రతచర్యల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆ ప్రదేశం లోని అవకాశాలు ఎలా ఉన్నాయి?, ఆ ప్రదేశాని కి ఎంత సులభం గా చేరుకోవచ్చు? అనే అంశాల తో పాటు గా ఆ ప్రదేశాన్ని గురించి పలువురికి తెలిసే విధం గా ఏయే కొత్త మార్గాల ను అనుసరించాలి? అనేటటువంటి విషయాల ను గురించి ప్రస్తావించారు. ఈ మాటల ను తాను తెలియ జేయడం లోని ముఖ్యోద్దేశ్యం ఏమిటి అంటే, అది భవిష్యత్తు కాలాని కి ఒక మార్గసూచీ ని సిద్ధం చేయడం లో సహాయకారి అవుతుందన్నదే అని కూడా ఆయన అన్నారు. దేశం లో పర్యటన రంగాని కి ఉన్న భారీ అవకాశాల ను ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, కోస్తా తీర ప్రాంతాల లో పర్యటన, సముద్రం ఒడ్డుల లో పర్యటన, మడ అడవుల లో పర్యటన, హిమాలయ ప్రాంతాల లో పర్యటన, సాహస యాత్ర ప్రధానమైనటువంటి పర్యటన, వన్యప్రాణి సందర్శన ప్రధానం గా ఉండేటటువంటి పర్యటన, ఇకో-టూరిజమ్, వారసత్వ పర్యటక ప్రదేశాల లో పర్యటించడం, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన, పరిణయ ప్రధానమైన పర్యటక స్థలాల ను సందర్శన, సమావేశాల మాధ్యం ద్వారా పర్యటకానుభూతి ని పొందడం మరియు క్రీడా ప్రధానమైన పర్యటనల వంటి వాటి ని గురించి పేర్కొన్నారు. రామాయణ్ సర్ కిట్, బుద్ధ సర్ కిట్, కృష్ణ సర్ కిట్, నార్థ్ ఈస్టర్న్ సర్ కిట్, గాంధీ సర్ కిట్ లతో పాటు గురువు ల పరంపర లో ఏర్పడ్డ తీర్థక్షేత్రాల ను గురించి సైతం ఆయన ఉదాహరణలు గా పేర్కొంటూ వీటన్నింటి విషయం లో సామూహికం గా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సంవత్సరం బడ్జెటు లో స్పర్థాత్మకమైన భావన తోను మరియు చాలింజ్ రూట్ లోను భారతదేశం లో కొన్ని పర్యటక ప్రదేశాల ను అభివృద్ధిపరచాలని గుర్తించడం జరిగిందన్నారు. ఈ చాలింజ్ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ తోకలసి ప్రయాస చేసేందుకు ప్రేరణ ను అందిస్తుందన్నారు. దీనికోసం, వేరు వేరు స్టేక్ హోల్డర్స్ ను మనం ఏ విధం గా నిమగ్నం చేయవచ్చో అనే అంశం పై సమగ్రమైన చర్చ ను చేపట్టాలి అని శ్రీ నరంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

టూరిజమ్ అంటే అది దేశం లో అధిక ఆదాయ సమూహాల తో మాత్రమే ముడిపడినటువంటిది అనే ఒక స్వైరభావం అనే కల్పన ను ప్రధాన మంత్రి తోసి పుచ్చారు. యాత్ర లు అనేవి కొన్ని వందల ఏళ్ళు గా భారతదేశం లో సాంస్కృతిక మరియు సామాజిక జీవనం లో ఒక భాగం గా ఉంటున్నాయి. ప్రజలు వారి వద్ద ఎటువంటి తాహతు లేకపోయినా తీర్థయాత్రల కు బయలుదేరే వారు అని ఆయన అన్నారు. చార్ ధామ్ యాత్ర, ను, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర ను,, 51 శక్తిపీఠాల యాత్ర ను ఉదాహరణలు గా ఆయన చెప్తూ, అవి మన ధార్మిక స్థలాల తో కలుపుతూ నే దేశం లో ఏకత్వ భావన ను కూడా బలపరచేవని తెలిపారు. దేశం లో ఎన్నో పెద్ద నగరాల లో యావత్తు ఆర్థిక వ్యవస్థ ఈ యాత్రల పై ఆధారపడిందని ప్రధాన మంత్రి అన్నారు. యాత్రల ను సాగించే సంప్రదాయం ఏళ్ల నుండి ఉన్నప్పటికీ కూడా ను ఆయా ప్రాంతాల లో కాలానుగుణం గా సౌకర్యాల ను పెంచడం పట్ల శ్రద్ధ లోపించడం శోచనీయం అని ప్రధాన మంత్రి అన్నారు. వందల ఏళ్ళ తరబడి బానిసత్వం మరియు స్వాతంత్య్రం అనంతర కాలం లో దశాబ్దాల పాటు ఈ ప్రదేశాల ను రాజకీయం గా ఉపేక్షించడం వంటివి దేశాని కి చాలా నష్టం వాటిల్లడానికి ప్రధాన కారణాలు గా ఉన్నాయని ఆయన అన్నారు. ‘‘ఈనాటి భారతదేశం ఈ పరిస్థితి ని మార్చుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సదుపాయాల ను పెంచడం అనేది పర్యటకుల లో ఆకర్షణ పెరగడాని కి కారణం అవుతుందని ఆయన చెప్పారు. వారాణసీ లోని కాశీ విశ్వనాథ్ ధామ్ ను ఆయన ఒక ఉదాహరణ గా పేర్కొంటూ, ఆ ప్రదేశం లో పునర్ నిర్మాణ పనులు జరగక ముందు ఒక సంవత్సర కాలం లో ఆ ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య దాదాపు గా 80 లక్షలు గా ఉంది, నవీకరణ అనంతరం కిందటి ఏడాది లో యాత్రికుల సంఖ్య 7 కోట్ల ను మించిపోయింది అన్నారు. కేదార్ ఘాటీ లో పునర్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడాని కి ముందు కాలం లో కేవలం 4-5 లక్షల మంది బాబా కేదార్ ను దర్శించుకోగా, తరువాతి కాలంలో భక్తజనుల సంఖ్య 15 లక్షల కు పెరిగింది అని కూడా ఆయన వెల్లడించారు. ఇదే మాదిరిగా గుజరాత్ లోని పావాగఢ్ లో మాత కాళిక ను దర్శించుకోవడం కోసం పునరుద్ధరణ పనులు జరుగక ముందు 4 వేల నుండి 5 వేల మంది మాత్రమే వెళ్తుండే వారు కాస్తా తదనంతర కాలం లో యాత్రికుల సంఖ్య 80 వేల కు చేరుకొందన్నారు. సదుపాయాల ను పెంచడం అనేది పర్యటకుల సంఖ్య పై నేరు గా ప్రభావాన్ని కలుగ జేస్తోందని, యాత్రికుల సంఖ్య పెరుగుతోంది అంటే దాని అర్థం ఉపాధి కల్పన కు మరియు స్వతంత్రోపాధి కల్పన కు మరిన్ని అవకాశాలు ఏర్పడుతున్నాయి అనే అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రపంచం లో కెల్లా అతి ఎత్తయినటువంటి విగ్రహం అయిన ‘ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఆ విగ్రహం ఏర్పాటు పూర్తి అయిన ఒక ఏడాది కాలం లోపలే 27 లక్షల మంది యాత్రికులు ఆ స్థలాన్ని చూశారు అని వెల్లడించారు. పౌర సదుపాయాలు పెరుగుతూ ఉండడం, చక్కని డిజిటల్ కనెక్టివిటీ, మంచి హోటళ్ళు, ఇంకా ఆసుపత్రులు ఏర్పాటు కావడం, ఎలాంటి చెత్త చెదారం లేకుండా పోవడం మరియు ఉత్కృష్టమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటి తో భారతదేశం లో పర్యటక రంగం అనేక రెట్లు పెంపొందగలదు అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి గుజరాత్ లోని అహమదాబాద్ లో ఉన్న కాంకరియా లేక్ ప్రాజెక్టు ను గురించి కూడా ప్రస్తావిస్తూ, ఆ సరస్సు యొక్క పునరభివృద్ధి పనుల ను చేపట్టడం తో పాటు గా అక్కడి ఫూడ్ స్టాల్స్ లో పని చేసే వారి నైపుణ్యాని కి మెరుగులు దిద్దే కార్యాన్ని కూడా చేపట్టడం జరిగిందని తెలియ జేశారు. ప్రవేశ రుసుము ఉన్నప్పటికీ కూడా ఆ ప్రదేశాన్ని దాదాపు గా 10,000 మంది నిత్యం సందర్శిస్తున్నారు అని ఆయన తెలియజేస్తూ, ఆధునిక మౌలిక సదుపాయాల కు తోడు పరిశుభ్రత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ‘‘ప్రతి పర్యటక ప్రదేశం తనది అయినటువంటి రాబడి నమూనా ను రూపొందించుకోవచ్చు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘మన గ్రామాలు పర్యటన కేంద్రాలు గా మారుతున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మారుమూల పల్లెల లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నందువల్ల ఆ గ్రామాలు పర్యటన చిత్రపటం లోకి ఆ గ్రామాలు కూడా చేరుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. సరిహద్దు వెంబడి ఉన్నటువంటి పల్లెల కోసమని కేంద్ర ప్రభుత్వం వైబ్రాంట్ విలేజ్ స్కీము ను ప్రారంభించిందని ఆయన చెప్తూ, హోం స్టేస్, చిన్న హోటళ్ళు, రెస్టరాన్ ల వంటి వ్యాపారాల కు సమర్ధన ను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భారతదేశం లో విదేశీ యాత్రికుల సంఖ్య పెరుగుతూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ప్రస్తావిస్తూ, భారతదేశం పట్ల ఆకర్షణ పెరుగుతోంది, గత ఏడాది జనవరి నెల లో 2 లక్షల మంది విదేశీ యాత్రికులు తరలి రాగా, ఆ సంఖ్య తో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి లో భారతదేశాని కి వచ్చిన విదేశీ యాత్రికుల సంఖ్య 8 లక్షలు గా ఉంది అని తెలిపారు. అటువంటి యాత్రికుల వివరాల ను దగ్గర పెట్టుకొని, గరిష్ఠ స్థాయి లో డబ్బు ను ఖర్చు పెట్టే స్తోమత కలిగిన యాత్రికుల ను దేశం లోకి వచ్చేటట్లు గా ఆకర్షించడం కోసం ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. భారతదేశాని కి విచ్చేసే విదేశీ యాత్రికులు సగటు న 1700 యుఎస్ డాలర్ ను వెచ్చిస్తుంటారని, అదే అంతర్జాతీయ ప్రయాణికులు అమెరికా లో అయితే గనుక సరాసరి 2500 యుఎస్ డాలర్ ను ఖర్చు చేస్తారని, ఆస్ట్రేలియా లో ఈ మొత్తం 5000 డాలర్ వరకు ఉంటుందని ఆయన వివరించారు. ‘‘అధికం గా డబ్బు ను ఖర్చు పెట్టే పర్యటకుల కు భారతదేశం మరెంతో అందించ గలుగుతుంది’’ అని ఆయన చెప్పారు. ఈ భావన తో జత పడడం కోసం ప్రతి ఒక్క రాష్ట్రం తన పర్యటన సంబంధి విధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పక్షి సమూహాల ను చూస్తూ ఆనందించే వారు దేశం లో నెలల తరబడి బస చేస్తుంటారు అని ఆయన ఒక ఉదాహరణ గా చెప్తూ, అటువంటి తాహతు ఉన్న, అటువంటి స్తోమత లు ఉన్న పర్యటకుల ను ఆకట్టుకోవడం కోసం విధానాల ను రూపొందించాలని నొక్కి చెప్పారు.

పర్యటన రంగాని కి ఎదురయ్యేటటువంటి మౌలికమైన సవాలు ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, ఇక్కడ వృత్తి కౌశలం కలిగినటువంటి తగినంతమంది టూరిస్ట్ గైడ్ లు లేరని, గైడ్ స్ కోసం స్థానిక కళాశాల లలో సర్టిఫికెట్ కోర్సు ల ను నిర్వహించవలసిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. ఒక ఫలానా పర్యాటక ప్రదేశం లో పని చేస్తున్న గైడ్ లకు ఒక యూనిఫార్మ్ గాని లేదా ప్రత్యేకమైన దుస్తులు గాని ఉన్నట్లయితే పర్యటకులు వారిని తొలి చూపు లోనే గుర్తు పట్టగలుగుతారని ఆయన సూచించారు. ఒక టూరిస్టు మనస్సు లో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి; ఆ ప్రశ్నలు అన్నింటి కీ సమాధానాల ను రాబట్టుకోవడం లో వారి కి గైడ్ లు తోడ్పడవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం లోని పాఠశాల విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులు ఈశాన్య ప్రాంతాల కు ప్రయాణించేటట్టు వారిని ప్రోత్సహించాలని కూడా ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, దీని ద్వారా మరింత ఎక్కువ మంది చైతన్యవంతులవుతారని, పర్యటకుల కోసం మౌలిక సదుపాయాల ను, సౌకర్యాల ను అభివృద్ధి పరచడం మొదలవుతుందని ఆయన వివరించారు. వివాహాల కోసం ప్రత్యేకం గా కొన్ని ప్రదేశాల ను తీర్చిదిద్దాలని, అదే విధం గా క్రీడా ప్రధానమైన ప్రదేశాల ను కూడా తీర్చిదిద్దాలని ఆయన ఉద్ఘాటించారు. 50 పర్యటన ప్రదేశాల ను అభివృద్ధి పరచాలని, అదే జరిగితే ప్రపంచం అంతటి నుండి ప్రతి యాత్రికుడు, ప్రతి యాత్రికురాలు భారతదేశాన్ని తప్పక సందర్శిస్తారని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పర్యటక ప్రదేశాల కు సంబంధించిన ఏప్స్ ను ఐక్య రాజ్య సమితి లో గుర్తింపు ను పొందినటువంటి అన్ని భాషల లోను అభివృద్ధి పరచాలి అని కూడా ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ వెబినార్ పర్యటన రంగాని కి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని గంభీరం గా పరిశీలించి, మెరుగైన పరిష్కార మార్గాల ను సూచించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘వ్యవసాయం, స్థిరాస్తి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇంకా వస్త్రాల రంగాల వలెనే పర్యటన రంగం లో సమాన అవకాశాలు ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

Speaking at a post-budget webinar on boosting India's tourism potential. https://t.co/0LHwqWLDe2

— Narendra Modi (@narendramodi) March 3, 2023

भारत में हमें टूरिज्म सेक्टर को नई ऊंचाई देने के लिए Out of the Box सोचना होगा और Long Term Planning करके चलना होगा। pic.twitter.com/Mwp8UG6RML

— PMO India (@PMOIndia) March 3, 2023

भारत के संदर्भ में देखें तो टूरिज्म का दायरा बहुत बड़ा है। pic.twitter.com/5KqMErKjfa

— PMO India (@PMOIndia) March 3, 2023

जब यात्रियों के लिए सुविधाएं बढ़ती हैं, तो कैसे यात्रियों में आकर्षण बढ़ता है, उनकी संख्या में भारी वृद्धि होती है, ये भी हम देश में देख रहे हैं। pic.twitter.com/ZQ8GEhsEDv

— PMO India (@PMOIndia) March 3, 2023

बेहतर होते इंफ्रास्ट्रक्चर के कारण हमारे दूर-सुदूर के गांव, अब टूरिज्म मैप पर आ रहे हैं। pic.twitter.com/cAecutjVEJ

— PMO India (@PMOIndia) March 3, 2023

 

***

DS/TS

 

  


(Release ID: 1903913) Visitor Counter : 231