గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

జార్ఖండ్‌లో మెగా రోజ్‌గార్ మేళా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా

Posted On: 02 MAR 2023 1:27PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

• జార్ఖండ్‌లోని సరైకేలా ఖర్స్వాన్ జిల్లాలో 4 మార్చి 2023న మెగా రోజ్‌గార్ మేళా (ఉద్యోగ మేళా)ను నిర్వహణ

• మేళాను ప్రారంభించనున్న కేంద్ర రిజన వ్యవహారాల మంత్రి   శ్రీ అర్జున్ ముండా

                • మెగా జాబ్ ఫెయిర్‌లో గిరిజనకు యువత పుష్కలంగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం

                • జార్ఖండ్‌లో ఆటోమోటివ్ రంగం వృద్ధికి తోడ్పడేందుకు గాను  జాబ్ ఫెయిర్

 

2023 మార్చి 4వ తేదీన సరైకేలా జిల్లాలోని కాశీ సాహు కళాశాలలో ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎస్డీసీ) నిర్వహించే అప్రెంటీస్‌షిప్ రోజ్‌గార్ మేళా (జాబ్ మేళా) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి  కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి  శ్రీ అర్జున్ ముండా ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించనున్నారు.  మెగా జాబ్ మేళా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా ఉంటుంది. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీలు హాజరవుతాయి. గిరిజన యువత ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలకు శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు కావడానికి ఉద్యోగ అవకాశాలను అందిస్తారు.  ఈ మేళాకు సమీప ప్రాంతాల నుంచి వేలాది మంది గిరిజన అభ్యర్థులు హాజరవుతారని అంచనా. జాబ్ మేళా జార్ఖండ్‌లోని విద్యార్థులకు మరియు ఆటోమోటివ్ రంగానికి ఒక ముఖ్యమైన కార్యక్రమం. గిరిజన విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు కంపెనీలు తమ యూనిట్లకు సరైన ప్రతిభను కనుగొనడానికి ఒక వేదికను అందిస్తుంది, గిరిజన యువతకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పనిచేయడానికి సరైన అవకాశాలను అందిస్తుంది. సెప్టెంబర్ 2022లో, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇలాంటి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడింది.. ఖుంటి, సరైకేలా, చైబాసా మరియు సిమ్‌డేగాలో 2-రోజుల పాటు ఇలాంటి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడింది. ఖుంటికి చెందిన 488 మంది బాలికలలో 387 మంది, సరైకేలా నుండి 331 మంది బాలికలలో 152 మంది, సిమ్‌డెగా నుండి 1071 మంది బాలికలలో 846 మంది మరియు చైబాసా నుండి 715 మంది బాలికలలో 513 మంది రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అర్హత సాధించారు, వీరు తమిళనాడు.హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు పొందారు.  గౌరవనీయులైన ప్రధాన మంత్రి జన్మదినం పురస్కరించుకొని సేవా పఖవాడా జరుపుకుంటున్న సందర్భంగా గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా కృషితో ఈ డ్రైవ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గొప్ప స్పందన లభించింది మరియు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుండి 2600 మందికి పైగా బాలికలు మరియు యువతులు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నారు, 2 రోజుల్లో 1898 మంది బాలికలు ఎంపికయ్యారు. జార్ఖండ్ మరియు దేశంలోని ఇతర గిరిజన ప్రాంతాలలో ఆటోమోటివ్ రంగం వృద్ధికి తోడ్పడటానికి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడుతుందని ఆశిస్తున్నారు.

*******



(Release ID: 1903797) Visitor Counter : 142