కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపు ఢిల్లీలో పోటీ చట్టం ఎకనామిక్స్ ఎనిమిదో జాతీయ సమావేశం

Posted On: 02 MAR 2023 3:34PM by PIB Hyderabad

పోటీ చట్టం ఎకానామిక్స్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రేపు (శుక్రవారం) ఢిల్లీలో 8వ విడత జాతీయ సదస్సును నిర్వహించనుంది. సీసీఐ 2016 నుండి ప్రతి సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ ప్రారంభ సెషన్‌లో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్లీనరీ సెషన్ మరియు రెండు టెక్నికల్ సెషన్‌లు ఉంటాయి. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్‌లో ప్లీనరీ ‘యాంటిట్రస్ట్ అండ్ రెగ్యులేషన్: ఇంటర్‌ఫేస్‌లు మరియు సినర్జీలు’ అనే అంశంపై జరుగనుంది. విధి లీగల్ వ్యవస్థాపకుడు మరియు రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ అర్ఘ్య సేన్‌గుప్తా షెడ్యూల్ చేయబడిన ప్లీనరీ సెషన్‌కు మోడరేటర్‌గా ఉన్నారు.  రెండు టెక్నికల్ సెషన్‌లకు ఎన్.ఎల్.యు ఢిల్లీకి చెందిన విశిష్ట ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్. సాహూ మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మాజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఆదిత్య భట్టాచార్జియా అధ్యక్షత వహించనున్నారు. కాన్ఫరెన్స్ అనేది ఎకనామిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లాపై ఆసక్తిని పెంపొందించడానికి మరియు కొనసాగించడానికి యాంటీట్రస్ట్ ఆర్థికవేత్తల యొక్క క్లిష్టమైన సమూహాన్ని సృష్టించే దిశగా ఒక ప్రయత్నం. ఇది పోటీ చట్టం యొక్క ఆర్థిక శాస్త్రంలో పనిచేసే పండితులు, అభ్యాసకులు, విద్యావేత్తలు మరియు నిపుణులను ఒక వేదికపైకి  చేర్చుతుంది. కాన్ఫరెన్స్‌లో నాలెడ్జ్ షేరింగ్ మరియు చర్చలు నిర్దిష్ట సెషన్‌లకు మించి ఉంటాయి. చట్టం అమలుకు ఆర్థిక ఆధారాన్ని అందిస్తాయి.

సదస్సు యొక్క లక్ష్యాలు:-

ఎ. పోటీ చట్టం యొక్క ఎకనమక్స్ రంగంలో సమకాలీన సమస్యలపై పరిశోధన మరియు చర్చను ప్రేరేపించడానికి,

బి. భారతీయ సందర్భానికి సంబంధించిన పోటీ సమస్యలపై మంచి అవగాహనను పెంపొందించుకోవడానికి మరియు

సి. భారతదేశంలో పోటీ చట్టాన్ని అమలు చేయడానికి అనుమితులను జారీ దిశగా చర్యలు.

 

****


(Release ID: 1903795) Visitor Counter : 190