వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీ ఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ మరియు జాతీయ రవాణా విధానం (NLP) రెండూ కలిసి వ్యాపారాలు మరియు ప్రజలు రెండింటికీ గొప్పగా సహాయపడతాయి: శ్రీ పీయూష్ గోయల్


గతిశక్తి పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి మరియు భారతదేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి, భారతదేశం వృద్ధి పై ప్రపంచానికి విశ్వాసం ఇస్తుంది: శ్రీ పీయూష్ గోయల్

ఈ రోజు ప్రపంచం భారతదేశాన్ని ఆవిష్కరణల నాయకుడిగా గుర్తిస్తోంది: శ్రీ పీయూష్ గోయల్

గతిశక్తి మౌలిక సదుపాయాలలో ఉన్న క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడమే కాకుండా సామాజిక మౌలిక సదుపాయాలను మరింత మెరుగ్గా ప్రణాళిక రూపకల్పన చేయడంలో సహాయపడుతుంది: శ్రీ పీయూష్ గోయల్

Posted On: 02 MAR 2023 2:35PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ పీ ఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ మరియు జాతీయ రవాణా విధానం (NLP) కలిసి వ్యాపారాలు మరియు ప్రజలు ఇద్దరికీ, పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి, భారతదేశంలో పెట్టుబడులు పెంపొందించడానికి గొప్పగా సహాయపడతాయని  మరియు భారతదేశం ఎదుగుతోందని ప్రపంచానికి నమ్మకం కలిగుతోందని అన్నారు.

ఈరోజు న్యూఢిల్లీలో గతిశక్తిపై ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసిసి) జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. గతిశక్తి వంటి కీలకమైన చొరవతో నిమగ్నమవ్వడానికి ఢిల్లీకి వచ్చినందుకు తూర్పు భారతదేశంలో ఉన్న ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) పట్ల శ్రీ గోయల్ తన ప్రశంసలను వ్యక్తం చేశారు.

 

శ్రీ గోయల్ మాట్లాడుతూ నేడు ప్రపంచం భారతదేశాన్ని ఆవిష్కరణల నాయకుడిగా గుర్తించిందని అన్నారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ వంటి కార్యక్రమాలను సుపరిపాలన, జీవన సౌలభ్యం మరియు వ్యాపార సౌలభ్యం కోసం భారతదేశం కొత్త సాధనాలను వేగంగా అభివృద్ధి చేస్తోందని ఆయన అన్నారు. పశ్చిమ దేశాల కొత్త ఆలోచనలు మరియు సాంకేతికత ఆవిర్భవించడానికి మరియు మన వ్యాపారాలకు మరియు మన ప్రజలకు సహాయం చేయడానికి వాటిని స్వీకరించడానికి భారతదేశం దశాబ్దాలుగా వేచి ఉండాల్సిన రోజులు పోయాయని ఆయన గమనించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఫ్రేమ్‌వర్క్‌ను భారతదేశం యొక్క సాంకేతిక నైపుణ్యానికి ఉదాహరణగా మరియు దేశ ఆర్థిక వ్యవస్థపై లోతైన ప్రభావాన్ని చూపిన చొరవగా ఆయన ఉదహరించారు. గత ఏడాది డిసెంబర్‌లో,  భారతదేశం ఒక నెలలో 7.28 బిలియన్ల డిజిటల్ ఆర్థిక లావాదేవీలను నిర్వహించిందని ఆయన తెలియజేశారు. డిజిటల్ ఆర్థిక లావాదేవీల కోసం ప్రపంచం ఇప్పుడు యూ పీ ఐ ని అనుసరించాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

సాంకేతికత మరియు కొత్త ఆలోచనలలో భారతదేశం ఇప్పుడు రెండవ స్థానంలో లేదని, పీ ఎం గతి శక్తి చొరవ ఈ సామర్థ్యానికి మరో ఉదాహరణ అని మంత్రి ఉద్ఘాటించారు. అహ్మదాబాద్‌లో మౌలిక సదుపాయాలను మెరుగ్గా రూపకల్పన చేయడానికి జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించాలనే ఆలోచనను సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రధాని ఎలా రూపొందించారో ఆయన గుర్తు చేసుకున్నారు. బిజగ్ - ఎన్ ని ఏర్పాటు చేయడానికి  బిజగ్ ఏర్పడిన సంవత్సరాల్లో ప్రధాని దానిని చురుకుగా వినియోగించారని  మరియు ఇన్స్టిట్యూట్ రూపొందించిన డేటా పాయింట్లను ఉపయోగించి గుజరాత్‌లో మౌలిక సదుపాయాలను రూపకల్పన చేశారని ఆయన అన్నారు. ఫలితంగా, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నాణ్యత మరియు వేగం పరంగా గుజరాత్ అనేక ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని ఆయన అన్నారు.

 

మంత్రి పీఎం గతిశక్తిని వివరిస్తూ, దేశవ్యాప్తంగా వివిధ భౌగోళిక, పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అంశాలను మ్యాప్ చేసి సంగ్రహించిన డేటా పొరలను సృష్టించిందని వివరించారు. ప్రస్తుతం, అడవులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, నదులు, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో కూడిన దాదాపు 1300 లేయర్‌ల డేటా ఉందని, గతిశక్తి మౌలిక సదుపాయాల్లోని క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడమే కాకుండా పాఠశాలలు, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు మొదలైన సామాజిక మౌలిక సదుపాయాలను రూపొందించడంలో కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు. 

 

ఏ పీ ఐ ల ద్వారా గతిశక్తి డేటా లేయర్‌లు ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానం కలిగి  ఉన్నాయని, ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్‌ను గతిశక్తిలో ఉంచినట్లయితే, అది అమలులో ఉన్న సవాళ్లను విశిదీకరిస్తుంది మరియు ప్రాజెక్ట్‌ను మళ్లీ ఐక్య కార్యాచరణ చేయడంలో సహాయపడుతుంది, సమయం మరియు ఖర్చును ఆదా చేస్తుంది. 12 రాష్ట్రాలు తమ భూమిని డిజిటలైజ్ చేశాయని, ఇది ప్రణాళికను మరింత బలోపేతం చేసిందని ఆయన అన్నారు.

 

గతిశక్తిని ఏ రాష్ట్రం రాజకీయం చేయలేదని, ఇది మన వ్యాపారాలకు, మన ప్రజలకు మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థకు సహాయపడే చొరవ అని మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి రవాణా ధరను తగ్గించడం చాలా కీలకమని ఆయన అన్నారు. పీ ఎం గతిశక్తిని బాగా ఉపయోగించినట్లయితే, రవాణా ఖర్చులను విపరీతంగా తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని హైవేలు, రైల్వేలు, ఓడరేవులు మరియు విమానాశ్రయాలు గతిశక్తిపై మ్యాప్ చేయబడ్డాయి, ఇది ఖాళీలు లేని అనుసంధాన రవాణా నెట్‌వర్క్‌లను నిర్మించడంలో మరియు రవాణా ఆవరణ వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని సృష్టించడంలో సహాయపడుతుందని ఆయన చెప్పారు.

 

ప్యారిస్‌లో జరిగిన కాప్ 21లో  ఆమోదించబడిన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సమత మరియు సమతుల్యత కోసం న్యాయమైన ఒప్పందాన్ని డిమాండ్ చేయడానికి చిన్న మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు. ఈ రోజు ప్రతి ప్రపంచ నాయకుడు భారతదేశం వైపు చూస్తున్నారని, సవాలుగా ఉన్న ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రధాని మోడీ వైపు చూడని ప్రపంచం ఏదీ లేదని మంత్రి చెప్పారు.

 

ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం మరియు విద్యతో సహా తన పౌరుల జీవన ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని మంత్రి హైలైట్ చేశారు. భారతదేశ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ 500 మిలియన్లకు పైగా ప్రజలను కవర్ చేసిందని మరియు కొత్త విద్యా విధానం అన్ని విభాగాలలో ఆమోదించబడిందని మరియు ప్రశంసించబడిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు భారతదేశ జనాభాను, ముఖ్యంగా యువతను అత్యంత ఆకాంక్షించేలా చేశాయని శ్రీ గోయల్ చెప్పారు.

 

గతిశక్తి అనేది అసంఖ్యాకమైన లబ్దిదారుల సమగ్ర సంప్రదింపులు మరియు సమిష్టి, సహకార ప్రయత్నాల నుండి వచ్చిన జాతీయ విధానం అని మంత్రి నొక్కి చెప్పారు. దేశ ప్రజలలో తాను చూసిన ఉత్సాహంతో, అనేక రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన ప్రగతి తో 2047 నాటికి భారతదేశం 32 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని విశ్వాసం వ్యక్తం చేస్తూ ముగించారు

***


(Release ID: 1903791) Visitor Counter : 172