సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అయోధ్యలో పర్యటించనున్న శ్రీ అపూర్వ చంద్ర, ఆలయ నిర్మాణ స్థలంలో కార్మికులతో ముఖాముఖి
प्रविष्टि तिथि:
01 MAR 2023 8:22PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర గురువారం అయోధ్య నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, రామ మందిర నిర్మాణ స్థలాన్ని ఆయన సందర్శిస్తారు. ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న నిర్మాణ కార్మికులతో ముఖాముఖి మాట్లాడతారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందే ఆర్థిక, ఉపాధి అవకాశాల గురించి కూడా స్థానిక ప్రజలతో సంభాషిస్తారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో శ్రీ రాముడి ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది, చాలా భాగం పూర్తయింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 5 ఆగస్టు 2020న ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
*****
(रिलीज़ आईडी: 1903563)
आगंतुक पटल : 167