పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పై యూఎన్ఈపీ, ఆర్టీఎస్ఓఐ, ఐఐటీటీఎం సహకారంతో హైదరాబాద్ లో ప్రాంతీయ వర్క్ షాప్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 01 MAR 2023 1:53PM by PIB Hyderabad
సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి అమలు చేయాల్సిన చర్యలను చర్చించడానికి  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటిఎం), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యుఎన్ఇపి), బాధ్యతాయుత పర్యాటక సొసైటీ ఆఫ్ ఇండియా (ఆర్టిఎస్ఓఐ) సహకారంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2023 ఫిబ్రవరి 28 న హైదరాబాద్ లో మూడవ ప్రాంతీయ ప్రాంతీయ వర్క్ షాప్ నిర్వహించింది.  ఈ వర్క్ షాప్ కు  దక్షిణ ప్రాంతంలోని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ నుంచి సీనియర్ ప్రభుత్వ అధికారులు, పర్యాటక పరిశ్రమ భాగస్వాములు హాజరయ్యారు. 
 
 
వర్క్ షాప్ ను ఇండియా టూరిజం బెంగళూరు/ బెంగళూరు రీజినల్ డైరెక్టర్ శ్రీ మహమ్మద్ ఫరూక్  ప్రారంభించారు. వనరుల పరిమితిని పరిగణనలోకి తీసుకొని పర్యావరణ వ్యవస్థను పరిరక్షిస్తూ పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి చర్యలు అమలు జరగాలన్నారు. 
పర్యాటక రంగం సుస్థిర అభివృద్ధి సాధించడానికి రూపొందించిన పథకాలు కార్యరూపం దాల్చడానికి చర్యలు అమలు జరగాలని ఐఐటిటిఎమ్ డైరెక్టర్ శ్రీ అలోక్ శర్మ అన్నారు. పర్యాటక రంగం సుస్థిర అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల వివరాలు తెలియజేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ వర్క్ షాప్ ని ఏర్పాటు చేశామన్నారు. .
దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి  పర్యాటక మంత్రిత్వ శాఖ క కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేస్తున్న  స్వదేశ్ దర్శన్ 1.0 పథకం వివరాలను  పర్యాటక మంత్రిత్వ శాఖ శ్రీ అరవింద్ విశ్వనాథన్ వివరించారు.  స్వదేశ్ దర్శన్ 1.0  సాధించిన విజయాలను వివరించారు.  స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అమలు చేయనున్న పథకాల వివరాలను తెలిపారు. పర్యాటక రంగం సుస్థిర అభివృద్ధి సాధించడానికి స్వదేశ్ దర్శన్ 2.0 పథకం సహకరిస్తుందన్నారు. 
 పర్యాటకులను చైతన్యవంతులను చేయడం, బాధ్యతాయుతమైన పర్యాటక రంగం ఆవశ్యకత అంశంపై  ఆర్ టిఎస్ ఒఐ ప్రతినిధి శ్రీమతి మృదుల తంగిరాల ప్రతినిధులతో  చర్చించారు.  బాధ్యతాయుత పర్యాటకుల కోసం రూపొందించిన కార్యక్రమాన్ని వివరించిన శ్రీమతి మృదుల  బాధ్యతాయుత ప్రవర్తనపై పర్యాటకులకు అవగాహన కల్పించడానికి అమలు చేయాల్సిన చర్యలు వివరించారు.
 
 
పర్యాటక అభివృద్ధికి, పర్యాటక రంగంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి, 2021 నవంబర్ లో జరిగిన కాప్ 26 సమావేశాల్లో వాతావరణ మార్పులపై ఆమోదించిన గ్లాస్గో డిక్లరేషన్ అమలు చేయడానికి జరుగుతున్న చర్యలను యుఎన్ఇపి కి చెందిన  కౌశిక్ చంద్రశేఖర్ వివరించారు. పర్యాటక రంగంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్ర స్థాయిలో అమలు చేయాల్సిన చర్యలు, జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కౌశిక్ చంద్రశేఖర్ కోరారు.
దక్షిణాదికి చెందిన రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక శాఖల ప్రతినిధులు తమ అత్యుత్తమ సుస్థిర పర్యాటక పద్ధతులను వివరించారు. రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న  అనేక బీచ్ లు  బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లను పొందడం, పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించి  సాధించిన ఆర్థికాభివృద్ధి, బాధ్యతాయుతమైన పర్యాటక రంగం అభివృద్ధికి అమలు చేస్తున్న చర్యలు, గ్రామీణ పర్యాటక అభివృద్ధి కోసం అమలు చేస్తున్న చర్యలు,తమ ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకు  ప్రపంచ స్థాయి గుర్తింపు లభించేలా చూసేందుకు చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు వివరించారు.
సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ సస్టెయినబుల్ టూరిజం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ పాల్గొనేవారికి సస్టెయినబుల్ టూరిజం స్టాండర్డ్ ఫర్ ఇండియా (ఎస్టీసీఐ) ముఖ్యాంశాలను వివరించారు.  బాధ్యతాయుత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతినిధులు  ట్రావెల్ ఫర్ ఎల్ఐఎఫ్ఇ ప్రతిజ్ఞ తీసుకున్నారు. 
 
 
 
సుస్థిర పర్యాటకాన్ని అమలు చేయడానికి అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దక్షిణాది ప్రాంతాలలోని వివిధ ప్రాంతాల్లో సాధించిన విజయాలను పర్యాటక రంగం ప్రతినిధులు వివరించారు. తాము అమలు చేసిన విధానాలు సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు.. సుస్థిరత అభివృద్ధి సాధించడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించి అభివృద్ధి సాధించాలని   ఐహెచ్ సీఎల్ గ్రూప్ కు చెందిన తాజ్ కృష్ణ తెలిపారు.
సాహస పర్యాటక రంగం, వారసత్వ పర్యాటక రంగం, బీచ్ టూరిజం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలను ప్రతినిధులు చర్చించారు. 
 
   
 
జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం హరిత పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి కృషి చేయాలని ప్రతిపాదించింది.పర్యాటక రంగం సుస్థిర అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు  ప్రాంతీయ వర్క్ షాప్ ల నిర్వహణ ద్వారా మరింత పటిష్టంగా అమలు చేయడానికి దోహదపడతాయి.  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగానికి తగిన ప్రాధాన్యత కల్పించడానికి పర్యాటక రంగంపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తోంది.సుస్థిరత లక్ష్యాలను సాధించే దిశగా పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, పరిశ్రమ వర్గాల ద్వారా జరుగుతున్న ప్రయత్నాలు మరింత పటిష్టంగా అమలు జరగడానికి   ఈ వర్క్ షాప్ దోహదపడుతుంది. .
***

(Release ID: 1903513) Visitor Counter : 165