ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పౌరుల జీవితాలను మార్చడం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో మాట్లాడిన రోజున ఎం ఈ ఐ టీ వై గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రారంభించింది.
జీ ఏ సీ అనేది డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను డిజిటల్ వినియోగదారులకు జవాబుదారీగా చేసే పరోక్ష వివాద పరిష్కార విధానం
జీ ఏ సీలు కామన్ సర్వీస్ సెంటర్ల (CSCలు) ద్వారా అందుబాటులో ఉంటాయి
జీ ఏ సీ ఒక సంస్థగా భారతీయ ఇంటర్నెట్‌కు ఒక వెలుగురేఖ మరియు ఇంటర్నెట్‌ను సాదరమైన సురక్షితమైన & విశ్వసనీయ మరియు జవాబుదారీగా చేయడంలో ముఖ్యమైనది: ఎం ఓ ఎస్ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
28 FEB 2023 6:08PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రి, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీని ప్రారంభించారు. పెద్ద మరియు చిన్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగదారులకు జవాబుదారీగా చేసే పరోక్ష వివాద పరిష్కార యంత్రాంగాన్ని అందించే గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని ప్రారంభించిన శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
ఇటీవల సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని నిబంధనలలో జీ ఏ సీ ఒకటి. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన మూడు సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి.
"జీ ఏ సీలు అత్యంత పారదర్శకంగా పని చేస్తాయి మరియు వారి నిర్ణయాలన్నీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయి మరియు ప్రజలకు అందుబాటులో ఉంటాయి" అని ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎం ఈ ఐ టీ వై నిర్వహించిన “ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సుఖవంతమైన జీవనం ” అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన రోజున జీ ఏ సీ ప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, “టెక్నాలజీ పౌరులను ఎలా మారుస్తుందో ప్రధాని మాట్లాడారు. డీ బీ టీ, జే ఏ ఎం, ముఖ రహిత పన్ను వసూళ్ళు వంటి పథకాల ద్వారా జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడం ద్వారా జీవిస్తున్నారు. దానికి మరో అడుగు ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు జవాబుదారీతనాన్ని గణనీయంగా పెంచే అప్పీలేట్ బాడీ అయిన జీ ఏ సీని ప్రారంభించడం.
భారతీయ ఇంటర్నెట్‌కు మార్గదర్శకంగా ఉండే సంస్థగా జీ ఏ సీని పేర్కొన్న మంత్రి, సాదర, సురక్షిత, విశ్వసనీయ ఇంటర్నెట్ లో భాగంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా చేసే మొత్తం ఫ్రేమ్‌వర్క్‌లో జీ ఏ సీ మెకానిజం ఒక ముఖ్యమైన భాగమని మంత్రి అన్నారు. ఇది బహిర్గతం మరియు బహిరంగ పరిశీలన సంస్కృతిని సృష్టిస్తుందని అని ఆయన అన్నారు.
"ఇది మా ప్రభుత్వ అభిప్రాయాలు, విధానాలు మరియు వివాదాలను పరిష్కరించడానికి సులభమైన మార్గాలను సృష్టించే దృష్టికి కొనసాగింపు, అలాగే ఇది డిజిటల్ వినియోగదారులకు పన్నులకు సంబంధించిన లేదా ఇతర ఫిర్యాదులకు పరిష్కారం" అని ఆయన చెప్పారు.
మధ్యవర్తుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసేలా చూడడమే జీ ఏ సీ వెనుక ఉన్న దృక్పథమని మంత్రి పునరుద్ఘాటించారు.
లాంచ్‌లో సోషల్ మీడియా మధ్యవర్తులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులే కాకుండా సెక్రటరీ (మీటీవై), శ్రీ అమిత్ అగర్వాల్, అదనపు కార్యదర్శి (మీటీవై) మరియు గ్రూప్ కోఆర్డినేటర్ (మీటీవై) శ్రీ అల్కేష్ కుమార్ శర్మ న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. డిజిటల్ వినియోగదారులకు మధ్యవర్తి యొక్క గ్రీవెన్స్ ఆఫీసర్ నుండి కమ్యూనికేషన్ అందిన తేదీ నుండి 30 రోజుల వ్యవధిలో జీ ఏ సీ లతో అప్పీల్ ఫైల్ చేయవచ్చు. ఈ కమిటీ 30 రోజుల వ్యవధిలో వినియోగదారు యొక్క అప్పీల్‌ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. GAC ప్లాట్‌ఫారమ్‌ను క్రింది లింక్‌లో యాక్సెస్ చేయవచ్చు:
https://www.gac.gov.in.
***
(Release ID: 1903311)
Visitor Counter : 162