గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బడ్జెట్ అనంతర వెబినార్ సీరీస్ లో భాగంగా, "పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం" అనే అంశంపై, 2023 మార్చి, 1వ తేదీన ప్రసంగించనున్న - ప్రధానమంత్రి
మ్యాన్-హోల్ నుండి మెషిన్-హోల్ కు మారడాన్ని నిర్ధారించడానికి అన్ని నగరాల్లో యాంత్రిక పారిశుద్ధ్య సౌకర్యాలు; తడి, పొడి చెత్త నిర్వహణ; గోబర్ధన్ పథకం కింద వ్యర్ధాల నుంచి సంపద ప్లాంట్లు; పట్టణ ప్రణాళికా సంస్కరణలతో పాటు; "ప్రధానమంత్రి-ప్రణాం" ద్వారా ప్రాసెస్ చేసిన తడి వ్యర్థాల పరిధి; ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకం 2023-24’; టైర్-2, టైర్-3 నగరాల కోసం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యు.ఐ.డి.ఎఫ్); వినియోగ ఛార్జీలు, ఆస్తి పన్ను సంస్కరణల రింగ్ ఫెన్సింగ్ వంటి బడ్జెట్ ప్రకటనలపై ఈ వెబినార్ లో చర్చించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, అంకురసంస్థలు / ఎం.ఎస్.ఎం.ఈ. లు, విద్యాసంస్థలు, పౌర సమాజం నుండి వాటాదారులు, నిపుణులు అమలు వ్యూహం, కార్యాచరణ ప్రణాళికలపై ప్రసంగిస్తారు
వ్యర్ధ్యాల నుంచి సంపద; సఫాయి మిత్ర సురక్ష (మ్యాన్-హోల్ టు మెషిన్-హోల్), పట్టణ ప్రణాళికా సంస్కరణల అమలు; పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అనే నాలుగు ఉప ఇతివృత్తాలతో సమాంతరంగా సదస్సులు జరుగుతాయి.
प्रविष्टि तिथि:
28 FEB 2023 6:44PM by PIB Hyderabad
బడ్జెట్ అనంతర వెబినార్ సీరీస్ లో భాగంగా, ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’ అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2023 మార్చి, 1వ తేదీ ఉదయం 10 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు.
ఈ వెబినార్ కి గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) నాయకత్వం వహిస్తుండగా. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.ఈ.ఎఫ్. & సి. సి) సహ-నాయకత్వం వహిస్తోంది. ఇందులో భాగంగా -సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.ఎస్.జ్.ఏ), తాగునీరు, పారిశుద్ధ్య శాఖ (డి.డి.డబ్ల్యూ.ఎస్), జల శక్తి మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.జె.ఎస్) సమన్వయంతో వివిధ అంశాలకు సంబంధించిన బడ్జెట్ ప్రకటనలపై చర్చలు ఉంటాయి.
సఫాయిమిత్రలు, ప్రముఖ ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, ఆర్థిక సంస్థలు, పట్టణ ప్లానర్లు, పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధనా సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మొదలైన క్షేత్ర స్థాయి ప్రజలు ఈ వెబినార్ చేరి తమ సమాచారాన్నీ, అభిప్రాయాలను, ఈ సందర్భంగా పంచుకుంటారు.
బడ్జెట్ ప్రకటనలకు సంబంధించిన -మ్యాన్-హోల్ నుండి మెషిన్-హోల్‌కు మారడాన్ని నిర్ధారించడానికి అన్ని నగరాల్లో యాంత్రిక పారిశుద్ధ్య సౌకర్యాలు; తడి, పొడి చెత్త నిర్వహణ; గోబర్ధన్ పథకం కింద వ్యర్ధాల నుంచి సంపద ప్లాంట్లు; "ప్రధానమంత్రి-ప్రణాం" ద్వారా ప్రాసెస్ చేసిన తడి వ్యర్థాల పరిధి; పట్టణ ప్రణాళికా సంస్కరణలతో పాటు; ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకం 2023-24’; టైర్-2, టైర్ 3 నగరాల కోసం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యు.ఐ.డి.ఎఫ్); వినియోగ ఛార్జీలు, ఆస్తి పన్ను సంస్కరణల రింగ్ ఫెన్సింగ్ వంటి అమలు వ్యూహం తో కూడిన ప్రణాళికలను సంబంధిత భాగస్వాములు సిద్ధం చేస్తారు.
వెబినార్‌లో భాగంగా, నాలుగు సమాంతర బ్రేక్-అవుట్ సెషన్‌లు. వ్యర్థాల నుంచి సంపద,సఫాయి మిత్ర సురక్ష (మ్యాన్-హోల్ టు మెషిన్ హోల్), పట్టణ ప్రణాళికా సంస్కరణలు, కార్యాచరణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి మొదలైన అంశాల గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది.
ఈ ప్లీనరీ ముగింపు సదస్సులో భాగంగా కేంద్ర మంత్రుల సమక్షంలో నిర్వహించిన పైన పేర్కొన్న బ్రేక్-అవుట్ చర్చా గోష్టుల సారాంశాన్ని మోడరేటర్లు క్రోడీకరించారు.
***
(रिलीज़ आईडी: 1903309)
आगंतुक पटल : 136