ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢల్లీిలో రేపు 47 వ సివిల్‌ అకౌంట్స్‌ దినోత్సవాలు

Posted On: 28 FEB 2023 1:07PM by PIB Hyderabad

ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపు న్యూఢల్లీిలోని జన్‌పథ్‌ లోగల డాక్టర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌సెంటర్‌ లో 47వ  సివిల్‌అకౌంట్స్‌ డే ఉత్సవాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శ్రీ పంకజ్‌చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరౌతారు.
ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐసిఎఎస్‌) ను 1976 లో ఏర్పాటు చేశారు. పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో తీసుకువచ్చిన  చారిత్రాత్మక సంస్కరణలకు అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారు.  కేంద్ర ప్రభుత్వ ఖాతాల నిర్వహణను ఆడిట్‌ నుంచి వేరు చేసిన తర్వాత దీనిని ఏర్పాటు చేశారు. ఫలితంగా కంప్ట్రోలర్‌ , ఆడిటర్‌జనరల్‌ ఆఫ్‌ ఇండియా కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఇందుకు సంబంధించి రెండు ఆర్డినెన్సులు జారీ అయ్యాయి. అవి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (విధులు, అధికారాలు, సర్వీసునిబంధనల) ఆర్డినెన్స్‌ 1976 అలాగే,  డిపార్టమెంటలైజేషన్‌ ఆఫ్‌ యూనియన్‌ అకౌంట్స్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పర్సనల్‌ ) ఆర్డినెన్స్‌ 1976 లను రాష్ట్రపతి 1976 మార్చి 1 వ తేదీన జారీచేశారు. ఆడిట్‌నుంచి కేంద్రప్రభుత్వ ఖాతాల నిర్వహణను వేరు చేసేందుకు వీలుగా వీటిని తీసుకువచ్చారు. ఇది డిపార్టమెంటలైజ్‌డ్‌ ఖాతాలకు వీలు కల్పించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మార్చి 1 వ తేదీని ఈ సంస్థ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.

కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌, భారత ప్రభుత్వానికి ప్రధాన అకౌంటింగ్‌ సలహాదారు.ఈ సంస్థ దేశ పేమెంట్‌, అకౌంటింగ్‌ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది.  ఈ సంస్థ ఆయా ఖాతాల పరిశీలన ద్వారా ఆర్థిక జవాబుదారిత్వం ఉండేలా చూస్తుంది.అలాగే తగిన సమాచారంతో పాలనాయంత్రాంగం తగిన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. ఇది ఏర్పడినప్పటినుంచి క్రమక్రమంగా వృద్ధిచెందుతూ వస్తోంది.ప్రస్తుతం ఇది  కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్‌ ఫైనాన్స్‌ను నిర్వహణలో నైపుణ్యాన్ని కనబరుస్తూ పాలనను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది.  బడ్జెట్‌ రూపకల్పన, చెల్లింపులు, ఖాతాల నిర్వహణ, పెన్షన్‌చెల్లింపులలో చురుకైన, విశ్వసనీయమైన, బాధ్యతాయుత వ్యవస్థను ఏర్పరచడం ఈ సంస్థ లక్ష్యం. అలాగే వివిధ మంత్రిత్వశాఖలలో సమీకృత సమాచార వ్యవస్థలు, నిర్ణయాలకు మద్దతు నిచ్చే వ్యవస్థలు (డిఎస్‌ఎస్‌) ప్రపంచశ్రేణిలో ఉండేట్టు చేయడం దీని లక్ష్యం. దీనితోపాటు ఈ సంస్థ మెరుగైన పారదర్శకత, జవాబుదారిత్వానికి వీలు కల్పిస్తూ అంతర్గత ఆడిట్‌కు సంబంధించి  కొత్త విధానాన్ని అభివృద్ధిచేసేందుకు కృషిచేస్తోంది. వృత్తిపరమైన  నిబద్దత, సమర్థతను ప్రోత్సహించడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ,  అంకితభావం కలిగిన సిబ్బందిని ఇది తయారుచేస్తోంది. .  సివిల్‌ అకౌంట్స్‌ ఆర్గనైజేషన్‌ పలు సంవత్సరాలుగా ఆధునీకరణ బాటపడుతూ ప్రస్తుతతం ఎలక్ట్రానిక్‌  వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పబ్లిక్‌ ఫైనాన్షియల్‌  మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ (పిఎఫ్‌ఎంఎస్‌) ను ప్రారంభించింది. ఇది వెబ్‌ ఆధారిత పోర్టల్‌.ఇది  ప్లాన్‌స్కీమ్‌ మానిటరింగ్‌ వ్యవస్థ. దీనిని మరింత విస్తృత పరిచి భారత ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ లోని వివిధ అంశాలకు దీనిని   విస్తృత పరిచారు.

పిఎఫ్‌ఎంఎస్‌కు దాని కొత్త రూపంలో దేశంలో ఆర్థిక పాలనలో కీలకంగా మారింది. ప్రభుత్వానికి విలువ  ఆధారిత సేవలైన ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు, జిఎస్టీ రిఫండ్‌ ప్రాసెసింగ్‌, రాష్ట్రాలకు విడుదలయ్యే నిధుల  పర్యవేక్షణ, నాన్‌ టాక్స్‌ రిసీట్‌ పోర్టల్‌ తదితరాల ద్వారా ఆటోమేటింగ్‌ నాన్‌ టాక్స్‌ రిసీట్స్‌ వంటి వాటిని  
నాన్‌ టాక్స్‌ రిసీట్స్‌ పోర్టల్‌ తదితరాల ద్వారా ప్రాసెస్‌ వంటి వాటికి పిఎఫ్‌ఎంఎస్‌ వీలు కల్పిస్తోంది. పిఎఫ్‌ఎంఎస్‌ పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్కరణలకు సంబంధించి ప్రధాన వ్యవస్థగా ఎదిగింది. పిఎంఎంఎస్‌ రోజువారీ, నెల వారీ, వార్షిక ప్రభుత్వ ఖాతాలను రియల్‌ టైమ్‌ లో ప్రాసెస్‌ చేస్తోంది.  అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ సేవలు అందిస్తోంది. ఇది ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల రూపకల్పన, వాటి అమలుకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

.పిఎఫ్‌ఎంఎస్‌, దేశ రుణ నిర్వహణ, నగదు నిర్వహణను టజ్రరీ సింగిల్‌ అకౌంట్స్‌ సిస్టం (టిఎస్‌ఎ) ద్వారా
సంస్కరించింది. దీనిని ఇతర కేంద్ర వ్యయాలు, కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్ర నోడల్‌ ఏజెన్సీ వ్యవస్థ(సిఎన్‌ఎ), కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ (ఎస్‌.ఎన్‌.ఎ) వంటి వాటికి వర్తింపచేసింది. దీనితో దేశంలో నగదు లావాదేవీల పరిస్థితి మెరుగుపడిరది. ఫలితంగా రుణ వ్యయం తగ్గింది. పిఎఫ్‌ఎంఎస్‌ కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రప్రభుత్వాలకు, ఇతర అమలు ఏజెన్సీలకు నిధులను సక్రమంగా పంపిణీ చేయడం, ఆయా పథకాలు నిర్దేశిత లక్ష్యాలు సాధించేలా చూడడానికి పిఎఫ్‌ఎంఎస్‌ వీలు కల్పిస్తోంది.

రాబడి, చెల్లింపుల నిబంధనల సవరణ వలలష్ట్రÊ ఈ బిల్లు వ్యవస్థ, ట్రజరీ సింగిల్‌ అకౌంట్‌ వ్యవస్థ అమలు చేయడానికి వీఉల కలిగింది. అలాగే కేంద్రానికి సంబంధించి, అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధుల పంపిణీలోచేసిన మార్పులు ఆయా పథకాల ఆర్థిక పాలనను మరింత మెరుగుపరిచింది. ఇది పారదర్శకతకు, జవాబుదారిత్వానికి పెద్దపీట వేసింది. సివిల్‌ అకౌంట్స్‌ ఆర్గనైజేషన్‌ చేపడుతున్న అంతర్గత ఆడిట్‌ కార్యకలాపం కార్యనిర్వాహక విభాగానికి అదనపు విలువను జోడిస్తోంది. ఇది ఆయా ప్రక్రియలను, వ్యవస్థలను ఒక పద్ధతి ప్రకారం అంచనా వేయడం వల్ల ఇది సంస్థలో తగిన నియంత్రణల బలోపేతానికి  ఉపకరిస్తుంది.

***



(Release ID: 1903205) Visitor Counter : 112